Psalm 80:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం, సోషన్నీము ఏదూత్ (ఒడంబడిక కలువలు) రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.
Other Translations King James Version (KJV) Give ear, O Shepherd of Israel, thou that leadest Joseph like a flock; thou that dwellest between the cherubims, shine forth.
American Standard Version (ASV) Give ear, O Shepherd of Israel, Thou that leadest Joseph like a flock; Thou that sittest `above' the cherubim, shine forth.
Bible in Basic English (BBE) <To the chief music-maker; put to Shoshannim-eduth. Of Asaph. A Psalm.> Give ear, O Keeper of Israel, guiding Joseph like a flock; you who have your seat on the winged ones, let your glory be seen.
Darby English Bible (DBY) {To the chief Musician. On Shoshannim-Eduth. Of Asaph. A Psalm.} Give ear, O Shepherd of Israel, thou that leadest Joseph like a flock; thou that sittest [between] the cherubim, shine forth.
World English Bible (WEB) > Hear us, Shepherd of Israel, You who lead Joseph like a flock, You who sit above the cherubim, shine forth.
Young's Literal Translation (YLT) To the Overseer. -- `On the Lilies.' A testimony of Asaph. -- A Psalm. Shepherd of Israel, give ear, Leading Joseph as a flock, Inhabiting the cherubs -- shine forth,
Cross Reference Exodus 25:20 in Telugu 20 ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.
Deuteronomy 33:2 in Telugu 2 శేయీరు నుంచి వారికి ఉదయించాడు. ఆయన పారాను పర్వతం నుంచి ప్రకాశించాడు వేలాది వేల పవిత్రులతో ఆయన వచ్చాడు. ఆయన కుడివైపు మెరుపులు మెరుస్తున్నాయి.
1 Samuel 4:4 in Telugu 4 కాబట్టి పెద్దలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడనుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాలకు అధిపతి యెహోవా నిబంధన మందసాన్ని తెప్పించారు. ఏలీ ఇద్దరు కుమారులు హొఫ్నీ, ఫీనెహాసు కూడా అక్కడే దేవుని నిబంధన మందసం దగ్గర ఉన్నారు.
2 Samuel 6:2 in Telugu 2 ఆ మందసాన్ని అక్కడి నుండి తీసుకు రావడానికి దావీదు ఇశ్రాయేలీయుల్లో నుండి ముప్ఫై వేల మందిని సమకూర్చి బయలుదేరాడు.
2 Kings 19:15 in Telugu 15 యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.
Job 10:3 in Telugu 3 నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం నీకు ఇష్టమా? దుర్మార్గుల ఆలోచనలు నెరవేరేలా వాళ్ళపై నీ దయ చూపడం నీకు సంతోషం కలిగిస్తుందా? నీ చేతిపనులను తిరస్కరించడం నీకు సంతోషమా?
Psalm 5:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం, వేణువులతో పాడవలసినది. దావీదు కీర్తన. యెహోవా, నా మొర విను. నా మూలుగుల గురించి ఆలోచించు.
Psalm 23:1 in Telugu 1 దావీదు కీర్తన. యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు.
Psalm 45:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుడి కోసం, శోషన్నిము రాగం పై పాడాలి. కోరహు వారసుల దైవ ధ్యానం. ఒక ప్రేమ గీతం. నా హృదయం ఒక శ్రేష్ఠమైన విషయంతో నిండి పొంగి పొర్లుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని బిగ్గరగా చదువుతాను. నా నాలుక వేగంగా రాసేవాడి కలంలా ఉంది.
Psalm 50:2 in Telugu 2 పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
Psalm 55:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాయిద్యాలపై పాడేది. దావీదు రాసిన దైవధ్యానం దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు.
Psalm 60:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. షూషన్ ఎదూత్ అనే రాగంతో పాడేది. దావీదు ఆరామ్ నహరాయీమ్ వారితో ఆరామ్ సోబాయీ వారితో యుద్ధం చేసినప్పుడు యోవాబు ఉప్పు లోయలో పన్నెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి.
Psalm 69:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. శోషన్నీము (కలువల రాగం) అనే రాగంలో పాడవలసినది. దావీదు కీర్తన దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి.
Psalm 77:20 in Telugu 20 మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.
Psalm 78:52 in Telugu 52 ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.
Psalm 78:67 in Telugu 67 తరవాత ఆయన యోసేపు గుడారాన్ని అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు.
Psalm 80:3 in Telugu 3 దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
Psalm 80:7 in Telugu 7 సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
Psalm 80:19 in Telugu 19 యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.
Psalm 94:1 in Telugu 1 ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు.
Psalm 99:1 in Telugu 1 యెహోవా పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాలు వణికిపోతాయి. ఆయన కెరూబులకు పైగా కూర్చుని ఉన్నాడు. భూమి కంపిస్తుంది.
Isaiah 40:11 in Telugu 11 ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.
Isaiah 49:9 in Telugu 9 నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది.
Isaiah 60:1 in Telugu 1 లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
Isaiah 63:11 in Telugu 11 ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?
Ezekiel 1:13 in Telugu 13 ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి.
Ezekiel 10:4 in Telugu 4 యెహోవా మహిమ తేజస్సు కెరూబుల పైనుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గర నిలిచింది. దాంతో మేఘం మందిరాన్ని నింపివేసింది. ఆవరణ అంతా యెహోవా మహిమ తేజస్సుతో వెలిగి పోతూ ఉంది.
Ezekiel 34:23 in Telugu 23 వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
Ezekiel 43:2 in Telugu 2 అప్పుడు నాకు ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడింది. దానినుండి పుట్టిన ధ్వని విస్తారమైన జలాల ధ్వనిలాగా వినబడింది. ఆయన మహిమ వలన భూమి ధగధగా మెరిసిపోయింది.
Daniel 9:17 in Telugu 17 మా దేవా, దీన్ని బట్టి నీ సేవకుడు చేసే ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి, ప్రభువు చిత్తానుసారంగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలం మీదికి నీ ముఖప్రకాశం రానియ్యి.
John 10:3 in Telugu 3 అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు.
John 10:14 in Telugu 14 నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు.
Hebrews 13:20 in Telugu 20 గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్య నిబంధన రక్తాన్ని బట్టి చనిపోయిన వారిలో నుండి సజీవుడిగా లేపిన శాంతి ప్రదాత అయిన దేవుడు
1 Peter 2:25 in Telugu 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.
1 Peter 5:4 in Telugu 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.
Revelation 21:23 in Telugu 23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం.