Jeremiah 3:17 in Telugu 17 ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు.
Other Translations King James Version (KJV) At that time they shall call Jerusalem the throne of the LORD; and all the nations shall be gathered unto it, to the name of the LORD, to Jerusalem: neither shall they walk any more after the imagination of their evil heart.
American Standard Version (ASV) At that time they shall call Jerusalem the throne of Jehovah; and all the nations shall be gathered unto it, to the name of Jehovah, to Jerusalem: neither shall they walk any more after the stubbornness of their evil heart.
Bible in Basic English (BBE) At that time Jerusalem will be named the seat of the Lord's kingdom; and all the nations will come together to it, to the name of the Lord, to Jerusalem: and no longer will their steps be guided by the purposes of their evil hearts.
Darby English Bible (DBY) At that time they shall call Jerusalem the throne of Jehovah; and all the nations shall be gathered unto it, to the name of Jehovah, to Jerusalem; and they shall no more walk after the stubbornness of their evil heart.
World English Bible (WEB) At that time they shall call Jerusalem the throne of Yahweh; and all the nations shall be gathered to it, to the name of Yahweh, to Jerusalem: neither shall they walk any more after the stubbornness of their evil heart.
Young's Literal Translation (YLT) At that time they cry to Jerusalem, `O throne of Jehovah,' And gathered unto her hath been all the nations, For the name of Jehovah, to Jerusalem, Nor do they go any more after the stubbornness of their evil heart.
Cross Reference Genesis 8:21 in Telugu 21 యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.
Numbers 15:39 in Telugu 39 మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని, మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండేలా ఇదివరకు కోరిన వాటిని బట్టి, చూసిన వాటిని బట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి.
Deuteronomy 29:29 in Telugu 29 రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.”
Judges 2:19 in Telugu 19 ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయినప్పుడెల్లా వాళ్ళు వెనక్కు తిరిగి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, పూజిస్తూ, వాటికి సాగిలపడుతూ ఉండేవారు. వారు అలా తమ క్రియల్లోగాని, తమ మూర్ఖ ప్రవర్తనలోగాని దేనినీ విడిచిపెట్టకుండా వాళ్ళ పూర్వికుల కంటే ఇంకా భ్రష్టులై పోయారు.
Psalm 78:8 in Telugu 8 ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు.
Psalm 87:3 in Telugu 3 దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా
Isaiah 2:2 in Telugu 2 చివరి రోజుల్లో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.
Isaiah 6:1 in Telugu 1 రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి.
Isaiah 26:8 in Telugu 8 న్యాయమైన నీ తీర్పుల బాటలో మేం నీ కోసం వేచి ఉన్నాము. నీ పేరు, నీ జ్ఞాపకాలే మా ప్రాణాలు కోరుకుంటున్నాయి.
Isaiah 49:18 in Telugu 18 అటూ ఇటూ చూడు. వాళ్ళంతా కలిసి నీ దగ్గరికి వస్తున్నారు. నా జీవం తోడని యెహోవా ఇలా చెబుతున్నాడు. “నువ్వు వీళ్ళందరినీ ఆభరణంగా ధరించుకుంటావు. పెళ్ళికూతురులాగా నువ్వు వారిని ధరించుకుంటావు.
Isaiah 56:6 in Telugu 6 విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరిస్తూ నా నిబంధనను ఆధారం చేసుకుంటూ యెహోవాకు సేవకులై యెహోవా నామాన్ని ప్రేమిస్తూ ఆయన్ని ఆరాధించడానికి ఆయన పక్షం చేరే విదేశీయులను నా పరిశుద్ధ పర్వతానికి తీసుకు వస్తాను.
Isaiah 59:19 in Telugu 19 పడమటి దిక్కున ఉన్నవాళ్ళు యెహోవా నామానికి భయపడతారు. సూర్యోదయ దిక్కున ఉన్నవాళ్ళు ఆయన మహిమకు భయపడతారు. యెహోవా ఊపిరితో కొట్టుకుపోయే ప్రవాహంలాగా ఆయన వస్తాడు.
Isaiah 60:3 in Telugu 3 రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు.
Isaiah 66:1 in Telugu 1 యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?
Isaiah 66:20 in Telugu 20 అన్ని రాజ్యాల్లో నుంచి మీ సోదరులందరినీ యెహోవాకు అర్పణగా వాళ్ళు తీసుకు వస్తారు. వారిని గుర్రాల మీద రథాల మీద బండ్ల మీద కంచర గాడిదల మీద ఒంటెల మీద ఎక్కించి యెరూషలేములోని నా పవిత్ర పర్వతానికి వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యాన్ని యెహోవా మందిరంలోకి తెస్తారు.
Jeremiah 7:24 in Telugu 24 అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.
Jeremiah 9:14 in Telugu 14 తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.’
Jeremiah 11:8 in Telugu 8 అయినా వారు తమ దుష్టహృదయంతో, మూర్ఖులై నడుచుకుంటూ నామాట వినలేదు. ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవమని చెప్పినా వారు వినలేదు కాబట్టి నేను ఆ నిబంధనలోని శాపాలన్నిటినీ వారి మీదికి రప్పిస్తాను.”
Jeremiah 14:21 in Telugu 21 నీ పేరును బట్టి మిమ్మల్ని గౌరవించేలా మమ్మల్ని తోసివేయవద్దు. మాతో నువ్వు చేసిన నిబంధనను గుర్తు చేసుకో. దాన్ని భంగం చేయవద్దు.
Jeremiah 16:12 in Telugu 12 వినండి. మీరంతా నా మాట వినకుండా మీ చెడ్డ హృదయ కాఠిన్యం ప్రకారం నడుచుకుంటున్నారు. మీరు మీ పూర్వీకుల కంటే మరి ఎక్కువ దుర్మార్గం చేశారు.
Jeremiah 17:12 in Telugu 12 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది.
Jeremiah 18:12 in Telugu 12 అందుకు వాళ్ళు “మేము తెగించాము. మేము మా సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తాం. మేము ఒక్కొక్కరం మా హృదయంలోని దుర్మార్గం ప్రకారం ప్రవర్తిస్తాం” అంటారు.
Jeremiah 31:23 in Telugu 23 ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, “ప్రజలను నేను తమ దేశానికి తిరిగి తీసుకొచ్చిన తరువాత, యూదా దేశంలో, దాని పట్టణాల్లో ప్రజలు ఇలా అంటారు, ‘పవిత్ర పర్వతమా, న్యాయశీలి నివసించే ప్రదేశమా, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక,’
Ezekiel 1:26 in Telugu 26 వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.
Ezekiel 43:7 in Telugu 7 “నరపుత్రుడా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య ఎల్లప్పుడూ నివసిస్తాను. ఇకమీదట వారు తమ అపనమ్మకత్వం వలనా తమ రాజుల కళేబరాలకు ఉన్నత స్థలాలను కట్టి పూజలు చేయడం వలనా వారు గాని, వారి రాజులు గాని నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు.
Micah 4:1 in Telugu 1 చివరిరోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
Zechariah 2:11 in Telugu 11 ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు.
Zechariah 8:20 in Telugu 20 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “జాతులు, అనేక పట్టణాల నివాసులు ఇంకా వస్తారు.
Romans 1:21 in Telugu 21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది.
Romans 6:14 in Telugu 14 మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.
2 Corinthians 10:4 in Telugu 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
Galatians 4:26 in Telugu 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.
Ephesians 4:17 in Telugu 17 కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను.