Jeremiah 10:12 in Telugu 12 ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
Other Translations King James Version (KJV) He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his discretion.
American Standard Version (ASV) He hath made the earth by his power, he hath established the world by his wisdom, and by his understanding hath he stretched out the heavens:
Bible in Basic English (BBE) He has made the earth by his power, he has made the world strong in its place by his wisdom, and by his wise design the heavens have been stretched out.
Darby English Bible (DBY) He hath made the earth by his power, he hath established the world by his wisdom, and hath stretched out the heavens by his understanding.
World English Bible (WEB) He has made the earth by his power, he has established the world by his wisdom, and by his understanding has he stretched out the heavens:
Young's Literal Translation (YLT) The maker of the earth by His power, The establisher of the world by His wisdom, Who, by His understanding, stretched forth the heavens,
Cross Reference Genesis 1:1 in Telugu 1 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.
Genesis 1:6 in Telugu 6 దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరుచేయు గాక” అన్నాడు.
Job 9:8 in Telugu 8 ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు.
Job 26:7 in Telugu 7 ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు.
Job 38:4 in Telugu 4 నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.
Psalm 24:2 in Telugu 2 ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.
Psalm 33:6 in Telugu 6 యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.
Psalm 78:69 in Telugu 69 అంతరిక్షంలాగా, తాను శాశ్వతంగా స్థిరపరచిన భూమిలాగా అయన తన మందిరాన్ని కట్టించాడు.
Psalm 93:1 in Telugu 1 యెహోవా పరిపాలన చేస్తున్నాడు. ప్రభావం ధరించుకున్నాడు. యెహోవా బలం ధరించాడు, బలాన్ని నడికట్టుగా కట్టుకున్నాడు. లోకం సుస్థిరంగా ఉంది, అది కదలదు.
Psalm 104:2 in Telugu 2 ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు.
Psalm 104:24 in Telugu 24 యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది.
Psalm 119:90 in Telugu 90 నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
Psalm 136:5 in Telugu 5 ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Psalm 146:5 in Telugu 5 యాకోబు దేవుడు ఎవరికి సహాయంగా ఉంటాడో, తమ దేవుడైన యెహోవా మీద ఎవరు ఆశాభావం పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు.
Psalm 148:4 in Telugu 4 అంతరిక్షంలో ఉన్న నగరాల్లారా, ఆయనను స్తుతించండి. ఆకాశంపై ఉన్న జలాశయాల్లారా ఆయనను స్తుతించండి.
Proverbs 3:19 in Telugu 19 తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.
Proverbs 30:4 in Telugu 4 ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా?
Isaiah 40:22 in Telugu 22 ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు.
Isaiah 42:5 in Telugu 5 ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,
Isaiah 44:24 in Telugu 24 గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.
Isaiah 45:12 in Telugu 12 భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.
Isaiah 45:18 in Telugu 18 ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు. నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు. ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.
Isaiah 48:13 in Telugu 13 నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.
Isaiah 49:8 in Telugu 8 యెహోవా ఇలా చెబుతున్నాడు, “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను.
Jeremiah 10:13 in Telugu 13 ఆయన స్వరం ఆకాశమండలంలో నీటి గర్జనలాగా వినిపిస్తుంది. భూదిగంతాల్లో నుండి ఆయన ఆవిరి మేఘాలు వచ్చేలా చేస్తాడు. వర్షంతో బాటు ఆయన మెరుపులు పుట్టిస్తాడు. తన గిడ్డంగుల నుండి గాలిని పంపిస్తాడు.
Jeremiah 32:17 in Telugu 17 “అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
Jeremiah 51:15 in Telugu 15 తన శక్తితో ఈ భూమిని చేసిన వాడు తన జ్ఞానంతో పొడి నేలను ఏర్పాటు చేశాడు. తన వివేచనతో ఆకాశాలను విశాలపరిచాడు.
Zechariah 12:1 in Telugu 1 ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా.
John 1:3 in Telugu 3 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు.
Colossians 1:16 in Telugu 16 ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి.