Numbers 30:2 in Telugu 2 “ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.
Other Translations King James Version (KJV) If a man vow a vow unto the LORD, or swear an oath to bind his soul with a bond; he shall not break his word, he shall do according to all that proceedeth out of his mouth.
American Standard Version (ASV) When a man voweth a vow unto Jehovah, or sweareth an oath to bind his soul with a bond, he shall not break his word; he shall do according to all that proceedeth out of his mouth.
Bible in Basic English (BBE) And Moses said to the heads of the tribes of the children of Israel, This is the order of the Lord.
Darby English Bible (DBY) If a man vow a vow to Jehovah, or swear an oath to bind his soul with a bond, he shall not break his word; according to all that hath gone out of his mouth shall he do.
Webster's Bible (WBT) And Moses spoke to the heads of the tribes concerning the children of Israel, saying, This is the thing which the LORD hath commanded.
World English Bible (WEB) When a man vows a vow to Yahweh, or swears an oath to bind his soul with a bond, he shall not break his word; he shall do according to all that proceeds out of his mouth.
Young's Literal Translation (YLT) `When a man voweth a vow to Jehovah, or hath sworn an oath to bind a bond on his soul, he doth not pollute his word; according to all that is going out from his mouth he doth.
Cross Reference Genesis 28:20 in Telugu 20 అప్పుడు యాకోబు “నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేలా దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి,
Exodus 20:7 in Telugu 7 నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.
Leviticus 5:4 in Telugu 4 అలాగే ఎవరైనా తెలియకుండా తొందరపడి మంచైనా, చెడైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా, తెలియకుండా తొందరపడి ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా ఆ తరువాత తెలుసుకుని చేయకుండా ఉంటే ఆ విషయంలో అతడు అపరాధి అవుతాడు.
Leviticus 27:2 in Telugu 2 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఎవరన్నా విశేషమైన మ్రొక్కుబడి చేస్తే నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి.
Numbers 21:2 in Telugu 2 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకుని “నువ్వు మాకు ఈ జనం మీద జయం ఇస్తే, మేము నీ పేరట వారి పట్టణాలు పూర్తిగా నాశనం చేస్తాం” అన్నారు.
Numbers 30:3 in Telugu 3 తన తండ్రి ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యెహోవాకు చేసిన మొక్కుబడి గురించి ఆమె తండ్రి ఎరిగి, ఏమీ మాట్లాడకపోతే ఆమె మొక్కుబడి నిలిచి ఉంటుంది.
Numbers 30:10 in Telugu 10 ఆమె తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుబడులు, ప్రమాణాలు చేసి ఉంటే,
Deuteronomy 23:21 in Telugu 21 మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది.
Judges 11:11 in Telugu 11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కలిసి వెళ్లినప్పుడు ప్రజలు అతన్ని తమకు ప్రధానిగా, అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన వాగ్దానాల సంగతి అంతా వినిపించాడు.
Judges 11:30 in Telugu 30 అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు “నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే,
Judges 11:35 in Telugu 35 కాబట్టి అతడు ఆమెను చూసి, తన బట్టలు చింపుకుని “అయ్యో నా కూతురా, నువ్వు నన్ను ఎంతో క్రుంగదీశావు, నన్ను తల్లడిల్లజేశావు. నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక వెనుక తీయలేను” అన్నాడు.
Judges 11:39 in Telugu 39 ఆ రెండు నెలల తరువాత ఆమె తన తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు అతడు తాను మొక్కు కొన్న మొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు.
Job 22:27 in Telugu 27 నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు.
Psalm 15:3 in Telugu 3 అతడు నాలుకతో కొండేలు చెప్పడు. ఇతరులకు హాని చెయ్యడు, తన పొరుగు వాణ్ణి కించపరచడు.
Psalm 22:25 in Telugu 25 మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను.
Psalm 50:14 in Telugu 14 దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
Psalm 55:20 in Telugu 20 నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.
Psalm 56:12 in Telugu 12 దేవా, నువ్వు చావునుండి నా ప్రాణాన్ని తప్పించావు. నేను జీవపు వెలుగులో దేవుని ఎదుట సంచరించాలని నా అడుగులు జారకుండా తప్పించావు.
Psalm 66:13 in Telugu 13 దహనబలులతో నేను నీ మందిరంలోకి వస్తాను.
Psalm 76:11 in Telugu 11 మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.
Psalm 116:14 in Telugu 14 యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను.
Psalm 116:18 in Telugu 18 ఆయన ప్రజలందరి ఎదుటా యెహోవాకు నా మొక్కుబడులు తీరుస్తాను.
Psalm 119:106 in Telugu 106 నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
Proverbs 20:25 in Telugu 25 తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.
Ecclesiastes 5:4 in Telugu 4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు.
Nahum 1:15 in Telugu 15 శాంతి సందేశం ప్రకటిస్తూ, సమాధాన శుభ సమాచారం బోధించే వారి పాదాలు పర్వతాల మీద కనిపిస్తున్నాయి. యూదా ప్రజలారా, మీ ఉత్సవాలు జరుపుకోండి. మీ మొక్కుబళ్ళు చెల్లించండి. ఇప్పటి నుండి దుర్మార్గుడు దండెత్తి మీ మధ్యకు రాడు. వాడు సమూలంగా నాశనం అయ్యాడు.
Matthew 5:33 in Telugu 33 “‘నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
Matthew 14:7 in Telugu 7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
Matthew 23:16 in Telugu 16 “అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు.
Matthew 23:18 in Telugu 18 అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు.
Acts 23:12 in Telugu 12 తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు.
Acts 23:14 in Telugu 14 వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం.
Acts 23:21 in Telugu 21 వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు” అని చెప్పాడు.
2 Corinthians 1:23 in Telugu 23 మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి.
2 Corinthians 9:9 in Telugu 9 దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది.