Revelation 11:8 in Telugu 8 వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.
Other Translations King James Version (KJV) And their dead bodies shall lie in the street of the great city, which spiritually is called Sodom and Egypt, where also our Lord was crucified.
American Standard Version (ASV) And their dead bodies `lie' in the street of the great city, which spiritually is called Sodom and Egypt, where also their Lord was crucified.
Bible in Basic English (BBE) And their dead bodies will be in the open street of the great town, which in the spirit is named Sodom and Egypt, where their Lord was put to death on the cross.
Darby English Bible (DBY) and their body [shall be] on the street of the great city, which is called spiritually Sodom and Egypt, where also their Lord was crucified.
World English Bible (WEB) Their dead bodies will be in the street of the great city, which spiritually is called Sodom and Egypt, where also their Lord was crucified.
Young's Literal Translation (YLT) and their dead bodies `are' upon the broad-place of the great city (that is called spiritually Sodom, and Egypt, where also our Lord was crucified,)
Cross Reference Genesis 13:13 in Telugu 13 సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు.
Genesis 19:24 in Telugu 24 అప్పుడు సొదొమ గొమొర్రాల పైన ఆకాశం నుండి యెహోవా గంధకాన్నీ అగ్నినీ కురిపించాడు.
Exodus 1:13 in Telugu 13 ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు.
Exodus 3:7 in Telugu 7 యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.
Exodus 20:2 in Telugu 2 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.
Psalm 78:43 in Telugu 43 ఈజిప్టులో ఆయన చూపిన సూచక క్రియలనూ సోయను ప్రాంతంలో ఆయన చేసిన అద్భుతాలనూ వారు జ్ఞాపకం చేసుకోలేదు.
Psalm 79:2 in Telugu 2 వాళ్ళు నీ సేవకుల శవాలను రాబందులకు ఆహారంగా, నీ భక్తుల మృత దేహాలను అడవి జంతువులకు ఆహారంగా పడేశారు.
Isaiah 1:9 in Telugu 9 జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం.
Isaiah 3:9 in Telugu 9 వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు.
Jeremiah 23:14 in Telugu 14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
Jeremiah 26:23 in Telugu 23 వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు.
Ezekiel 16:53 in Telugu 53 నేను సొదొమను, దాని కూతుళ్ళనూ, షోమ్రోను, దాని కూతుళ్ళనూ గతంలో ఉన్న సౌభాగ్యానికి తెస్తాను. కాని నీ భాగ్యం వాళ్ళలా ఉండదు.
Ezekiel 23:3 in Telugu 3 వీళ్ళు ఐగుప్తు దేశంలో వేశ్యల్లా ప్రవర్తించారు. యవ్వనంలోనే వాళ్ళు వేశ్యల్లా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం, వాళ్ళ లేత చనుమొనలు నలపడం జరిగాయి.
Ezekiel 23:8 in Telugu 8 ఐగుప్తులో దాని యౌవ్వనంలోనే వాళ్ళు దాని చను మొనలు నలిపి, దానితో పండుకుని, వాళ్ళ కామం దాని మీద ఒలకబోసినప్పుడు అది నేర్చుకున్న వేశ్య ప్రవర్తన విడిచిపెట్టలేదు.
Ezekiel 23:19 in Telugu 19 తన యవ్వనంలో ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారం మనస్సుకు తెచ్చుకుని, ఆ తరువాత అది ఇంకా ఎన్నో వ్యభిచార క్రియలు జరిగించింది.
Ezekiel 23:27 in Telugu 27 ఐగుప్తు దేశంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన, నీ వ్యభిచార క్రియలు నీనుంచి తొలగిస్తాను. నువ్వు ఇంక నీ కళ్ళెత్తి ఐగుప్తు వైపు ఆశగా చూడవు. దాని గురించి ఇంక ఆలోచించవు.
Ezekiel 37:11 in Telugu 11 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు.
Amos 4:11 in Telugu 11 దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు నేను మీలో కొంతమందిని నాశనం చేశాను. మీరు మంటలోనుంచి లాగేసిన కట్టెల్లాగా తప్పించుకున్నారు. అయినా మీరు నా వైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.
Matthew 10:15 in Telugu 15 తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Luke 13:33 in Telugu 33 అయితే ఈ రోజూ రేపూ ఆ తరువాత కూడా నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరూషలేముకు బయట ప్రవక్త హతం కావడం జరగదు.
Acts 9:4 in Telugu 4 అప్పుడతడు నేల మీద పడిపోయాడు. “సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?” అనే ఒక శబ్దం విన్నాడు.
Hebrews 6:6 in Telugu 6 ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.
Hebrews 13:12 in Telugu 12 కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగరద్వారం బయట హింసలు పొందాడు.
2 Peter 2:6 in Telugu 6 దైవభక్తి లేని ప్రజలకు కలిగే వినాశనానికి ఉదాహరణగా దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని బూడిదగా మార్చాడు.
Jude 1:7 in Telugu 7 అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు.
Revelation 11:9 in Telugu 9 మనుషుల్లో, అన్ని జాతుల వారిలో, రకరకాల భాషలు మాట్లాడే వారిలో, తెగల వారిలో కొందరు వీరి మృత దేహాలను చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు.
Revelation 11:13 in Telugu 13 సరిగ్గా ఆ గంటలోనే ఒక మహా భూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో పదవ భాగం కూలిపోతుంది. ఆ భూకంపంలో ఏడు వేలమంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్నవారు భయకంపితులై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు.
Revelation 14:8 in Telugu 8 వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు.
Revelation 16:19 in Telugu 19 ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు.
Revelation 17:1 in Telugu 1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా.
Revelation 17:5 in Telugu 5 ఆమె నుదుటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. “ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటికీ ఇది తల్లి.”
Revelation 18:2 in Telugu 2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
Revelation 18:18 in Telugu 18 నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ మహా నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు.
Revelation 18:21 in Telugu 21 ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
Revelation 18:24 in Telugu 24 ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.