1 Samuel 2:10 in Telugu 10 యెహోవాతో వాదులాడేవారు నాశనమైపోతారు. పరలోకం నుండి ఆయన వారి మీద ఉరుములాగా గర్జిస్తాడు. భూదిగంతాల ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. తాను నిలబెట్టిన రాజుకు ఆయన బలమిస్తాడు. తాను అభిషేకించినవాడికి అధికమైన బలం కలిగిస్తాడు.”
Other Translations King James Version (KJV) The adversaries of the LORD shall be broken to pieces; out of heaven shall he thunder upon them: the LORD shall judge the ends of the earth; and he shall give strength unto his king, and exalt the horn of his anointed.
American Standard Version (ASV) They that strive with Jehovah shall be broken to pieces; Against them will he thunder in heaven: Jehovah will judge the ends of the earth; And he will give strength unto his king, And exalt the horn of his anointed.
Bible in Basic English (BBE) Those who make war against the Lord will be broken; against them he will send his thunder from heaven: the Lord will be judge of the ends of the earth, he will give strength to his king, lifting up the horn of him on whom the holy oil has been put.
Darby English Bible (DBY) They that strive with Jehovah shall be broken to pieces; in the heavens will he thunder upon them. Jehovah will judge the ends of the earth; and he will give strength unto his king, and exalt the horn of his anointed.
Webster's Bible (WBT) The adversaries of the LORD shall be broken to pieces; out of heaven shall he thunder upon them: the LORD shall judge the ends of the earth; and he shall give strength to his king, and exalt the horn of his anointed.
World English Bible (WEB) Those who strive with Yahweh shall be broken to pieces; Against them will he thunder in the sky: Yahweh will judge the ends of the earth; He will give strength to his king, Exalt the horn of his anointed.
Young's Literal Translation (YLT) Jehovah -- broken down are His adversaries, Against them in the heavens He thundereth: Jehovah judgeth the ends of earth, And giveth strength to His king, And exalteth the horn of His anointed.'
Cross Reference Exodus 15:6 in Telugu 6 యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.
Judges 5:31 in Telugu 31 యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి. ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు” అని పాడారు. ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
1 Samuel 7:10 in Telugu 10 సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.
1 Samuel 12:3 in Telugu 3 ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”
1 Samuel 12:13 in Telugu 13 మీరు ఇష్టపూర్వకంగా నియమించుకొన్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీపైన రాజుగా నిర్ణయించాడు.
1 Samuel 12:18 in Telugu 18 సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.
1 Samuel 15:28 in Telugu 28 అప్పుడు సమూయేలు అతనితో ఇలా చెప్పాడు “ఈ రోజే యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని నీ చేతిలో నుండి తీసివేసి నీ సాటి వారిలో ఉత్తముడైన వేరొకరికి దాన్ని అప్పగించాడు.
1 Samuel 16:1 in Telugu 1 యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.”
2 Samuel 7:8 in Telugu 8 కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.
2 Samuel 7:13 in Telugu 13 అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను.
2 Samuel 22:14 in Telugu 14 యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు.
Job 40:9 in Telugu 9 దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా?
Psalm 2:2 in Telugu 2 భూరాజులు కుమ్మక్కై యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ విరోధంగా నిలబడ్డారు. పాలకులు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు.
Psalm 2:6 in Telugu 6 నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను.
Psalm 2:9 in Telugu 9 ఇనపదండంతో నువ్వు వాళ్ళను నలగగొడతావు, మట్టి కుండలాగా వాళ్ళను ముక్కలు చెక్కలు చేస్తావు.
Psalm 18:13 in Telugu 13 యెహోవా ఆకాశంలో ఉరిమాడు! సర్వోన్నతుడు సింహనాదం చేసి వడగళ్ళు, మండుతున్న నిప్పులు కుమ్మరించాడు.
Psalm 20:6 in Telugu 6 యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు.
Psalm 21:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. యెహోవా, రాజు నీ బలాన్నిబట్టి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇచ్చిన రక్షణనుబట్టి అతడు ఎంతగానో హర్షిస్తున్నాడు!
Psalm 21:7 in Telugu 7 ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు.
Psalm 28:8 in Telugu 8 యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.
Psalm 45:7 in Telugu 7 నువ్వు నీతిని ప్రేమించావు. దుర్మార్గతను అసహ్యించుకున్నావు. కాబట్టి దేవుడు, నీ దేవుడు నిన్ను నీ సహచరులకంటే ఎక్కువగా ఆనందతైలంతో అభిషేకించాడు.
Psalm 50:1 in Telugu 1 ఆసాపు కీర్తన శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.
Psalm 68:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
Psalm 89:17 in Telugu 17 వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.
Psalm 89:24 in Telugu 24 నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.
Psalm 92:9 in Telugu 9 యెహోవా, నీ శత్రువులను చూడు, చెడ్డపనులు చేసే వాళ్ళంతా చెదరిపోతారు.
Psalm 96:13 in Telugu 13 లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు. నీతితో ఆయన లోకానికి తన విశ్వసనీయతతో ప్రజా సమూహాలకు ఆయన తీర్పు తీరుస్తాడు.
Psalm 98:9 in Telugu 9 లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.
Psalm 148:14 in Telugu 14 ఆయన తన ప్రజలకు రెట్టింపు ఘనత కలిగించాడు. అది ఆయన భక్తులకు, ఆయన శరణు కోరిన ఇశ్రాయేలు ప్రజలకు గర్వకారణంగా ఉన్నది. యెహోవాను స్తుతించండి.
Ecclesiastes 11:9 in Telugu 9 యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. నీ యువదశలో మనసారా సంతోషించు. నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో.
Ecclesiastes 12:14 in Telugu 14 ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.
Isaiah 32:1 in Telugu 1 ఇదిగో, వినండి! ఒక రాజు నీతిమంతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అధిపతులు న్యాయసమ్మతంగా ఏలుబడి చేస్తారు.
Isaiah 45:24 in Telugu 24 ‘యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి’ అని ప్రజలు నా గురించి చెబుతారు.” మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.
Matthew 25:31 in Telugu 31 “మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
Matthew 25:34 in Telugu 34 తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి.
Matthew 28:18 in Telugu 18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
Luke 1:69 in Telugu 69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
Luke 19:27 in Telugu 27 మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”
John 5:21 in Telugu 21 “తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
Acts 4:27 in Telugu 27 ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా
Acts 10:38 in Telugu 38 అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
Romans 14:10 in Telugu 10 అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.
2 Corinthians 5:10 in Telugu 10 మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.
Revelation 20:11 in Telugu 11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.