Deuteronomy 31:6 in Telugu 6 నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. భయపడవద్దు. వాళ్ళను చూసి కంగారు పడవద్దు. మీతో వచ్చేవాడు మీ యెహోవా దేవుడే. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు, మర్చిపోడు.”
Other Translations King James Version (KJV) Be strong and of a good courage, fear not, nor be afraid of them: for the LORD thy God, he it is that doth go with thee; he will not fail thee, nor forsake thee.
American Standard Version (ASV) Be strong and of good courage, fear not, nor be affrighted at them: for Jehovah thy God, he it is that doth go with thee; he will not fail thee, nor forsake thee.
Bible in Basic English (BBE) Be strong and take heart, and have no fear of them: for it is the Lord your God who is going with you; he will not take away his help from you.
Darby English Bible (DBY) Be strong and courageous, fear them not, neither be afraid of them; for Jehovah thy God, he it is that goeth with thee; he will not leave thee, nor forsake thee.
Webster's Bible (WBT) Be strong and of a good courage, fear not, nor be afraid of them: for the LORD thy God, he it is that doth go with thee, he will not fail thee, nor forsake thee.
World English Bible (WEB) Be strong and of good courage, don't be afraid, nor be scared of them: for Yahweh your God, he it is who does go with you; he will not fail you, nor forsake you.
Young's Literal Translation (YLT) be strong and courageous, fear not, nor be terrified because of them, for Jehovah thy God `is' He who is going with thee; He doth not fail thee nor forsake thee.'
Cross Reference Numbers 14:9 in Telugu 9 కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
Deuteronomy 1:29 in Telugu 29 అప్పుడు నేను మీతో “దిగులు పడొద్దు, భయపడొద్దు.
Deuteronomy 4:31 in Telugu 31 మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.
Deuteronomy 7:18 in Telugu 18 మీ యెహోవా దేవుడు ఫరోకీ ఐగుప్తు దేశానికి చేసిన దాన్ని, అంటే ఆయన మిమ్మల్ని బయటికి తెచ్చినప్పుడు
Deuteronomy 20:1 in Telugu 1 “మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
Deuteronomy 20:3 in Telugu 3 ‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.
Deuteronomy 31:7 in Telugu 7 మోషే యెహోషువను పిలిచి, “నువ్వు నిబ్బరంగా, ధైర్యంగా నిలబడు. యెహోవా ఈ ప్రజలకిస్తానని వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వీరితోబాటు వెళ్లి దాన్ని వారికి స్వాధీనం చెయ్యాలి.
Deuteronomy 31:23 in Telugu 23 యెహోవా నూను కొడుకు యెహోషువకు ఇలా చెప్పాడు. “నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నువ్వు వాళ్ళని నడిపించాలి. నేను నీకు తోడుగా ఉంటాను.”
Joshua 1:5 in Telugu 5 నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను.
Joshua 1:9 in Telugu 9 నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”
Joshua 10:25 in Telugu 25 అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.
1 Chronicles 22:13 in Telugu 13 యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారంగా, ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగా, లోబడడానికి జాగ్రత్త పడితే నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు. భయపడొద్దు, దిగులు పడొద్దు.
1 Chronicles 28:10 in Telugu 10 పరిశుద్ధ స్థలంగా ఉండడానికి ఒక మందిరాన్ని కట్టించడానికి యెహోవా నిన్ను కోరుకున్న సంగతి గుర్తించి ధైర్యంగా ఉండి, అది జరిగించు” అన్నాడు.
1 Chronicles 28:20 in Telugu 20 ఇంకా దావీదు తన కొడుకు సొలొమోనుతో “నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకుని ఈ పనికి పూనుకో. భయపడొద్దు, కంగారు పడొద్దు. నా దేవుడైన యెహోవా నీతో ఉంటాడు. యెహోవా మందిర సేవను గూర్చిన పనంతా నువ్వు ముగించే వరకూ ఆయన నిన్ను ఎంతమాత్రం విడిచిపెట్టడు.
2 Chronicles 32:7 in Telugu 7 “ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. అష్షూరురాజు గురించి గానీ అతనితో ఉన్న సైన్యమంతటి గురించి గానీ మీరు భయపడవద్దు, హడలిపోవద్దు. అతనితో ఉన్న వాడి కంటే మనతో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు.
Psalm 27:1 in Telugu 1 దావీదు కీర్తన. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?
Psalm 27:14 in Telugu 14 యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు! ధైర్యం తెచ్చుకుని నీ హృదయాన్ని బలంగా ఉంచుకో! యెహోవా కోసం కనిపెట్టుకుని ఉండు!
Isaiah 41:10 in Telugu 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను. నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి. దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.
Isaiah 41:13 in Telugu 13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.
Isaiah 43:1 in Telugu 1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు, “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.
Isaiah 51:12 in Telugu 12 నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?
Haggai 2:4 in Telugu 4 అయినా యెహోవా ఇచ్చే ఆజ్ఞ. జెరుబ్బాబెలూ, ధైర్యం తెచ్చుకో. ప్రధానయాజకుడు, యెహోజాదాకు కొడుకు యెహోషువా, ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న ప్రజలారా, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సేనల ప్రభువైన యెహోవా వాక్కు.
Zechariah 8:13 in Telugu 13 యూదాప్రజలారా, ఇశ్రాయేలుప్రజలారా, మీరు అన్యప్రజల్లో ఏ విధంగా శాపానికి గురి అయి ఉన్నారో ఆలాగే మీరు ఆశీర్వాదానికి నోచుకునే వారుగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. భయపడక ధైర్యం తెచ్చుకోండి.
Luke 12:32 in Telugu 32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం.
1 Corinthians 16:13 in Telugu 13 మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
Ephesians 6:10 in Telugu 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
2 Timothy 2:1 in Telugu 1 నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు.
Hebrews 13:5 in Telugu 5 డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు.
Revelation 21:8 in Telugu 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.