Numbers 23:21 in Telugu 21 ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు. వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.
Other Translations King James Version (KJV) He hath not beheld iniquity in Jacob, neither hath he seen perverseness in Israel: the LORD his God is with him, and the shout of a king is among them.
American Standard Version (ASV) He hath not beheld iniquity in Jacob; Neither hath he seen perverseness in Israel: Jehovah his God is with him, And the shout of a king is among them.
Bible in Basic English (BBE) He has seen no evil in Jacob or wrongdoing in Israel: the Lord his God is with him, and the glad cry of a king is among them.
Darby English Bible (DBY) He hath not beheld iniquity in Jacob, neither hath he seen wrong in Israel; Jehovah his God is with him, and the shout of a king is in his midst.
Webster's Bible (WBT) He hath not beheld iniquity in Jacob, neither hath he seen perverseness in Israel; the LORD his God is with him, and the shout of a king is among them.
World English Bible (WEB) He has not saw iniquity in Jacob; Neither has he seen perverseness in Israel: Yahweh his God is with him, The shout of a king is among them.
Young's Literal Translation (YLT) He hath not beheld iniquity in Jacob, Nor hath He seen perverseness in Israel; Jehovah his God `is' with him, And a shout of a king `is' in him.
Cross Reference Exodus 13:21 in Telugu 21 పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.
Exodus 29:45 in Telugu 45 నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి వారికి దేవుడుగా ఉంటాను.
Exodus 33:14 in Telugu 14 అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు.
Exodus 34:9 in Telugu 9 “ప్రభూ, నా మీద నీకు దయ ఉంటే నా మనవి ఆలకించు. దయచేసి నా ప్రభువు మా మధ్య మాతో ఉండి మాతో కలసి ప్రయాణించాలి. ఈ ప్రజలు మాటకు లోబడేవాళ్ళు కారు. మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు” అన్నాడు.
Deuteronomy 33:5 in Telugu 5 అప్పుడు ప్రజల అధికారులూ ఇశ్రాయేలు గోత్రాలవారూ ఒకచోట చేరితే యెహోవా యెషూరూనులో రాజయ్యాడు.
Judges 6:13 in Telugu 13 గిద్యోను “అయ్యా, నా ప్రభూ, యెహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకెందుకు సంభవిస్తుంది? యెహోవా ఐగుప్తులో నుంచి మమ్మలి రప్పించాడని చెబుతూ, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించాడు గదా” అని అతనితో చెప్పాడు.
2 Chronicles 13:12 in Telugu 12 “ఆలోచించండి, దేవుడే మాకు తోడుగా, మాకు అధిపతిగా ఉన్నాడు. ఆయన యాజకులు మీ మీద ఆర్భాటం చేయడానికీ బూరలు ఊదడానికీ మా పక్షాన ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వీకుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకండి. చేసినా మీకు జయం కలగదు.”
Psalm 23:4 in Telugu 4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.
Psalm 32:2 in Telugu 2 యెహోవా నిర్దోషిగా పరిగణించిన వాడు, తన ఆత్మలో కపటమనేది లేనివాడు ధన్యజీవి.
Psalm 32:5 in Telugu 5 అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.
Psalm 46:7 in Telugu 7 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
Psalm 46:11 in Telugu 11 సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.
Psalm 47:5 in Telugu 5 దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.
Psalm 89:15 in Telugu 15 నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.
Psalm 97:1 in Telugu 1 యెహోవా పరిపాలిస్తున్నాడు. భూమి ఆనందిస్తుంది గాక. ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక.
Psalm 103:12 in Telugu 12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
Psalm 118:15 in Telugu 15 నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది.
Isaiah 1:18 in Telugu 18 యెహోవా ఇలా అంటున్నాడు. రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.
Isaiah 8:10 in Telugu 10 పథకం వేసుకోండి గానీ దాన్ని అమల్లో పెట్టలేరు. ఆజ్ఞ ఇవ్వండి గానీ ఎవరూ దాన్ని పాటించరు. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు.
Isaiah 12:6 in Telugu 6 గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”
Isaiah 33:22 in Telugu 22 ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.
Isaiah 38:17 in Telugu 17 ఆ తీవ్రమైన బాధ వల్లనే నాకు నెమ్మది కలిగింది. నీ ప్రేమతో నా ప్రాణాన్ని నాశనం అనే గోతి నుండి విడిపించావు. నా పాపాలన్నిటినీ నీ వీపు వెనుకకు పారవేశావు.
Isaiah 41:10 in Telugu 10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను. నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి. దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.
Jeremiah 50:20 in Telugu 20 యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలులో అతిక్రమాల కోసం వెదుకుతారు, కానీ ఎంత వెదికినా అవి కనపడవు. యూదా ప్రజల పాపాల కోసం వాకబు చేస్తాను కానీ అవి దొరకవు. మిగిలి ఉన్న వాళ్ళను నేను క్షమిస్తాను.
Ezekiel 48:35 in Telugu 35 ఆ నగరం చుట్టు కొలత తొమ్మిది కిలోమీటర్ల, 700 మీటర్ల పొడవు. “యెహోవా ఉండే స్థలం” అని ఆనాటి నుండి ఆ పట్టణానికి పేరు.
Hosea 14:2 in Telugu 2 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి. మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు. అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.
Micah 7:18 in Telugu 18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.
Luke 19:37 in Telugu 37 ఆలీవ్ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.
Romans 4:7 in Telugu 7 ఎలా అంటే, “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
Romans 6:14 in Telugu 14 మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.
Romans 8:1 in Telugu 1 ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు.
2 Corinthians 2:14 in Telugu 14 దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు.
2 Corinthians 5:19 in Telugu 19 అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.
2 Corinthians 6:16 in Telugu 16 దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”