Zechariah 7:10 in Telugu 10 వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”
Other Translations King James Version (KJV) And oppress not the widow, nor the fatherless, the stranger, nor the poor; and let none of you imagine evil against his brother in your heart.
American Standard Version (ASV) and oppress not the widow, nor the fatherless, the sojourner, nor the poor; and let none of you devise evil against his brother in your heart.
Bible in Basic English (BBE) Do not be hard on the widow, or the child without a father, on the man from a strange country, or on the poor; let there be no evil thought in your heart against your brother.
Darby English Bible (DBY) and oppress not the widow and the fatherless, the stranger and the afflicted; and let none of you imagine evil against his brother in your heart.
World English Bible (WEB) Don't oppress the widow, nor the fatherless, the foreigner, nor the poor; and let none of you devise evil against his brother in your heart.'
Young's Literal Translation (YLT) And widow, and fatherless, Sojourner, and poor, ye do not oppress, And the calamity of one another ye do not devise in your heart.
Cross Reference Exodus 22:21 in Telugu 21 పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
Exodus 23:9 in Telugu 9 విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
Deuteronomy 24:14 in Telugu 14 మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి.
Deuteronomy 27:19 in Telugu 19 “పరదేశికి గానీ, తండ్రి లేనివాడికిగానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
Psalm 21:11 in Telugu 11 వారు నీకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు. ఒక రహస్య పథకం పన్నారు గాని అది సఫలం కాలేదు.
Psalm 36:4 in Telugu 4 వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు.
Psalm 72:4 in Telugu 4 ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.
Psalm 140:2 in Telugu 2 వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు.
Proverbs 3:29 in Telugu 29 నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.
Proverbs 6:18 in Telugu 18 దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు,
Proverbs 22:22 in Telugu 22 పేదవాడు గదా అని పేదవాణ్ణి దోచుకోవద్దు. పట్టణ ద్వారాల దగ్గర నిస్సహాయులను నలగ గొట్టవద్దు.
Proverbs 23:10 in Telugu 10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయవద్దు. తల్లిదండ్రులు లేనివారి పొలంలోకి చొరబడవద్దు.
Isaiah 1:16 in Telugu 16 మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.
Isaiah 1:23 in Telugu 23 నీ అధికారులు ద్రోహులు. వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. అందరూ లంచం ఆశిస్తారు. చెల్లింపుల వెంటబడతారు. తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు.
Jeremiah 5:28 in Telugu 28 వారు కొవ్వు పట్టి బాగా బలిసి ఉన్నారు. దుర్మార్గంలో వారు ఎంతో ముందుకు వెళ్ళారు. తండ్రి లేనివారు వ్యాజ్యంలో గెలవకుండేలా వారికి అన్యాయంగా తీర్పు తీరుస్తారు. బీదవారి వ్యాజ్యాల్లో సహకరించరు.
Jeremiah 11:19 in Telugu 19 అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు.
Jeremiah 18:18 in Telugu 18 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. “యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.”
Jeremiah 22:15 in Telugu 15 నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.
Ezekiel 22:7 in Telugu 7 నీలో ఉన్న తలిదండ్రులను సిగ్గుపరిచారు. నీ మధ్య ఉన్న పరదేశులను అణిచివేశారు. నీలో ఉన్న అనాథలను, వితంతువులను బాధపెట్టారు.
Ezekiel 22:12 in Telugu 12 వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ezekiel 22:29 in Telugu 29 దేశ ప్రజలు బలవంతంగా దండుకుంటూ, దోపిడీతో కొల్లగొడుతూ, పేదలను, అవసరతలో ఉన్న వాళ్ళను కష్టాలపాలు చేస్తూ, అన్యాయంగా పరదేశిని పీడించారు.
Amos 4:1 in Telugu 1 సమరయ పర్వతం మీద ఉన్న బాషాను ఆవులారా, పేదలను అణిచేస్తూ దిక్కులేని వాళ్ళని బాధిస్తూ, మీ భర్తలతో “మాకు సారాయి తీసుకు రా” అనే మీరు, ఈ మాట వినండి.
Amos 5:11 in Telugu 11 మీరు పేదలను అణగదొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించరు. మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా ఆ ద్రాక్ష మద్యం తాగరు.
Micah 2:1 in Telugu 1 మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.
Micah 3:1 in Telugu 1 నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?
Zephaniah 3:1 in Telugu 1 తిరుగుబాటు పట్టణానికి బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది.
Zechariah 8:17 in Telugu 17 తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు. అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు. ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు.
Malachi 3:5 in Telugu 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేనివారిని బాధపెట్టినవారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
Matthew 23:13 in Telugu 13 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.
Mark 7:21 in Telugu 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,
1 Corinthians 6:10 in Telugu 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
James 1:14 in Telugu 14 ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు.
James 5:4 in Telugu 4 చూడండి, మీ చేను కోసిన పనివారి కూలీ ఇవ్వకుండా, మీరు మోసంగా బిగపట్టిన కూలీ కేకలు వేస్తున్నది. మీ కోతపని వారి ఆక్రందనలు సేనల ప్రభువు చెవిని బడుతున్నాయి.
1 John 3:15 in Telugu 15 తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.