Zephaniah 3:13 in Telugu 13 ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు. అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.”
Other Translations King James Version (KJV) The remnant of Israel shall not do iniquity, nor speak lies; neither shall a deceitful tongue be found in their mouth: for they shall feed and lie down, and none shall make them afraid.
American Standard Version (ASV) The remnant of Israel shall not do iniquity, nor speak lies; neither shall a deceitful tongue be found in their mouth; for they shall feed and lie down, and none shall make them afraid.
Bible in Basic English (BBE) The rest of Israel will do no evil and say no false words; the tongue of deceit will not be seen in their mouth: for they will take their food and their rest, and no one will be a cause of fear to them.
Darby English Bible (DBY) The remnant of Israel shall not work unrighteousness, nor speak lies; neither shall a deceitful tongue be found in their mouth: but *they* shall feed and lie down, and none shall make them afraid.
World English Bible (WEB) The remnant of Israel will not do iniquity, nor speak lies, neither will a deceitful tongue be found in their mouth, for they will feed and lie down, and no one will make them afraid."
Young's Literal Translation (YLT) The remnant of Israel do no perversity, nor speak lies, Nor found in their mouth is a deceitful tongue, For they have delight, and have lain down, And there is none troubling.
Cross Reference Psalm 23:2 in Telugu 2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.
Psalm 119:3 in Telugu 3 వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.
Isaiah 6:13 in Telugu 13 దానిలో పదవ భాగం మాత్రం మిగిలిపోయినా అది కూడా నాశనమౌతుంది. సింధూర మస్తకి వృక్షాలను నరికి వేసినా తరువాత మిగిలి ఉండే మొద్దులాగా అది ఉంటుంది. అలాటి మొద్దులో పరిశుద్ధమైన చిగురు ఉంది.
Isaiah 10:20 in Telugu 20 ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవాళ్ళు, యాకోబు కుటుంబీకుల్లో తప్పించుకున్నవాళ్ళు తమను హతం చేసిన వాణ్ణి ఇక ఎన్నడూ ఆశ్రయించకుండా ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడతారు.
Isaiah 11:6 in Telugu 6 తోడేలు గొర్రెపిల్లతో నివాసం చేస్తుంది. చిరుతపులి మేకపిల్లతో కలిసి పడుకుంటుంది. దూడ, సింహం కూన, కొవ్విన దూడ కలిసి ఉంటాయి. చిన్న పిల్లవాడు వాటిని తోలుకెళ్తాడు.
Isaiah 17:2 in Telugu 2 అరోయేరు పట్టణాలు జనాలు లేకుండా ఉంటాయి. అవి గొర్రెల మందలు మేసే ప్రదేశాలవుతాయి. అవి అక్కడ ఎవరి భయమూ లేకుండా పడుకుంటాయి.
Isaiah 35:8 in Telugu 8 పరిశుద్ధ మార్గం అని పిలిచే ఒక రాజమార్గం అక్కడ ఏర్పడుతుంది. దానిలోకి అపవిత్రులు వెళ్ళకూడదు. దేవునికి అంగీకారమైన వారికోసం అది ఏర్పడింది. మూర్ఖులు దానిలో నడవరు.
Isaiah 54:14 in Telugu 14 నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు.
Isaiah 60:21 in Telugu 21 నీ ప్రజలంతా నీతిమంతులుగా ఉంటారు. దేశం ఎప్పటికీ వారి స్వాధీనంలో ఉంటుంది. వారు నా ఘనత కోసం నేను నాటిన కొమ్మ. నేను చేసిన పని.
Isaiah 63:8 in Telugu 8 అయితే ఆయన ఇలా అన్నాడు. “కచ్చితంగా వారు నా ప్రజలు. అవిధేయులు కాని పిల్లలు.” ఆయన వారికి రక్షకుడయ్యాడు.
Isaiah 65:10 in Telugu 10 నన్ను వెతికిన నా ప్రజల కోసం షారోను గొర్రెల మేతభూమి అవుతుంది. ఆకోరు లోయ, పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది.
Jeremiah 23:4 in Telugu 4 నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. ఇకనుంచి అవి భయపడకుండా, బెదరి పోకుండా, వాటిలో ఒకటైనా తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపుతారు. ఇది యెహోవా వాక్కు.”
Jeremiah 30:10 in Telugu 10 కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
Jeremiah 31:33 in Telugu 33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.
Ezekiel 34:13 in Telugu 13 ఇతర ప్రజల మధ్యనుంచి వాటిని తోడుకు వచ్చి, వాటి స్వదేశంలోకి తీసుకొస్తాను. ఇశ్రాయేలు కొండల మీద, వాగుల దగ్గర, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను.
Ezekiel 34:23 in Telugu 23 వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
Ezekiel 36:25 in Telugu 25 మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను.
Ezekiel 39:26 in Telugu 26 వారు నాపట్ల చూపిన ద్రోహాన్ని బట్టి భరించిన అవమానాన్ని మరచిపోతారు. నేను అన్యజనాల్లో నుండి వారిని సమకూర్చి వారి శత్రు దేశాల్లోనుండి రప్పించిన తరువాత వారు తమ దేశంలో క్షేమంగా, నిర్భయంగా నివసిస్తారు.
Joel 3:17 in Telugu 17 మీ యెహోవా దేవుణ్ణి నేనే, నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.
Joel 3:21 in Telugu 21 వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.
Micah 4:4 in Telugu 4 దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా తన ద్రాక్షచెట్టు కింద తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. ఇది సేనల అధిపతి యెహోవా నోట వెలువడ్డ మాట.
Micah 4:7 in Telugu 7 కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను.
Micah 5:4 in Telugu 4 ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు.
Micah 7:14 in Telugu 14 నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు. కర్మెలుకు చెందిన అడవిలో వాళ్ళు ఒంటరిగా నివసిస్తున్నా పూర్వ కాలంలో బాషాను, గిలాదుల్లో మేసినట్టు మేస్తారు.
Zephaniah 2:7 in Telugu 7 తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది. వారు అక్కడ తమ మందలు మేపుతారు. చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు.
Zechariah 14:20 in Telugu 20 ఆ కాలంలో గుర్రాల కళ్ళాల పైన “యెహోవాకు ప్రతిష్టితం” అని రాసి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంటపాత్రలను బలిపీఠం ఎదుట ఉన్న గిన్నెల వలె పవిత్రంగా ఎంచుతారు.
Matthew 13:41 in Telugu 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.
John 1:47 in Telugu 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు.
Romans 11:4 in Telugu 4 అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.”
Colossians 3:9 in Telugu 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు.
1 Peter 3:14 in Telugu 14 మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.
1 John 3:9 in Telugu 9 దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు.
1 John 5:18 in Telugu 18 దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వాణ్ణి దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు.
Revelation 7:15 in Telugu 15 అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.
Revelation 14:5 in Telugu 5 అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
Revelation 21:8 in Telugu 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.
Revelation 21:27 in Telugu 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.