Zephaniah 2:3 in Telugu 3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవా ను వెదకండి. మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.
Other Translations King James Version (KJV) Seek ye the LORD, all ye meek of the earth, which have wrought his judgment; seek righteousness, seek meekness: it may be ye shall be hid in the day of the LORD's anger.
American Standard Version (ASV) Seek ye Jehovah, all ye meek of the earth, that have kept his ordinances; seek righteousness, seek meekness: it may be ye will be hid in the day of Jehovah's anger.
Bible in Basic English (BBE) Make search for the Lord, all you quiet ones of the earth, who have done what is right in his eyes; make search for righteousness and a quiet heart: it may be that you will be safely covered in the day of the Lord's wrath.
Darby English Bible (DBY) Seek Jehovah, all ye meek of the land, who have performed his ordinance; seek righteousness, seek meekness: it may be ye shall be hid in the day of Jehovah's anger.
World English Bible (WEB) Seek Yahweh, all you humble of the land, who have kept his ordinances. Seek righteousness. Seek humility. It may be that you will be hidden in the day of Yahweh's anger.
Young's Literal Translation (YLT) Seek Jehovah, all ye humble of the land, Who His judgment have done, Seek ye righteousness, seek humility, It may be ye are hidden in a day of the anger of Jehovah.
Cross Reference Genesis 7:15 in Telugu 15 శ్వాస తీసుకోగలిగి, శరీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి, ఓడలో ప్రవేశించాయి.
Exodus 12:27 in Telugu 27 ‘ఇది యెహోవాకు పస్కాబలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు.
2 Samuel 12:22 in Telugu 22 అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను.
2 Chronicles 34:27 in Telugu 27 ‘నీ మనస్సు మెత్తనిది కాబట్టి, ఈ స్థలం మీదా దానిలో నివసించే వారి మీదా దేవుని మాటలను నీవు విని, నా ముందు నిన్ను నీవు తగ్గించుకుని నీ బట్టలు చించుకుని నా ముందు ఏడ్చావు కాబట్టి నేను కూడా నీ మాట విన్నాను’ ఇది యెహోవా ప్రకటన.
Psalm 22:26 in Telugu 26 బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. మీ హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక.
Psalm 25:8 in Telugu 8 యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
Psalm 31:20 in Telugu 20 మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు.
Psalm 32:6 in Telugu 6 దీని కారణంగా భయభక్తులు కలిగిన వాడు నువ్వు దొరికే సమయంలో నీకు ప్రార్ధించాలి. అప్పుడు జల ప్రవాహాలు ఉప్పొంగినా అవి అతని దగ్గరకు రావు.
Psalm 57:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు దగ్గర నుండి పారిపోయి గుహలో చేరినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.
Psalm 76:9 in Telugu 9 దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. సెలా.
Psalm 91:1 in Telugu 1 సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు.
Psalm 105:4 in Telugu 4 యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.
Psalm 149:4 in Telugu 4 యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు.
Proverbs 18:10 in Telugu 10 యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.
Isaiah 11:4 in Telugu 4 కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.
Isaiah 26:20 in Telugu 20 నా ప్రజలారా, వెళ్ళండి! మీ గదుల్లో ప్రవేశించండి. తలుపులు మూసుకోండి. మహా కోపం తగ్గే వరకూ దాగి ఉండండి. ఇదిగో వారి దోషాన్ని బట్టి భూనివాసులను శిక్షించడానికి యెహోవా తన నివాసంలోనుండి బయలు దేరుతున్నాడు. భూమి తన మీద హతులైన వారిని ఇకపై కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయట పెడుతుంది.
Isaiah 55:6 in Telugu 6 యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి.
Isaiah 61:1 in Telugu 1 ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు. అణగారినవారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,
Jeremiah 3:13 in Telugu 13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.
Jeremiah 4:1 in Telugu 1 యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తిరిగి రాదలిస్తే నా దగ్గరకే రావాలి. మీరు మీ హేయమైన విగ్రహాలను తీసివేసి నా సన్నిధి నుండి ఇటూ అటూ తప్పిపోకుండా ఉంటే,
Jeremiah 22:15 in Telugu 15 నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.
Jeremiah 29:12 in Telugu 12 అప్పుడు మీరు నన్ను వెతికి, నాకు ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను మీ మాట ఆలకిస్తాను.
Jeremiah 39:18 in Telugu 18 ‘కచ్చితంగా నేను నిన్ను తప్పిస్తాను. నువ్వు ఖడ్గంతో చనిపోవు. నువ్వు నన్ను నమ్మావు గనుక, నీ ప్రాణమే నీకు కొల్లసొమ్ము అవుతుంది.’ ఇదే యెహోవా వాక్కు.”
Jeremiah 45:5 in Telugu 5 కానీ నీ కోసం నువ్వు గొప్ప వాటిని కోరుకుంటున్నావా? గొప్ప వాటి కోసం చూడకు. ఎందుకంటే సర్వ మానవాళికీ వినాశనం కలుగబోతుంది.’ ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘కానీ నువ్వు వెళ్ళిన స్థలాలన్నిటిలో దోపిడీ సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణాన్ని నీకిస్తున్నాను.’”
Hosea 7:10 in Telugu 10 ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. ఆయనను వెతకడం లేదు.
Hosea 10:12 in Telugu 12 మీ కోసం నీతి విత్తనం వేయండి. నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి. ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ, యెహోవాను వెదకడానికి ఇదే అదను.
Joel 2:13 in Telugu 13 మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.
Amos 5:4 in Telugu 4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, “నన్ను వెతికి జీవించండి.
Amos 5:14 in Telugu 14 మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
Jonah 3:9 in Telugu 9 ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?”
Zechariah 8:19 in Telugu 19 “సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇస్తున్నదేమిటంటే నాలుగవ నెల ఉపవాసం, ఐదవ నెల ఉపవాసం, ఏడవ నెల ఉపవాసం, పదవ నెల ఉపవాసం, యూదా యింటివారికి సంతోషం ఉత్సాహం పుట్టించే మనోహరమైన పండగలౌతాయి. కాబట్టి సత్యాన్ని, శాంతిసమాధానాలును ప్రేమించండి.”
Matthew 5:5 in Telugu 5 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు.
Matthew 7:7 in Telugu 7 “అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తలుపు తీయబడుతుంది.
Philippians 3:13 in Telugu 13 సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను.
Colossians 3:2 in Telugu 2 పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు.
1 Thessalonians 4:1 in Telugu 1 చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు.
1 Thessalonians 4:10 in Telugu 10 అలాగే మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులను ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమలో మీరు మరింత వృద్ధి చెందుతూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాం.
James 1:21 in Telugu 21 కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది.
1 Peter 1:22 in Telugu 22 సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.
1 Peter 3:4 in Telugu 4 వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది.
2 Peter 3:18 in Telugu 18 మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.