Jeremiah 11:11 in Telugu 11 కాబట్టి యెహోవా చెప్పేదేమంటే “వారు తప్పించుకోలేని విపత్తును వారి మీదికి రప్పిస్తాను, వారు నన్ను ఎంత వేడుకున్నా నేను వినను.
Other Translations King James Version (KJV) Therefore thus saith the LORD, Behold, I will bring evil upon them, which they shall not be able to escape; and though they shall cry unto me, I will not hearken unto them.
American Standard Version (ASV) Therefore thus saith Jehovah, Behold, I will bring evil upon them, which they shall not be able to escape; and they shall cry unto me, but I will not hearken unto them.
Bible in Basic English (BBE) So the Lord has said, I will send evil on them, which they will not be able to get away from; and they will send up a cry for help to me, but I will not give ear to them.
Darby English Bible (DBY) Therefore thus saith Jehovah: Behold, I will bring evil upon them, from which they shall not be able to escape; and they will cry unto me, and I will not hearken unto them.
World English Bible (WEB) Therefore thus says Yahweh, Behold, I will bring evil on them, which they shall not be able to escape; and they shall cry to me, but I will not listen to them.
Young's Literal Translation (YLT) Therefore thus said Jehovah: Lo, I am bringing in unto them evil, That they are not able to go out from, And they have cried unto Me, And I do not hearken unto them.
Cross Reference 2 Kings 22:16 in Telugu 16 యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.
2 Chronicles 34:24 in Telugu 24 ‘వినండి, నేను ఈ స్థలం మీదికీ, దానిలో నివసించేవారి మీదికీ విపత్తు తీసుకు రాబోతున్నాను, యూదా రాజు ఎదుట చదివి వినిపించిన గ్రంథంలో రాసిన శాపాలన్నీ రప్పిస్తాను.
Psalm 18:41 in Telugu 41 వారు సాయం కోసం మొరపెట్టారు గాని వాళ్ళను రక్షించడానికి ఎవరూ రాలేదు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు గాని ఆయన వాళ్లకు జవాబివ్వలేదు.
Psalm 66:18 in Telugu 18 నేను నా హృదయంలో పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి అంగీకరించడు.
Proverbs 1:28 in Telugu 28 అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను.
Proverbs 29:1 in Telugu 1 చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.
Isaiah 1:15 in Telugu 15 మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి.
Isaiah 24:17 in Telugu 17 భూనివాసులారా, మీ మీదికి భయం వచ్చింది. గుంట, ఉరి మీకు దాపురించాయి.
Jeremiah 6:19 in Telugu 19 భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.
Jeremiah 11:14 in Telugu 14 కాబట్టి యిర్మీయా, నువ్వు ఈ ప్రజల కోసం ప్రార్థన చేయవద్దు. వారి పక్షంగా అంగలార్చవద్దు, వేడుకోవద్దు. వారు తమ విపత్తులో నాకు మొర పెట్టినపుడు నేను వినను.
Jeremiah 11:17 in Telugu 17 ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.”
Jeremiah 14:12 in Telugu 12 వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”
Jeremiah 15:2 in Telugu 2 “మేమెక్కడికి వెళ్ళాలి?” అని వాళ్ళు నిన్నడితే నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, చావు కోసం ఏర్పాటైన వాళ్ళు చావుకూ, కత్తి కోసం ఏర్పాటైన వాళ్ళు కత్తికీ, కరువు కోసం ఏర్పాటైన వాళ్ళు కరువుకూ, చెరకు ఏర్పాటైన వాళ్ళు చెరకూ వెళ్ళాలి.
Jeremiah 19:3 in Telugu 3 “యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
Jeremiah 19:15 in Telugu 15 “సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”
Jeremiah 23:12 in Telugu 12 కాబట్టి చీకట్లో వాళ్ళ దారి జారిపోయే నేలలాగా ఉంటుంది. వాళ్ళను గెంటేస్తారు. వాళ్ళు దానిలో పడిపోతారు. వాళ్ళను శిక్షించే సంవత్సరంలో వాళ్ళ మీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
Jeremiah 35:17 in Telugu 17 కాబట్టి, ఇశ్రాయేలు దేవుడూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘చూడు, నేను వాళ్ళతో మాట్లాడాను గాని వాళ్ళు వినలేదు. నేను వాళ్ళను పిలిచాను గాని వాళ్ళు పలకలేదు. గనుక యూదా, యెరూషలేము నివాసులందరి మీదకీ తీసుకొస్తానని నేను చెప్పిన కీడంతా వాళ్ళ మీదకి తీసుకురాబోతున్నాను.’”
Jeremiah 36:31 in Telugu 31 వాళ్ళ దోషాన్ని బట్టి అతన్నీ, అతని సంతతినీ, అతని సేవకులనూ నేను శిక్షిస్తాను. నేను వాళ్ళ గురించి చెప్పిన కీడంతా వాళ్ళ మీదకీ, యెరూషలేము, యూదా ప్రజల మీదకీ తీసుకొస్తానని మిమ్మల్ని బెదిరించినా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు.”
Ezekiel 7:5 in Telugu 5 ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం. చూడండి! అది వచ్చేస్తూ ఉంది.
Ezekiel 8:18 in Telugu 18 కాబట్టి నేను వాళ్ళ మధ్య నా పని జరిగిస్తాను. నా దృష్టిలో వాళ్ళ పట్ల నాకెలాంటి కనికరమూ ఉండదు. నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా చెవిలో ఎంత పెద్ద స్వరంతో ఏడ్చినా నేను వినను.”
Amos 2:14 in Telugu 14 చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.
Amos 5:19 in Telugu 19 ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
Amos 9:1 in Telugu 1 బలిపీఠం దగ్గర ప్రభువు నిలబడి ఉండడం నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు. “గడపలు కదలిపోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు. పై కప్పు అందరి తలల మీదా పడేలా వాటిని పగలగొట్టు. తరువాత మిగిలిపోయిన వారిని నేను కత్తితో చంపుతాను. ఎవడూ పారిపోలేడు. ఎవడూ తప్పించుకోలేడు.
Micah 3:4 in Telugu 4 ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు కానీ ఆయన వారికి జవాబివ్వడు. మీరు చెడు పనులు చేశారు. కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”
Zechariah 7:13 in Telugu 13 కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను.
Luke 13:24 in Telugu 24 దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను.
1 Thessalonians 5:3 in Telugu 3 ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.
Hebrews 1:3 in Telugu 3 దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
Revelation 6:16 in Telugu 16 వారు, “మీరు మా మీద పడండి! సింహాసనంపై కూర్చున్న ఆయన ముఖకాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి.