Song of Solomon 5:2 in Telugu 2 నాలుగవ భాగం (యువతి మాట్లాడుతూ ఉంది) నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”
Other Translations King James Version (KJV) I sleep, but my heart waketh: it is the voice of my beloved that knocketh, saying, Open to me, my sister, my love, my dove, my undefiled: for my head is filled with dew, and my locks with the drops of the night.
American Standard Version (ASV) I was asleep, but my heart waked: It is the voice of my beloved that knocketh, `saying', Open to me, my sister, my love, my dove, my undefiled; For my head is filled with dew, My locks with the drops of the night.
Bible in Basic English (BBE) I am sleeping, but my heart is awake; it is the sound of my loved one at the door, saying, Be open to me, my sister, my love, my dove, my very beautiful one; my head is wet with dew, and my hair with the drops of the night.
Darby English Bible (DBY) I slept, but my heart was awake. The voice of my beloved! he knocketh: Open to me, my sister, my love, my dove, mine undefiled; For my head is filled with dew, My locks with the drops of the night.
World English Bible (WEB) I was asleep, but my heart was awake. It is the voice of my beloved who knocks: Open to me, my sister, my love, my dove, my undefiled; For my head is filled with dew, My hair with the dampness of the night.
Young's Literal Translation (YLT) I am sleeping, but my heart waketh: The sound of my beloved knocking! `Open to me, my sister, my friend, My dove, my perfect one, For my head is filled `with' dew, My locks `with' drops of the night.'
Cross Reference Genesis 29:20 in Telugu 20 యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా అనిపించాయి.
Genesis 31:40 in Telugu 40 నేనెలా ఉన్నానో చూడు, పగలు ఎండకీ రాత్రి మంచుకూ క్షీణించిపోయాను. నా కళ్ళకి నిద్ర అనేదే లేకుండా పోయింది.
Psalm 24:7 in Telugu 7 మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి.
Psalm 81:10 in Telugu 10 నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను.
Psalm 119:1 in Telugu 1 ఆలెఫ్ ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.
Proverbs 23:26 in Telugu 26 కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి.
Song of Solomon 2:8 in Telugu 8 రెండవ భాగం (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) నా ప్రియుని స్వరం అదుగో! చూడు, అతడు వస్తున్నాడు. పర్వతాల మీద గంతులేస్తూ కొండల మీద దూకుతూ వస్తున్నాడు.
Song of Solomon 2:10 in Telugu 10 నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.
Song of Solomon 2:14 in Telugu 14 బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది”
Song of Solomon 3:1 in Telugu 1 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) రాత్రిపూట పడుకుని నేను నా ప్రాణప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతని కోసం నేనెంతగానో ఎదురు చూసినా అతడు కనబడలేదు.
Song of Solomon 4:7 in Telugu 7 ప్రేయసీ, నువ్వు నిలువెల్లా అందమే. నీలో ఏ దోషం లేదు.
Song of Solomon 4:9 in Telugu 9 నా సోదరీ, వధూ! నువ్వు నా హృదయాన్ని దోచుకున్నావు. నీ హారంలోని ఒక్క ఆభరణంతో నన్ను దోచుకున్నావు.
Song of Solomon 5:11 in Telugu 11 అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.
Song of Solomon 6:9 in Telugu 9 నా పావురం, ఏ దోషం లేనిది. ఈమె ఒక్కతే. ఈమె తన తల్లికి ఒకతే కూతురు. కన్నతల్లికి గారాబు బిడ్డ. మా ప్రాంతం ఆడపడుచులు ఆమెను చూసి, చాలా ధన్య అన్నారు. రాణులూ ఉపపత్నులూ ఆమెను చూసి ప్రశంసించారు.
Song of Solomon 7:9 in Telugu 9 నీ నోరు శ్రేష్ఠమైన ద్రాక్షారసంలా ఉండాలి. మన పెదాల మధ్య, పళ్ళ మధ్య నా ప్రియుని కోసం చక్కగా స్రవిస్తూ ఉండాలి.
Song of Solomon 8:7 in Telugu 7 ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు. వరదలు దాన్ని ముంచలేవు. ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ.
Isaiah 50:6 in Telugu 6 నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు.
Isaiah 52:14 in Telugu 14 అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు.
Isaiah 53:3 in Telugu 3 ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. అయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.
Daniel 8:18 in Telugu 18 అతడు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు గాఢనిద్ర పట్టి నేలపై సాష్టాంగపడ్డాను. కాబట్టి అతడు నన్ను పట్టుకుని లేపి నిలబెట్టాడు.
Zechariah 4:1 in Telugu 1 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోతున్న ఒకణ్ణి లేపినట్లు నన్ను లేపాడు.
Matthew 8:17 in Telugu 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. మన రోగాలను భరించాడు.”
Matthew 25:4 in Telugu 4 తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు.
Matthew 25:35 in Telugu 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు.
Matthew 26:40 in Telugu 40 శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?
Mark 1:35 in Telugu 35 ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
Luke 6:12 in Telugu 12 ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.
Luke 9:32 in Telugu 32 పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు.
Luke 22:44 in Telugu 44 ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.
John 10:4 in Telugu 4 తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి.
2 Corinthians 5:14 in Telugu 14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం ఒకడు చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారనే విషయం కచ్చితం.
Galatians 2:20 in Telugu 20 నేను క్రీస్తుతోబాటు సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తనను తాను సమర్పించుకున్న దేవుని కుమారుడి మీద విశ్వాసం వల్లనే.
Ephesians 5:14 in Telugu 14 బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
Revelation 3:4 in Telugu 4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వారు యోగ్యులు. కాబట్టి వారు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు.
Revelation 3:20 in Telugu 20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను లోపలికి అతని దగ్గరికి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు.
Revelation 14:4 in Telugu 4 వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకొన్న వారు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన జరిగిన వారు.