Romans 9:4 in Telugu 4 వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి.
Other Translations King James Version (KJV) Who are Israelites; to whom pertaineth the adoption, and the glory, and the covenants, and the giving of the law, and the service of God, and the promises;
American Standard Version (ASV) who are Israelites; whose is the adoption, and the glory, and the covenants, and the giving of the law, and the service `of God', and the promises;
Bible in Basic English (BBE) Who are Israelites: who have the place of sons, and the glory, and the agreements with God, and the giving of the law, and the worship, and the hope offered by God:
Darby English Bible (DBY) who are Israelites; whose [is] the adoption, and the glory, and the covenants, and the law-giving, and the service, and the promises;
World English Bible (WEB) who are Israelites; whose is the adoption, the glory, the covenants, the giving of the law, the service, and the promises;
Young's Literal Translation (YLT) who are Israelites, whose `is' the adoption, and the glory, and the covenants, and the lawgiving, and the service, and the promises,
Cross Reference Genesis 15:18 in Telugu 18 ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.
Genesis 17:2 in Telugu 2 అప్పుడు నాకూ నీకూ మధ్య ఉన్న నిబంధనను నేను స్థిరం చేస్తాను. నీ సంతానాన్ని అత్యధికంగా విస్తరింపజేస్తాను” అని చెప్పాడు.
Genesis 17:7 in Telugu 7 నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.
Genesis 17:10 in Telugu 10 నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నీ సంతానానికీ మధ్య ఉన్న నిబంధన ఇదే. మీలో ప్రతి మగవాడూ సున్నతి పాటించాలి.
Genesis 32:28 in Telugu 28 అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.
Exodus 4:22 in Telugu 22 అప్పుడు నువ్వు ఫరోతో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలు నా సంతానం. నా పెద్ద కొడుకు.
Exodus 12:25 in Telugu 25 యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి.
Exodus 19:3 in Telugu 3 మోషే దేవుని సన్నిధి ఉన్న కొండపైకి ఎక్కి వెళ్ళాడు. యెహోవా ఆ కొండపై నుండి అతణ్ణి పిలిచాడు. యెహోవా మోషేతో “నువ్వు యాకోబు సంతతితో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు.
Exodus 24:7 in Telugu 7 తరువాత అతడు నిబంధన గ్రంథం చేతబట్టుకుని ప్రజలకు వినిపించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పినవన్నీ చేస్తూ ఆయనకు విధేయులుగా ఉంటాం” అన్నారు.
Exodus 34:27 in Telugu 27 యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు “ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.”
Exodus 40:34 in Telugu 34 అప్పుడు మేఘం సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.
Numbers 7:89 in Telugu 89 యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.
Deuteronomy 7:6 in Telugu 6 మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు.
Deuteronomy 14:1 in Telugu 1 “మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు.
Deuteronomy 29:1 in Telugu 1 యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే.
Deuteronomy 29:14 in Telugu 14 నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్ళతో
Deuteronomy 31:16 in Telugu 16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.
1 Samuel 4:21 in Telugu 21 ఆమె దేవుని మందసాన్ని పట్టుకున్నారనే విషయం, తన మామ, భర్త చనిపోయారన్న విషయం తెలుసుకుని “ఇశ్రాయేలీయుల్లో నుండి ప్రభావం వెళ్ళిపోయింది” అని చెప్పి, తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టింది.
1 Kings 8:11 in Telugu 11 కాబట్టి యెహోవా మహిమ తేజస్సు ఆయన మందిరంలో నిండిపోయి ఆ మేఘం వలన యాజకులు సేవ చేయడానికి నిలబడ లేకపోయారు.
Nehemiah 9:13 in Telugu 13 సీనాయి కొండ పైకి దిగి వచ్చి ఆకాశం నుండి వాళ్ళతో మాట్లాడి, వాళ్లకు నీతి విధులనూ సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను ధర్మాలను దయచేశావు.
Nehemiah 13:29 in Telugu 29 నా దేవా, వాళ్ళు యాజక వృత్తిని, యాజకుల, లేవీయుల ఒప్పందాన్ని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళను జ్ఞాపకముంచుకో.
Psalm 63:2 in Telugu 2 నీ బలాన్ని, నీ మహిమను చూడాలని పరిశుద్ధ మందిరంలో నీవైపు చూస్తూ కనిపెడుతున్నాను.
Psalm 73:1 in Telugu 1 ఆసాపు కీర్తన ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు.
Psalm 78:61 in Telugu 61 ఆయన తన బలాన్ని చెరలోకీ తన మహిమను విరోధుల చేతిలోకీ వెళ్ళడానికి అనుమతించాడు.
Psalm 89:3 in Telugu 3 నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.
Psalm 89:34 in Telugu 34 నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.
Psalm 90:16 in Telugu 16 నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.
