Ezekiel 16:46 in Telugu 46 నీ ఎడమవైపు నివసించే షోమ్రోనూ, దాని కుమార్తెలూ నీకు అక్కలు, నీ కుడివైపు నివసించే సొదొమ, దాని కుమార్తెలూ నీకు చెల్లెళ్ళు.
Other Translations King James Version (KJV) And thine elder sister is Samaria, she and her daughters that dwell at thy left hand: and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom and her daughters.
American Standard Version (ASV) And thine elder sister is Samaria, that dwelleth at thy left hand, she and her daughters; and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom and her daughters.
Bible in Basic English (BBE) Your older sister is Samaria, living at your left hand, she and her daughters: and your younger sister, living at your right hand, is Sodom and her daughters.
Darby English Bible (DBY) And thine elder sister is Samaria that dwelleth at thy left hand, she and her daughters; and thy younger sister, that dwelleth at thy right hand, is Sodom and her daughters.
World English Bible (WEB) Your elder sister is Samaria, who dwells at your left hand, she and her daughters; and your younger sister, who dwells at your right hand, is Sodom and her daughters.
Young's Literal Translation (YLT) And thine elder sister `is' Samaria, she and her daughters, Who is dwelling at thy left hand, And thy younger sister, who is dwelling on thy right hand, `is' Sodom and her daughters.
Cross Reference Genesis 13:10 in Telugu 10 లోతు యొర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు నాశనం చెయ్యక ముందు సోయరుకు వచ్చే వరకూ ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలే ఐగుప్తు దేశంలో నీళ్ళు పారే ప్రాంతంలాగా ఉంది.
Genesis 14:8 in Telugu 8 అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో
Genesis 18:20 in Telugu 20 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక
Genesis 19:24 in Telugu 24 అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు.
Genesis 19:29 in Telugu 29 ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు.
Deuteronomy 29:23 in Telugu 23 యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి,
Deuteronomy 32:32 in Telugu 32 వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. వాటి గెలలు చేదు.
Isaiah 1:9 in Telugu 9 జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.
Jeremiah 3:8 in Telugu 8 ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది.
Jeremiah 23:14 in Telugu 14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
Lamentations 4:6 in Telugu 6 నా ప్రజల కుమారి చేసిన పాపం సొదొమ పాపం కంటే ఎక్కువ. ఎవరూ దాని మీద చెయ్యి వెయ్యకుండానే అకస్మాత్తుగా అది పడిపోయింది.
Ezekiel 16:27 in Telugu 27 కాబట్టి చూడు! నేను నీకు విరోధినై నీకు తిండి లేకుండా చేస్తాను. నీ వ్యభిచార క్రియలనుబట్టి నిన్ను సిగ్గు పరచడానికి, నీ శత్రువులైన ఫిలిష్తీయుల కూతుళ్ళ చేతికి నీ ప్రాణం అప్పగిస్తాను.
Ezekiel 16:48 in Telugu 48 నువ్వూ, నీ కూతుళ్ళూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ గాని, దాని కూతుళ్ళు గాని చెయ్యలేదని నా జీవం తోడు, ప్రమాణం చేస్తున్నాను” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ezekiel 16:51 in Telugu 51 షోమ్రోను కూడా నీ పాపాల్లో సగమైనా చెయ్యలేదు. వాళ్ళకన్నా నువ్వు అత్యధికంగా అసహ్యకార్యాలు చేశావు. నువ్వు ఇన్ని అసహ్యమైన పనులు చేసి, నీ సోదరి నీకన్నా మెరుగైనదిగా కనబడేలా చేశావు.
Ezekiel 16:53 in Telugu 53 నేను సొదొమను, దాని కూతుళ్ళనూ, షోమ్రోను, దాని కూతుళ్ళనూ గతంలో ఉన్న సౌభాగ్యానికి తెస్తాను. కాని నీ భాగ్యం వాళ్ళలా ఉండదు.
Ezekiel 16:61 in Telugu 61 అప్పుడు నువ్వు నీ అక్కలను చెల్లెళ్ళను కలుసుకున్నప్పుడు గతంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన గుర్తు చేసుకుంటావు. వారిని నీకు కూతుర్లుగా ఇస్తాను, అయితే నిబంధన మూలంగా కాదు.
Ezekiel 23:4 in Telugu 4 వాళ్ళల్లో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె చెల్లి పేరు ఒహొలీబా. వీళ్ళను నేను పెళ్లి చేసుకున్నప్పుడు, నాకు కొడుకులనూ, కూతుళ్ళనూ కన్నారు. ఒహొలా అనే పేరుకు షోమ్రోను, ఒహొలీబా అనే పేరుకు యెరూషలేము అని అర్థం.
Ezekiel 23:11 in Telugu 11 దాని చెల్లెలైన ఒహొలీబా దాన్ని చూసి, కామంలో దాన్ని మించిపోయి, అక్క చేసిన వ్యభిచారం కంటే ఇంకా అధికంగా పోకిరీతనం జరిగించింది.
Ezekiel 23:31 in Telugu 31 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే నీ అక్క తాగిన, లోతైన వెడల్పైన పాత్రలోనిది నీవు కూడా తాగాలి.
Ezekiel 26:6 in Telugu 6 బయటి పొలాల్లో ఉన్న దాని కూతుళ్ళు కత్తి పాలవుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకుంటారు.”
Hosea 11:8 in Telugu 8 ఎఫ్రాయిమూ, నేనెలా నిన్ను విడిచిపెడతాను? ఇశ్రాయేలూ, నేను నిన్ను శత్రువులకు ఎలా అప్పగిస్తాను? అద్మాలాగా నిన్ను నేను ఎలా చేస్తాను? సెబోయీముకు చేసినట్టు నీకు ఎలా చేస్తాను? నా మనస్సు మారింది. నా కనికరం రేగింది.
Micah 1:5 in Telugu 5 ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? అది సమరయ కాదా? యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? అది యెరూషలేము కాదా?
Luke 17:28 in Telugu 28 లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు.
2 Peter 2:6 in Telugu 6 దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు.
Jude 1:7 in Telugu 7 అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.
Revelation 11:8 in Telugu 8 వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.