Zephaniah 1:17 in Telugu 17 ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గుడ్డివారిలాగా నడుస్తారు. వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది. వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.
Other Translations King James Version (KJV) And I will bring distress upon men, that they shall walk like blind men, because they have sinned against the LORD: and their blood shall be poured out as dust, and their flesh as the dung.
American Standard Version (ASV) And I will bring distress upon men, that they shall walk like blind men, because they have sinned against Jehovah; and their blood shall be poured out as dust, and their flesh as dung.
Bible in Basic English (BBE) And I will send trouble on men so that they will go about like the blind, because they have done evil against the Lord: and their blood will be drained out like dust, and their strength like waste.
Darby English Bible (DBY) And I will bring distress upon men, and they shall walk like blind men; for they have sinned against Jehovah; and their blood shall be poured out as dust, and their flesh as dung:
World English Bible (WEB) I will bring distress on men, that they will walk like blind men, because they have sinned against Yahweh, and their blood will be poured out like dust, and their flesh like dung.
Young's Literal Translation (YLT) And I have sent distress to men, And they have walked as the blind, For against Jehovah they have sinned, And poured out is their blood as dust, And their flesh `is' as dung.
Cross Reference Deuteronomy 28:28 in Telugu 28 పిచ్చి, గుడ్డితనం, ఆందోళనతో యెహోవా మిమ్మల్ని బాధిస్తాడు.
2 Kings 9:33 in Telugu 33 యెహూ “ఆమెను కిందకు తోసెయ్యండి” అన్నాడు. వారు యెజెబెలుని కిందకు తోసేశారు. దాంతో ఆమె రక్తం గోడలమీదా, గుర్రాలమీదా చిమ్మింది. అప్పుడు యెహూ ఆమెను గుర్రాలతో తొక్కించాడు.
Psalm 79:2 in Telugu 2 వాళ్ళు నీ సేవకుల శవాలను రాబందులకు ఆహారంగా, నీ భక్తుల మృత దేహాలను అడవి జంతువులకు ఆహారంగా పడేశారు.
Psalm 83:10 in Telugu 10 వాళ్ళు ఎన్ దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు.
Isaiah 24:5 in Telugu 5 లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.
Isaiah 29:10 in Telugu 10 ఎందుకంటే యెహోవా మీ మీద గాఢమైన నిద్రాత్మను కుమ్మరించాడు. ఆయన మీ కళ్ళు మూసివేశాడు. అంటే మీకు ప్రవక్తలను లేకుండా చేశాడు. మీ తలలకు ముసుగు వేశాడు. మీకు నాయకులను లేకుండా చేశాడు.
Isaiah 50:1 in Telugu 1 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నేను మీ తల్లిని విడిచిపెట్టి ఇచ్చిన విడాకుల పత్రం ఏదీ? నా అప్పులవాళ్ళలో మిమ్మల్ని ఎవరికి అమ్మివేశాను? కేవలం మీ దోషాలను బట్టే మీరు అమ్ముడుపోయారు. మీ తిరుగుబాటును బట్టే మీ తల్లికి విడాకులు ఇవ్వడం జరిగింది.
Isaiah 59:9 in Telugu 9 కాబట్టి న్యాయం మాకు దూరంగా ఉంది. నీతి మమ్మల్ని అందుకోవడం లేదు. వెలుగుకోసం మేము కనిపెడుతూ ఉన్నాం గానీ అంతా చీకటిగానే ఉంది. కాంతి కోసం చూస్తూ ఉన్నాం, గానీ అంధకారంలోనే నడుస్తున్నాం.
Isaiah 59:12 in Telugu 12 మా అక్రమాలన్నీ నీ ఎదుట ఉన్నాయి. మా పాపాలు మామీద సాక్ష్యం చెబుతున్నాయి. మా అక్రమాలు మాకు కనబడుతున్నాయి. మా పాపాలు మాకు తెలుసు.
Jeremiah 2:17 in Telugu 17 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?
Jeremiah 2:19 in Telugu 19 నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు.
