Micah 2:13 in Telugu 13 వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు. వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు. వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు. యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు.
Other Translations King James Version (KJV) The breaker is come up before them: they have broken up, and have passed through the gate, and are gone out by it: and their king shall pass before them, and the LORD on the head of them.
American Standard Version (ASV) The breaker is gone up before them: they have broken forth and passed on to the gate, and are gone out thereat; and their king is passed on before them, and Jehovah at the head of them.
Bible in Basic English (BBE) The opener of the way will go up before them: forcing their way out they will go on to the doorway and out through it: their king will go on before them, and the Lord at their head.
Darby English Bible (DBY) One that breaketh through is gone up before them: they have broken forth, and have passed on to the gate, and are gone out by it; and their king passeth on before them, and Jehovah at the head of them.
World English Bible (WEB) He who breaks open the way goes up before them. They break through the gate, and go out. And their king passes on before them, With Yahweh at their head."
Young's Literal Translation (YLT) Gone up hath the breaker before them, They have broken through, Yea, they pass through the gate, Yea, they go out through it, And pass on doth their king before them, And Jehovah at their head!
Cross Reference Isaiah 42:7 in Telugu 7 యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను.
Isaiah 42:13 in Telugu 13 యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు.
Isaiah 45:1 in Telugu 1 యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. “అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.
Isaiah 49:9 in Telugu 9 నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది.
Isaiah 49:24 in Telugu 24 బలశాలి చేతిలోనుంచి దోపిడీ సొమ్ము ఎవడు తీసుకోగలడు? నియంత దగ్గర నుంచి బందీలను ఎవడు విడిపించగలడు?
Isaiah 51:9 in Telugu 9 యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ ను పొడిచేసింది నువ్వే గదా?
Isaiah 51:12 in Telugu 12 నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?
Isaiah 52:12 in Telugu 12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోయేలా వెళ్లరు. యెహోవా మీ ముందు నడుస్తాడు. ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కావలివాడుగా ఉంటాడు.
Isaiah 55:4 in Telugu 4 ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.”
Isaiah 59:16 in Telugu 16 ప్రజలకోసం విన్నపం చేసేవాడెవడూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అందుచేత ఆయన సొంత హస్తమే ఆయనకు విడుదల తెచ్చింది. ఆయన నీతి ఆయన్ని నిలబెట్టింది.
Jeremiah 23:5 in Telugu 5 యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
Jeremiah 51:20 in Telugu 20 నువ్వు నాకు యుద్ధంలో ప్రయోగించే గద లాంటి వాడివి. యుద్ధంలో నువ్వు నా ఆయుధం. నీ ద్వారా నేను జనాలనూ జాతులనూ ధ్వంసం చేస్తాను. రాజ్యాలను నాశనం చేస్తాను.
Ezekiel 34:23 in Telugu 23 వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
Daniel 2:34 in Telugu 34 మీరు చూస్తూ ఉండగా, చేతి సహాయం లేకుండా ఒక రాయి ఇనుము, బంకమన్ను కలిసిన ఆ విగ్రహం కాళ్ళ మీద పడి దాని కాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసింది.
Daniel 2:44 in Telugu 44 ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.
Hosea 1:11 in Telugu 11 యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు. తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు. ఆ దేశంలో నుండి బయలు దేరుతారు. ఆ యెజ్రెయేలు దినం మహా ప్రభావ దినం.”
Hosea 3:5 in Telugu 5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.
Hosea 13:14 in Telugu 14 అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. నాకు కనికరం పుట్టదు.
Zechariah 9:14 in Telugu 14 యెహోవా వారికి పైగా ప్రత్యక్షమౌతాడు. ఆయన బాణాలు మెరుపువలె వెలువడుతాయి. ప్రభువగు యెహోవా శంఖం పూరిస్తూ దక్షిణ దిక్కునుండి వచ్చే గొప్ప సుడిగాలితో బయలు దేరుతాడు.
Zechariah 10:5 in Telugu 5 వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.
Zechariah 10:12 in Telugu 12 నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.
Zechariah 12:3 in Telugu 3 భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.”
John 10:27 in Telugu 27 నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.
1 Corinthians 15:21 in Telugu 21 మనిషి ద్వారా మరణం వచ్చింది కాబట్టి మనిషి ద్వారానే చనిపోయిన వారు తిరిగి లేవడం జరిగింది.
Hebrews 2:9 in Telugu 9 అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు.
Hebrews 2:14 in Telugu 14 కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు.
Hebrews 6:20 in Telugu 20 మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ప్రధాన యాజకుడైన యేసు మన తరపున మనకంటే ముందుగా దానిలో ప్రవేశించాడు.
Revelation 7:17 in Telugu 17 ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే కన్నీటిని ఆయనే తుడిచివేస్తాడు.”
Revelation 17:14 in Telugu 14 వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.”
Revelation 19:13 in Telugu 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.