Psalm 56:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. యోనతేలెం రెహూకిం అనే రాగంతో పాడేది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకున్నపుడు అతడు రాసిన కీర్తన. దేవా, నన్ను కరుణించు. మనుషులు నన్ను మింగివేయాలని చూస్తున్నారు. వారు రోజంతా నా మీద పోరాడుతూ నన్ను అణచివేస్తున్నారు.
Other Translations King James Version (KJV) Be merciful unto me, O God: for man would swallow me up; he fighting daily oppresseth me.
American Standard Version (ASV) Be merciful unto me, O God; for man would swallow me up: All the day long he fighting oppresseth me.
Bible in Basic English (BBE) <To the chief music-maker; put to Jonath elem rehokim. Of David. Michtam. When the Philistines took him in Gath.> Have mercy on me, O God, for man is attempting my destruction; every day he makes cruel attacks against me.
Darby English Bible (DBY) {To the chief Musician. On Jonathelem-rechokim. Of David. Michtam; when the Philistines took him in Gath.} Be gracious unto me, O God; for man would swallow me up: all the day long fighting he oppresseth me.
World English Bible (WEB) > Be merciful to me, God, for man wants to swallow me up. All day long, he attacks and oppresses me.
Young's Literal Translation (YLT) To the Overseer. -- `On the Dumb Dove far off.' -- A secret treasure of David, in the Philistines' taking hold of him in Gath. Favour me, O God, for man swallowed me up, All the day fighting he oppresseth me,
Cross Reference 1 Samuel 21:11 in Telugu 11 ఆకీషు సేవకులు “ఈ దావీదు ఆ దేశపు రాజు కదా? ఆ దేశపు ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేల మందిని హతం చేసారని పాడిన పాటలు ఇతని గురించినవే గదా” అని అతని గురించి రాజుతో చెబుతుంటే,
1 Samuel 29:4 in Telugu 4 అందుకు వారు అతని మీద కోపగించి “ఇతణ్ణి నువ్వు కేటాయించిన స్థలానికి తిరిగి పంపించు. అతడు మనతో కలిసి యుద్ధానికి రాకూడదు, యుద్ధ సమయంలో అతడు మనకు విరోధిగా మారతాడేమో. ఏం చేసి అతడు తన యజమానితో సఖ్యత కుదుర్చుకుంటాడు? మనవాళ్ళ తలలు నరికి తీసుకుపోవడం చేతనే కదా.
Psalm 16:1 in Telugu 1 దావీదు మిఖ్తీమ్ (ప్రశస్థ) కీర్తన. దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు.
Psalm 21:9 in Telugu 9 నువ్వు నీ కోపసమయంలో అగ్నిగుండంలో వాళ్ళను దహిస్తావు. తన ప్రచండ కోపంలో యెహోవా వాళ్ళను లయం చేస్తాడు, ఆ అగ్ని వాళ్ళను దహించేస్తుంది.
Psalm 27:2 in Telugu 2 నా శరీరాన్ని మింగడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నా విరోధులూ శత్రువులూ తొట్రిల్లి కూలిపోతారు.
Psalm 31:9 in Telugu 9 యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి.
Psalm 35:25 in Telugu 25 వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి మింగేశాం, అని చెప్పనివ్వకు.
Psalm 57:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు దగ్గర నుండి పారిపోయి గుహలో చేరినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది.
Psalm 58:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) మనుషులారా, మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులారా, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా?
Psalm 59:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం). నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
Psalm 59:10 in Telugu 10 నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
Psalm 60:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. షూషన్ ఎదూత్ అనే రాగంతో పాడేది. దావీదు ఆరామ్ నహరాయీమ్ వారితో ఆరామ్ సోబాయీ వారితో యుద్ధం చేసినప్పుడు యోవాబు ఉప్పు లోయలో పన్నెండు వేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం) దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి.
Psalm 69:13 in Telugu 13 యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి.
Psalm 106:17 in Telugu 17 భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.
Psalm 124:3 in Telugu 3 వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
Psalm 136:10 in Telugu 10 ఈజిప్టు దేశంలోని తొలిచూలు సంతానాన్ని ఆయన సంహరించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Psalm 136:15 in Telugu 15 ఫరో సైన్యాన్ని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Psalm 136:17 in Telugu 17 గొప్ప రాజులను ఆయన కూలగొట్టాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Psalm 143:12 in Telugu 12 నేను నీ సేవకుణ్ణి. నీ నిబంధన విశ్వసనీయతను బట్టి నా విరోధులను లేకుండా చెయ్యి. నా శత్రువులందరినీ నాశనం చెయ్యి.
Proverbs 1:12 in Telugu 12 ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.
Lamentations 2:2 in Telugu 2 యాకోబు పట్టణాల్లో ఒక్క దాని మీద కూడా కనికరం లేకుండా ప్రభువు అన్నిటినీ మింగివేశాడు. తన ఆగ్రహంతో ఆయన యూదా కుమార్తె కోటలను కూలగొట్టాడు. ఆయన వాటిని నేల కూల్చి సిగ్గు పరిచాడు. దాని రాజ్యాన్నీ, దాని అధిపతులను ఆయన అవమాన పరిచాడు.
Lamentations 2:5 in Telugu 5 ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.
Lamentations 2:16 in Telugu 16 నీ శత్రువులందరూ నిన్ను చూసి పెద్దగా నోరు తెరిచారు. వాళ్ళు ఎగతాళి చేసి పళ్ళు కొరుకుతూ “దాన్ని మింగివేశాం! కచ్చితంగా ఈ రోజు కోసమేగా మనం కనిపెట్టింది! అది జరిగింది. దాన్ని మనం చూశాం” అంటున్నారు.
Hosea 8:8 in Telugu 8 ఇశ్రాయేలు వారిని శత్రువులు కబళిస్తారు. ఎవరికీ ఇష్టంలేని ఓటికుండల్లా వారు అన్యజనుల్లో చెదిరి ఉంటారు.
1 Corinthians 15:54 in Telugu 54 ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి.