Luke 20:10 in Telugu 10 కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.
Other Translations King James Version (KJV) And at the season he sent a servant to the husbandmen, that they should give him of the fruit of the vineyard: but the husbandmen beat him, and sent him away empty.
American Standard Version (ASV) And at the season he sent unto the husbandmen a servant, that they should give him of the fruit of the vineyard: but the husbandmen beat him, and sent him away empty.
Bible in Basic English (BBE) And at the right time he sent a servant to the workers to get part of the fruit from the vines; but the workmen gave him blows and sent him away with nothing.
Darby English Bible (DBY) And in the season he sent to the husbandmen a bondman, that they might give to him of the fruit of the vineyard; but the husbandmen, having beaten him, sent [him] away empty.
World English Bible (WEB) At the proper season, he sent a servant to the farmers to collect his share of the fruit of the vineyard. But the farmers beat him, and sent him away empty.
Young's Literal Translation (YLT) and at the season he sent unto the husbandmen a servant, that from the fruit of the vineyard they may give to him, but the husbandmen having beat him, did send `him' away empty.
Cross Reference Judges 6:8 in Telugu 8 యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి ఒక ప్రవక్తను పంపాడు. అతడు వాళ్ళకు ఇలా ప్రకటించాడు “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెబుతున్నాడు, ‘ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించి, బానిసల గృహంలో నుంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చాను.
1 Kings 22:24 in Telugu 24 కెనయనా కొడుకు సిద్కియా అతని దగ్గరికి వచ్చి “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపు పోయాడు” అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు.
2 Kings 17:13 in Telugu 13 “అయినా మీ గోపురాలను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించి, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అప్పగించిన ధర్మశాస్త్రంలో ఉన్న నా ఆజ్ఞలు, కట్టడలు ఆచరించండి” అని ప్రవక్తలందరి ద్వారానూ, దీర్ఘదర్శుల ద్వారానూ యెహోవా ఇశ్రాయేలు వాళ్ళకూ, యూదా వాళ్ళకూ సాక్ష్యం పలికించాడు,
2 Chronicles 16:10 in Telugu 10 ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.
2 Chronicles 24:19 in Telugu 19 అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.
2 Chronicles 36:15 in Telugu 15 వారి పూర్వీకుల దేవుడైన యెహోవా తన ప్రజల మీదా, తన నివాస స్థలం మీదా జాలి పడి వారి దగ్గరికి తన రాయబారులతో సందేశాలు పంపిస్తూ వచ్చాడు.
Nehemiah 9:26 in Telugu 26 వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్ల్యక్షం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు.
Nehemiah 9:30 in Telugu 30 నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్ట లేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు.
Psalm 1:3 in Telugu 3 అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.
Jeremiah 2:30 in Telugu 30 నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.
Jeremiah 5:24 in Telugu 24 వారు “రండి, మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు చూపుదాం. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని వాటి కాలంలో కురిపించేవాడు ఆయనే కదా. నిర్ణయించిన ప్రకారం కోతకాలపు వారాలను మనకు వచ్చేలా చేసేవాడు ఆయనే కదా” అని తమ మనస్సులో అనుకోరు.
Jeremiah 20:2 in Telugu 2 కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
Jeremiah 25:3 in Telugu 3 “ఆమోను కొడుకు యూదా రాజు యోషీయా 13వ సంవత్సరం మొదలు నేటివరకూ ఈ 23 సంవత్సరాలు యెహోవా నాకు సందేశం ఇస్తూ ఉన్నాడు. నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పటికీ మీరు పెడచెవిన పెట్టారు.
Jeremiah 26:2 in Telugu 2 “యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు.
Jeremiah 26:20 in Telugu 20 కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు.
Jeremiah 29:26 in Telugu 26 ‘యాజకుడైన యెహోయాదాకు బదులుగా యెహోవా మందిర విషయాల్లో విచారణకర్త అయిన యాజకునిగా యెహోవా నిన్ను నియమించాడు. వెర్రివాళ్లై తమను తాము ప్రవక్తలుగా ఏర్పరచుకున్న వాళ్ళను నువ్వు సంకెళ్లతో బంధించి బొండలో బిగించాలి’ అన్నావు.
Jeremiah 35:15 in Telugu 15 ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.
Jeremiah 37:15 in Telugu 15 అధికారులు యిర్మీయా మీద కోపపడి, అతన్ని కొట్టి, తాము చెరసాలగా మార్చిన లేఖికుడైన యోనాతాను ఇంట్లో అతన్ని ఉంచారు.
Jeremiah 38:4 in Telugu 4 ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి” అన్నారు.
Jeremiah 44:4 in Telugu 4 అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.
Hosea 6:4 in Telugu 4 ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది.
Zechariah 1:3 in Telugu 3 కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
Zechariah 7:9 in Telugu 9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
Matthew 21:34 in Telugu 34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.
Mark 12:2 in Telugu 2 పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు.
Luke 11:47 in Telugu 47 అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు.
Luke 13:34 in Telugu 34 “యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.
John 15:16 in Telugu 16 మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను.
Romans 7:4 in Telugu 4 కాబట్టి నా సోదరులారా, మనం దేవుని కోసం ఫలించ గలిగేలా చనిపోయి తిరిగి లేచిన క్రీస్తును చేరుకోడానికి మీరు కూడా ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయారు.