Micah 5:2 in Telugu 2 బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు.
Other Translations King James Version (KJV) But thou, Bethlehem Ephratah, though thou be little among the thousands of Judah, yet out of thee shall he come forth unto me that is to be ruler in Israel; whose goings forth have been from of old, from everlasting.
American Standard Version (ASV) But thou, Beth-lehem Ephrathah, which art little to be among the thousands of Judah, out of thee shall one come forth unto me that is to be ruler in Israel; whose goings forth are from of old, from everlasting.
Bible in Basic English (BBE) For this cause he will give them up till the time when she who is with child has given birth: then the rest of his brothers will come back to the children of Israel.
Darby English Bible (DBY) (And thou, Bethlehem Ephratah, little to be among the thousands of Judah, out of thee shall he come forth unto me [who is] to be Ruler in Israel: whose goings forth are from of old, from the days of eternity.)
World English Bible (WEB) But you, Bethlehem Ephrathah, Being small among the clans of Judah, Out of you one will come forth to me that is to be ruler in Israel; Whose goings forth are from of old, from everlasting.
Young's Literal Translation (YLT) And thou, Beth-Lehem Ephratah, Little to be among the chiefs of Judah! From thee to Me he cometh forth -- to be ruler in Israel, And his comings forth `are' of old, From the days of antiquity.
Cross Reference Genesis 35:19 in Telugu 19 ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.
Genesis 48:7 in Telugu 7 పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు.
Genesis 49:10 in Telugu 10 షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
Exodus 18:21 in Telugu 21 నువ్వు ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తులు, సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులుకాని సమర్ధులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి. వారిని న్యాయాధిపతులుగా నియమించు. వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వాళ్ళను నియమించు.
Exodus 18:25 in Telugu 25 మోషే ఇశ్రాయేలు ప్రజలందరిలో సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున అధికారులుగా నియమించి వాళ్లకు న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు.
Deuteronomy 1:15 in Telugu 15 కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను.
Ruth 4:11 in Telugu 11 అందుకు ఆ ఊరి ద్వారం దగ్గర ఉన్న ప్రజలూ, పెద్దలూ “మేము సాక్షులం. నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని యెహోవా ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేసిన రాహేలు, లేయాల వలే చేస్తాడు గాక!
1 Samuel 8:12 in Telugu 12 అతడు కొందరిని తన సైన్యంలోని వెయ్యిమందిపై అధికారులుగా, యాభైమందిపై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాల సామానులు తయారుచేయడానికి వారిని పెట్టుకుంటాడు.
1 Samuel 10:19 in Telugu 19 అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. ‘మా మీద ఒకరిని రాజుగా నియమించు’ అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి.”
1 Samuel 17:12 in Telugu 12 దావీదు యూదా దేశపు బేత్లెహేమువాడు, ఎఫ్రాతీయుడైన యెష్షయి కొడుకు. యెష్షయికి ఎనిమిదిమంది కొడుకులు. అతడు సౌలు కాలంలో ముసలివాడై బలహీనంగా ఉన్నాడు.
1 Samuel 17:18 in Telugu 18 ఇంకా ఈ పది జున్నుగడ్డలు తీసికువెళ్ళి వారి సహస్రాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమసమాచారం తెలుసుకుని వారి దగ్గరనుండి ఏదైనా గుర్తు తీసుకురా” అని చెప్పి పంపించాడు.
1 Samuel 23:23 in Telugu 23 మీరు ఎంతో జాగ్రత్తగా అతడు దాక్కొన్న ప్రాంతాలను కనిపెట్టిన సంగతి అంతా నాకు తెలియజేయడానికి మళ్ళీ నా దగ్గరికి తప్పకుండా రండి, అప్పుడు నేను మీతో కలసి వస్తాను. అతడు దేశంలో ఎక్కడ ఉన్నప్పటికీ యూదావారందరిలో నేను అతణ్ణి వెతికి పట్టుకొంటాను” అని చెప్పాడు.
1 Chronicles 2:50 in Telugu 50 ఇక కాలేబు సంతానం ఎవరంటే, ఎఫ్రాతా వల్ల అతనికి మొదట హూరు పుట్టాడు. హూరుకు శోబాలు, శల్మా, హారేపు పుట్టారు.
1 Chronicles 2:54 in Telugu 54 శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ.
1 Chronicles 4:4 in Telugu 4 ఇక పెనూయేలు గెదోరీయులకు మూలపురుషుడు. ఏజెరు అనేవాడు హూషాయీయులకు మూలపురుషుడు. వీళ్ళంతా హూరు కొడుకులు. హూరు ఎఫ్రాతాకు పెద్ద కొడుకు, బేత్లెహేముకు తండ్రి.
1 Chronicles 5:2 in Telugu 2 తన సోదరులందరికంటే యూదా ప్రముఖుడు. యూదా వంశంలోనుండే పరిపాలకుడు రానున్నాడు. అయినా ప్రథమ సంతానపు జన్మహక్కు యోసేపు పరమయింది.
Psalm 90:2 in Telugu 2 పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
Psalm 102:25 in Telugu 25 పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
Psalm 132:6 in Telugu 6 ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది.
Proverbs 8:22 in Telugu 22 గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు.
Isaiah 9:6 in Telugu 6 ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.
Isaiah 11:1 in Telugu 1 యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.
Isaiah 53:2 in Telugu 2 ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.
Jeremiah 13:5 in Telugu 5 యెహోవా ఆజ్ఞాపించినట్టే నేను వెళ్ళి యూఫ్రటీసు దగ్గర దాన్ని దాచిపెట్టాను.
Jeremiah 30:21 in Telugu 21 వాళ్ళ నాయకుడు వాళ్ళల్లోనుంచే వస్తాడు. నేను వాళ్ళను ఆకర్షించినప్పుడు, వాళ్ళు నన్ను సమీపించినప్పుడు, వాళ్ళ మధ్య నుంచి అతడు బయలుదేరుతాడు. నేను ఇది చెయ్యకపోతే, నన్ను సమీపించే సాహసం ఎవడు చెయ్యగలడు?” ఇది యెహోవా వాక్కు.
Ezekiel 17:22 in Telugu 22 ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
Ezekiel 34:23 in Telugu 23 వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
Ezekiel 37:22 in Telugu 22 వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను.
Amos 9:11 in Telugu 11 పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.
Zechariah 9:9 in Telugu 9 సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.
Matthew 2:6 in Telugu 6 ‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు.
Matthew 28:18 in Telugu 18 అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
Luke 1:31 in Telugu 31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
Luke 2:4 in Telugu 4 యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు.
Luke 23:2 in Telugu 2 “ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు.
Luke 23:38 in Telugu 38 “ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు.
John 1:1 in Telugu 1 ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
John 7:42 in Telugu 42 క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?” అన్నారు.
John 19:14 in Telugu 14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.
1 Corinthians 1:27 in Telugu 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు.
Colossians 1:17 in Telugu 17 ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.
Hebrews 7:14 in Telugu 14 మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు.
Hebrews 13:8 in Telugu 8 యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు.
1 John 1:1 in Telugu 1 ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం.
Revelation 1:11 in Telugu 11 నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను.
Revelation 2:8 in Telugu 8 “స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. మొదటివాడూ చివరివాడూ చనిపోయి తిరిగి బతికిన వాడు చెబుతున్నదేమిటంటే
Revelation 19:16 in Telugu 16 ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.
Revelation 21:6 in Telugu 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.