Jeremiah 4:18 in Telugu 18 నీ ప్రవర్తన, నీ క్రియలే ఈ ఆపదను నీ మీదికి రప్పించాయి. నీ చెడుతనమే దీనికి కారణం. ఇది చేదుగా ఉండి నీ హృదయాన్ని గట్టిగా తాకుతున్నది కదా?
Jeremiah 9:21 in Telugu 21 మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది. అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది.
Jeremiah 10:18 in Telugu 18 యెహోవా చేప్పేదేమంటే “నేను ఈసారి ఈ దేశ నివాసులను బయటికి విసిరివేస్తాను. వారు పట్టబడేలా చేసి నిస్పృహకు గురి చేస్తాను.”
Jeremiah 15:3 in Telugu 3 చంపడానికి కత్తినీ, చీల్చడానికి కుక్కలనూ, తినివేయడానికీ నాశనం చేయడానికీ ఆకాశ పక్షులనూ, భూమి మీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఈ నాలుగు రకాల బాధలు వారికి వస్తాయి.” ఇది యెహోవా వాక్కు.
Jeremiah 16:4 in Telugu 4 “వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.”
Jeremiah 18:21 in Telugu 21 కాబట్టి వాళ్ళ పిల్లలను కరువుపాలు చెయ్యి. వాళ్ళను కత్తికి అప్పగించు. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయేలా వితంతువులయ్యేలా చెయ్యి. వాళ్ళ పురుషులు చావాలి. వాళ్ళ యువకులు యుద్ధంలో కత్తితో చావాలి.
Lamentations 1:8 in Telugu 8 యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. ఆ కారణంగా అది ఒక రుతుస్రావం రక్తం గుడ్డలాగా అయ్యింది. దాన్ని ఘనపరచిన వాళ్ళందరూ దాని నగ్నత్వం చూసి దాన్ని తృణీకరించారు. అది మూలుగుతూ వెనుదిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది.
Lamentations 1:14 in Telugu 14 నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు. అవి మూటగా నా మెడ మీద ఉన్నాయి. నా బలం ఆయన విఫలం చేశాడు. శత్రువుల చేతికి ప్రభువు నన్ను అప్పగించాడు. నేను నిలబడ లేకపోతున్నాను.
Lamentations 1:18 in Telugu 18 యెహోవా న్యాయవంతుడు. నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. ప్రజలారా, వినండి, నా యాతన చూడండి. నా కన్యలూ, బలవంతులైన నా శూరులూ బందీలుగా వెళ్ళిపోయారు.
Lamentations 2:21 in Telugu 21 యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
Lamentations 4:13 in Telugu 13 దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
Lamentations 5:16 in Telugu 16 మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది! మేము పాపం చేశాం! మాకు బాధ!
Ezekiel 22:25 in Telugu 25 అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.
Daniel 9:5 in Telugu 5 మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము.
Amos 4:10 in Telugu 10 నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్టు మీ మీదికి తెగుళ్లు పంపాను. మీ యువకులను కత్తితో చంపేశాను. మీ గుర్రాలను తీసుకుపోయారు. మీ శిబిరాల్లో పుట్టిన చెడ్డ వాసన మీ ముక్కుల్లోకి ఎక్కింది. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
Micah 3:9 in Telugu 9 యాకోబు వంశపు ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.
Micah 7:13 in Telugu 13 ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.
Matthew 15:14 in Telugu 14 వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.
John 9:40 in Telugu 40 ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, “అయితే మేము కూడా గుడ్డివాళ్ళమేనా?” అని అడిగారు.
Romans 11:7 in Telugu 7 అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
Romans 11:25 in Telugu 25 సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.
2 Corinthians 4:4 in Telugu 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.
2 Peter 1:9 in Telugu 9 కాని ఈ గుణాలు లేనివాడు, తాను గతంలో చేసిన పాపాలనుండి దేవుడు శుభ్రపరిచాడని మరచిపోతాడు. అతడు దూరదృష్టి లేని గుడ్డివాడు.
1 John 2:11 in Telugu 11 కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.
Revelation 3:17 in Telugu 17 ‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.