Song of Solomon 1:5 in Telugu 5 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, నేను నల్లటి పిల్లనే కానీ అందగత్తెను. కేదారు డేరాల్లాగా, సొలొమోను రాజభవనం తెరల్లాగా నేను అందగత్తెను.
Other Translations King James Version (KJV) I am black, but comely, O ye daughters of Jerusalem, as the tents of Kedar, as the curtains of Solomon.
American Standard Version (ASV) I am black, but comely, Oh ye daughters of Jerusalem, As the tents of Kedar, As the curtains of Solomon.
Bible in Basic English (BBE) I am dark, but fair of form, O daughters of Jerusalem, as the tents of Kedar, as the curtains of Solomon.
Darby English Bible (DBY) I am black, but comely, daughters of Jerusalem, As the tents of Kedar, As the curtains of Solomon.
World English Bible (WEB) I am dark, but lovely, You daughters of Jerusalem, Like Kedar's tents, Like Solomon's curtains.
Young's Literal Translation (YLT) Dark `am' I, and comely, daughters of Jerusalem, As tents of Kedar, as curtains of Solomon.
Cross Reference Psalm 45:9 in Telugu 9 గౌరవనీయులైన నీ స్త్రీలలో రాజ కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు స్వర్ణాభరణాలు ధరించుకుని రాణి నీ కుడి వైపున నిలబడి ఉంది.
Psalm 90:17 in Telugu 17 మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.
Psalm 120:5 in Telugu 5 అయ్యో, నేను మెషెకు ప్రజల వద్ద విదేశీయునిగా ఉన్నాను. కేదారు గుడారాల దగ్గర నివసిస్తున్నాను.
Psalm 149:4 in Telugu 4 యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు.
Song of Solomon 2:7 in Telugu 7 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకలమీద, లేళ్లమీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
Song of Solomon 2:14 in Telugu 14 బండసందుల్లోని నా పావురమా, కొండ మరుగు చరియల్లోని పావురమా, నీ ముఖం నన్ను చూడ నివ్వు. నీ స్వరం వినిపించు. నీ స్వరం మధురం, నీ ముఖం ఎంత ముద్దుగా ఉంది”
Song of Solomon 3:5 in Telugu 5 (ఆ యువతి మిగతా స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, పొలాల్లోని జింకలమీద, లేళ్లమీద ఒట్టు పెట్టి చెప్పండి. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచ వద్దు.
Song of Solomon 3:10 in Telugu 10 దాని స్తంభాలు వెండితో చేశారు. దాని అడుగుభాగం బంగారుది. దాని దిండ్లు ఊదా రంగువి. యెరూషలేము కుమార్తెలు ప్రేమతో దాని లోపలిభాగం అలంకరించారు.
Song of Solomon 4:3 in Telugu 3 నీ అధరాలు ఎరుపు నూలులాగా ఉన్నాయి. నీ నోరు మనోజ్ఞంగా ఉంది. నీ ముసుకు గుండా నీ చెక్కిళ్ళు, విచ్చిన దానిమ్మ పండులా కన్పిస్తున్నాయి.
Song of Solomon 5:8 in Telugu 8 (యువతి పట్టణ స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
Song of Solomon 5:16 in Telugu 16 అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం. యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.
Song of Solomon 6:4 in Telugu 4 ప్రియా, నువ్వు తిర్సా పట్టణమంత సౌందర్య రాశివి. నీది యెరూషలేమంత సౌందర్యం. నీ అందం చూసి నేను మైమరచి పోతున్నాను.
Song of Solomon 8:4 in Telugu 4 (యువతి ఇతర స్త్రీలతో మాట్లాడుతూ ఉంది) యెరూషలేము ఆడపడుచులారా, మీచేత ఒట్టు వేయించుకుంటున్నాను. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
Isaiah 53:2 in Telugu 2 ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.
Isaiah 60:7 in Telugu 7 నీ కోసం కేదారు గొర్రెమందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్లేళ్లు నీ సేవలో ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠం మీద బలులుగా అంగీకారమవుతాయి. నా గొప్ప మందిరాన్ని నేను అందంగా అలంకరిస్తాను.
Isaiah 61:10 in Telugu 10 పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు. యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణిబట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.
Ezekiel 16:14 in Telugu 14 నేను నీకిచ్చిన ఘనతతో నీ అందం పరిపూర్ణం అయింది. దేశదేశాల్లో నీ కీర్తి ప్రచురం అయ్యింది.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Matthew 10:25 in Telugu 25 శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వారు పేరు పెట్టి ఉంటే అతని ఇంటివారిని మరి ఇంకెంతగా అంటారో గదా!
Matthew 22:11 in Telugu 11 “రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు.
Luke 13:34 in Telugu 34 “యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.
Luke 15:22 in Telugu 22 “అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి.
Romans 13:14 in Telugu 14 చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.
1 Corinthians 4:10 in Telugu 10 క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం.
2 Corinthians 5:21 in Telugu 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
Galatians 4:26 in Telugu 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. ఆమె మనకు తల్లి.
Ephesians 5:26 in Telugu 26 సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,
1 John 3:1 in Telugu 1 మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.