Psalm 10:3 in Telugu 3 దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి యెహోవాను అవమానిస్తాడు.
Other Translations King James Version (KJV) For the wicked boasteth of his heart's desire, and blesseth the covetous, whom the LORD abhorreth.
American Standard Version (ASV) For the wicked boasteth of his heart's desire, And the covetous renounceth, `yea', contemneth Jehovah.
Bible in Basic English (BBE) For the evil-doer is lifted up because of the purpose of his heart, and he whose mind is fixed on wealth is turned away from the Lord, saying evil against him.
Darby English Bible (DBY) For the wicked boasteth of his soul's desire, and he blesseth the covetous; he contemneth Jehovah.
Webster's Bible (WBT) For the wicked boasteth of his heart's desire, and blesseth the covetous, whom the LORD abhorreth.
World English Bible (WEB) For the wicked boasts of his heart's cravings, He blesses the greedy, and condemns Yahweh.
Young's Literal Translation (YLT) Because the wicked hath boasted Of the desire of his soul, And a dishonest gainer he hath blessed, He hath despised Jehovah.
Cross Reference Exodus 15:9 in Telugu 9 ‘వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను’ అని శత్రువు అనుకున్నాడు.
Leviticus 26:30 in Telugu 30 నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను.
Deuteronomy 29:19 in Telugu 19 అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ ‘నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది’ అనుకుంటాడు.
Deuteronomy 32:19 in Telugu 19 యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు.
1 Samuel 23:21 in Telugu 21 సౌలు వారితో ఇలా అన్నాడు. “మీరు నాపై చూపిన అభిమానాన్ని బట్టి యెహోవా మిమ్మల్ని దీవిస్తాడు గాక.
Job 31:24 in Telugu 24 బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే,
Psalm 5:6 in Telugu 6 అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.
Psalm 35:21 in Telugu 21 నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.
Psalm 49:6 in Telugu 6 వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
Psalm 49:11 in Telugu 11 వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
Psalm 49:18 in Telugu 18 మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
Psalm 52:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుడి కోసం. ఏదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంట్లో ఉన్నాడు, అని చెప్పినప్పుడు దావీదు రాసిన దైవధ్యానం. బలశాలీ, సమస్యను సృష్టించి ఎందుకు గర్విస్తున్నావు? దేవుని నిబంధన కృప నిత్యమూ ఉంటుంది.
Psalm 73:8 in Telugu 8 వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు.
Psalm 94:4 in Telugu 4 వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు.
Proverbs 28:4 in Telugu 4 ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చేవారు దుష్టులను పొగుడుతుంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడతారు.
Isaiah 10:7 in Telugu 7 కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.
Isaiah 37:23 in Telugu 23 నువ్వు ఎవరిని తిరస్కరించావు? ఎవరిని దూషించావు? గర్వంతో ఎవరిని భయపెట్టాలని చూశావు? పరిశుద్ధుడైన ఇశ్రాయేలీయుల దేవుణ్ణి కదా?
Isaiah 57:17 in Telugu 17 అక్రమంగా సంపాదించిన అతని పాపాన్ని బట్టి నేను కోపపడి అతన్ని శిక్షించాను. నా ముఖాన్ని కోపంతో చాటు చేశాను. అయితే అతడు తనకిష్టమైన దారిలోకి తిరిగి వెళ్ళిపోయాడు.
Jeremiah 22:17 in Telugu 17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.
Hosea 12:7 in Telugu 7 కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు. దగా చెయ్యడమే వారికి ఇష్టం.
Micah 6:10 in Telugu 10 దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.
Habakkuk 2:9 in Telugu 9 తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని, తన యింటివారి కోసం అన్యాయంగా లాభం సంపాదించుకొనే వాడికి బాధ.
Zechariah 11:5 in Telugu 5 వాటిని కొనుక్కున్న వాళ్ళు చంపినప్పటికీ నేరం అంటని వాళ్ళమేనని అనుకుంటారు. వాటిని అమ్మిన వారు ‘మాకు చాలా ధనం దొరుకుతుంది, యెహోవాకు స్తోత్రం’ అని చెప్పుకుంటారు. వాటిని కావలి కాచేవారు వాటి పట్ల జాలి చూపించరు.”
Matthew 26:15 in Telugu 15 “యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
Luke 12:15 in Telugu 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, “మీరు అత్యాశకు చోటివ్వకండి. జీవం అంటే సంపదలు విస్తరించడం కాదు.”
Luke 12:19 in Telugu 19 అప్పుడు నా ప్రాణంతో ‘ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపడే తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు’ అని చెబుతాను’ అనుకున్నాడు.
Luke 16:14 in Telugu 14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు.
Romans 1:29 in Telugu 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.
Romans 1:32 in Telugu 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.
1 Corinthians 6:10 in Telugu 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
Ephesians 5:5 in Telugu 5 మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
Colossians 3:5 in Telugu 5 కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి.
1 Timothy 6:9 in Telugu 9 ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి.
2 Timothy 3:2 in Telugu 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,
James 4:13 in Telugu 13 “నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట.
James 4:16 in Telugu 16 ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది.
1 John 2:15 in Telugu 15 ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే.