Zechariah 10:5 in Telugu 5 వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.
Other Translations King James Version (KJV) And they shall be as mighty men, which tread down their enemies in the mire of the streets in the battle: and they shall fight, because the LORD is with them, and the riders on horses shall be confounded.
American Standard Version (ASV) And they shall be as mighty men, treading down `their enemies' in the mire of the streets in the battle; and they shall fight, because Jehovah is with them; and the riders on horses shall be confounded.
Bible in Basic English (BBE) Together they will be like men of war, crushing down their haters into the earth of the streets in the fight; they will make war because the Lord is with them: and the horsemen will be shamed.
Darby English Bible (DBY) And they shall be as mighty men, treading down the mire of the streets in the battle; and they shall fight, for Jehovah is with them, and the riders on horses shall be put to shame.
World English Bible (WEB) They shall be as mighty men, Treading down muddy streets in the battle; And they shall fight, because Yahweh is with them; And the riders on horses will be confounded.
Young's Literal Translation (YLT) And they have been as heroes, Treading in mire of out-places in battle, And they have fought, for Jehovah `is' with them, And have put to shame riders of horses.
Cross Reference Deuteronomy 20:1 in Telugu 1 “మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
Joshua 10:14 in Telugu 14 యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.
Joshua 10:42 in Telugu 42 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ఆ సమస్త రాజులనూ వారి దేశాలనూ యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకున్నాడు.
1 Samuel 16:18 in Telugu 18 వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు.
2 Samuel 22:8 in Telugu 8 అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి.
2 Samuel 22:43 in Telugu 43 నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను.
Psalm 18:42 in Telugu 42 అప్పుడు గాలికి ఎగిరే దుమ్ములాగా నేను వాళ్ళను ముక్కలుగా కొట్టాను. వీధుల్లో మట్టిని విసిరేసినట్టు విసిరేశాను.
Psalm 20:7 in Telugu 7 కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము.
Psalm 33:16 in Telugu 16 ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.
Psalm 45:3 in Telugu 3 బలశాలీ, నీ నడుముకు కత్తిని ధరించు. నీ తేజస్సునూ నీ ప్రభావాన్నీ ధరించుకో.
Isaiah 8:9 in Telugu 9 ప్రజలారా, మీరు ముక్కలు చెక్కలై పోతారు. దూరదేశాల్లారా, మీరందరూ వినండి. మీరు యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలైపొండి. యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలై పొండి.
Isaiah 10:6 in Telugu 6 భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.
Isaiah 25:10 in Telugu 10 యెహోవా హస్తం ఈ పర్వతం మీద నిలుస్తుంది. పెంటకుప్పలో వరిగడ్డిని తొక్కినట్టు మోయాబీయులు తాము ఉన్న చోటనే తొక్కబడతారు.
Isaiah 41:12 in Telugu 12 నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు. నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.
Ezekiel 38:15 in Telugu 15 దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి
Joel 3:12 in Telugu 12 రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. చుట్టు పక్కలుండే రాజ్యాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.
Amos 2:15 in Telugu 15 విలుకాడు నిలబడలేడు. వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
Micah 7:10 in Telugu 10 నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.
Haggai 2:22 in Telugu 22 రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.
Zechariah 9:13 in Telugu 13 యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.
Zechariah 12:4 in Telugu 4 ఇదే యెహోవా వాక్కు. “ఆ దినాన నేను గుర్రాలన్నిటికీ బెదురు, గుర్రపు రౌతులకు వెర్రి పుట్టిస్తాను. యూదావారి విషయం శ్రద్ధ చూపించి, ఇతర ప్రజల గుర్రాలన్నిటికీ గుడ్డితనం కలిగిస్తాను.”
Zechariah 12:8 in Telugu 8 ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు.
Zechariah 14:3 in Telugu 3 అప్పుడు యెహోవా బయలు దేరతాడు. యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆయన ఆ ఇతర దేశాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
Zechariah 14:13 in Telugu 13 ఆ రోజున యెహోవా వారి మధ్య భయంకరమైన అయోమయం పుట్టిస్తాడు. వాళ్ళంతా ఒకరికొకరు శత్రువులై ఒకరినొకరు చంపుకుంటారు.
Matthew 4:3 in Telugu 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు.
Matthew 28:20 in Telugu 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
Luke 24:19 in Telugu 19 ఆయన, “ఏ విషయాలు?” అని అడిగాడు. అప్పుడు వారు, “నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు.
Acts 7:22 in Telugu 22 మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు.
Acts 18:24 in Telugu 24 అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు.
Romans 8:31 in Telugu 31 వీటిని గురించి మనమేమంటాం? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు?
2 Corinthians 10:4 in Telugu 4 మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
2 Timothy 4:7 in Telugu 7 మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
2 Timothy 4:17 in Telugu 17 అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
Revelation 19:13 in Telugu 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.
Revelation 19:17 in Telugu 17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.