Psalm 147:19 in Telugu 19 తన వాక్కును యాకోబుకు తెలియజేశాడు. తన నియమనిబంధనలు, న్యాయ నిర్ణయాలు ఇశ్రాయేలుకు తెలియజేశాడు.
Isaiah 5:2 in Telugu 2 ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది.
Isaiah 41:8 in Telugu 8 నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,
Isaiah 46:3 in Telugu 3 యాకోబు సంతానమా, ఇశ్రాయేలు సంతానంలో మిగిలిన వారలారా, మీరు గర్భంలో ప్రవేశించింది మొదలుకుని నేను మిమ్మల్ని భరించాను. మీరు తల్లి ఒడిలో పడినది మొదలుకొని నేను మిమ్మల్ని ఎత్తుకున్నాను. నా మాట వినండి.
Isaiah 60:19 in Telugu 19 ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీ మీద ప్రకాశింపదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ.
Jeremiah 31:9 in Telugu 9 వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు తమ విన్నపాలు చెప్తూ ఉండగా నేను వాళ్ళను నడిపిస్తాను. తిన్ననైన రహదారిలో, సెలయేళ్ల దగ్గరికి వాళ్ళను ప్రయాణం చేయిస్తాను. ఆ మార్గంలో వాళ్ళు తొట్రిల్లరు. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిగా ఉంటాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠసంతానంగా ఉంటాడు.”
Jeremiah 31:20 in Telugu 20 ఎఫ్రాయిము నా విలువైన బిడ్డ కాదా? అతడు నాకు ప్రియమైన ముద్దు బిడ్డ కాదా? నేనతనికి విరోధంగా మాట్లాడిన ప్రతిసారీ అతన్ని నా ప్రేమపూర్వకమైన మనస్సుకు జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఈ రకంగా అతనికోసం నా హృదయం తపిస్తూ ఉంది. కచ్చితంగా నేను అతనిమీద కనికరం చూపిస్తాను.” ఇది యెహోవా వాక్కు.
Jeremiah 31:33 in Telugu 33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు.
Jeremiah 33:20 in Telugu 20 యెహోవా ఇలా అంటున్నాడు. “దివారాత్రులు, వాటి సమయాల్లో అవి ఉండకుండా నేను పగటికి చేసిన నిబంధన, రాత్రికి చేసిన నిబంధన మీరు వ్యర్ధం చెయ్యగలిగితే,
Ezekiel 20:11 in Telugu 11 వాళ్లకు నా కట్టడలు నియమించి, నా విధులు వాళ్లకు తెలియజేశాను. ఎవడైనా వాటిని అనుసరిస్తే, వాటిని బట్టి బ్రతుకుతాడు.
Hosea 11:1 in Telugu 1 “ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను.
Matthew 21:33 in Telugu 33 “ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు.
Luke 1:54 in Telugu 54 అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి, వారిని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు, ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు.”
Luke 1:69 in Telugu 69 తన సేవకుడైన దావీదు వంశంలోనుంచి మన కోసం శక్తి గల రక్షకుణ్ణి తీసుకువచ్చాడు.
John 1:17 in Telugu 17 మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.
John 1:47 in Telugu 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు.
Acts 2:39 in Telugu 39 ఈ వాగ్దానం మీకూ మీ పిల్లలకూ, దూరంగా ఉన్న వారందరికీ, అంటే ప్రభువైన మన దేవుడు తన దగ్గరికి పిలుచుకొనే వారందరికీ చెందుతుంది” అని వారితో చెప్పాడు.
Acts 3:25 in Telugu 25 ‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
Acts 13:32 in Telugu 32 పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”
Romans 3:2 in Telugu 2 ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి.
Romans 8:15 in Telugu 15 ఎందుకంటే, మళ్లీ భయపడడానికి మీరు పొందింది దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. ఆ ఆత్మ ద్వారానే మనం, “అబ్బా! తండ్రీ!” అని దేవుణ్ణి పిలుస్తున్నాం.
Romans 9:6 in Telugu 6 అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
Ephesians 2:12 in Telugu 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.
Hebrews 6:13 in Telugu 13 దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు, ఆయన కంటే గొప్పవాడు ఎవడూ లేడు కాబట్టి, “నా తోడు” అంటూ ప్రమాణం చేశాడు.
Hebrews 8:6 in Telugu 6 కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్ఠమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు.
Hebrews 9:1 in Telugu 1 మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి.
Hebrews 9:3 in Telugu 3 ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
Hebrews 9:10 in Telugu 10 ఇవి కేవలం అన్నపానాలకు, పలురకాల ప్రక్షాళనలకు సంబంధించిన ఆచారాలు. ఇవి నూతన వ్యవస్థ వచ్చేంత వరకూ నిలిచి ఉండే శరీర సంబంధమైన నియమాలు.