Luke 13:19 in Telugu 19 అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మలపై నివసించాయి.”
Other Translations King James Version (KJV) It is like a grain of mustard seed, which a man took, and cast into his garden; and it grew, and waxed a great tree; and the fowls of the air lodged in the branches of it.
American Standard Version (ASV) It is like unto a grain of mustard seed, which a man took, and cast into his own garden; and it grew, and became a tree; and the birds of the heaven lodged in the branches thereof.
Bible in Basic English (BBE) It is like a grain of mustard seed which a man took and put in his garden, and it became a tree, and the birds of heaven made their resting-places in its branches.
Darby English Bible (DBY) It is like a grain of mustard [seed] which a man took and cast into his garden; and it grew and became a great tree, and the birds of heaven lodged in its branches.
World English Bible (WEB) It is like a grain of mustard seed, which a man took, and put in his own garden. It grew, and became a large tree, and the birds of the sky lodged in its branches."
Young's Literal Translation (YLT) It is like to a grain of mustard, which a man having taken, did cast into his garden, and it increased, and came to a great tree, and the fowls of the heavens did rest in its branches.'
Cross Reference Psalm 72:16 in Telugu 16 దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక.
Song of Solomon 4:12 in Telugu 12 నా సోదరి, నా వధువు మూసి ఉన్న తోట. తాళం పెట్టి ఉన్న తోట. అడ్డు కట్ట వేసిన నీటి ఊట.
Song of Solomon 4:16 in Telugu 16 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఉత్తర గాలీ, రా! దక్షిణ గాలీ, రా! నా ఉద్యానవనం మీద వీచు. వాటి సుగంధాల పరిమళాలను వ్యాపింపనీ. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వస్తాడు గాక! దాని శ్రేష్ట ఫలాలను అతడు తింటాడు గాక!
Song of Solomon 6:2 in Telugu 2 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు. సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు.
Song of Solomon 8:13 in Telugu 13 (ఆ యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతున్నాడు) ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ.
Isaiah 2:2 in Telugu 2 చివరి రోజుల్లో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.
Isaiah 9:7 in Telugu 7 ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
Isaiah 49:20 in Telugu 20 నీ దుఃఖదినాల్లో నీకు పుట్టిన పిల్లలు ‘ఈ స్థలం మాకు ఇరుకుగా ఉంది. మేము ఉండడానికి ఇంకా విశాలమైన ప్రాంతం మాకివ్వు’ అంటారు.
Isaiah 51:2 in Telugu 2 మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.
Isaiah 53:1 in Telugu 1 మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది?
Isaiah 53:10 in Telugu 10 అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.
Isaiah 58:11 in Telugu 11 అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు. నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.
Isaiah 60:15 in Telugu 15 నిన్ను విడిచి పెట్టకుండా ఎవరూ నిన్ను ద్వేషించకుండా నీ ద్వారా ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి బదులు నిన్ను ఎప్పటికీ హుందాగా ఉండేలా తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను.
Isaiah 61:11 in Telugu 11 భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.
Jeremiah 31:12 in Telugu 12 వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు.
Ezekiel 17:22 in Telugu 22 ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.
Ezekiel 31:6 in Telugu 6 పక్షులన్నీ దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి. భూజంతువులన్నీ దాని గుబురులో పిల్లలు పెట్టాయి. దాని నీడలో అన్ని రకాల జాతులు నివసించాయి.
Ezekiel 47:1 in Telugu 1 ఆయన నన్ను మందిరపు గుమ్మానికి తోడుకుని వచ్చాడు. మందిరం తూర్పు వైపుకు తిరిగి ఉంది. నేను చూసినపుడు మందిరం గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పు వైపుకు పారుతున్నాయి. ఆ నీళ్లు బలిపీఠానికి దక్షిణ దిశగా మందిరం కుడిపక్కన కింద నుండి పారుతున్నాయి.
Daniel 2:34 in Telugu 34 మీరు చూస్తూ ఉండగా, చేతి సహాయం లేకుండా ఒక రాయి ఇనుము, బంకమన్ను కలిసిన ఆ విగ్రహం కాళ్ళ మీద పడి దాని కాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసింది.
Daniel 2:44 in Telugu 44 ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.
Daniel 4:12 in Telugu 12 దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ పండ్లు జీవకోటి అంతటికీ ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి. సమస్తమైన ప్రజలకూ సరిపడినంత ఆహారం ఆ చెట్టు నుండి లభ్యమౌతుంది.”
Daniel 4:21 in Telugu 21 దాని ఆకులు అందంగా, దాని పండ్లు విస్తారంగా కనబడ్డాయి. ఆ పండ్లు సమస్త జీవకోటి ఆహారం కోసం సరిపోతాయి. అడవి జంతువులన్నీ ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుని ఉన్నాయి గదా
Micah 4:1 in Telugu 1 చివరిరోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
Zechariah 2:11 in Telugu 11 ఆ రోజున చాలామంది అన్య దేశాల ప్రజలు యెహోవా చెంతకు చేరుకుని నా ప్రజలుగా అవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు.
Zechariah 8:20 in Telugu 20 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “జాతులు, అనేక పట్టణాల నివాసులు ఇంకా వస్తారు.
Zechariah 14:7 in Telugu 7 అది యెహోవాకు మాత్రమే తెలిసిన రోజు. ఆ రోజు పగలూ కాదు, రాత్రీ కాదు. సాయంత్రం సమయంలో వెలుగు ఉంటుంది.
Matthew 13:31 in Telugu 31 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. “పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు.
Matthew 17:20 in Telugu 20 అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
Mark 4:31 in Telugu 31 అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది.
Luke 17:6 in Telugu 6 ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.
Acts 2:41 in Telugu 41 అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.
Acts 4:4 in Telugu 4 కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.
Acts 15:14 in Telugu 14 యూదేతరుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు.
Acts 21:20 in Telugu 20 అది విని వారు దేవుణ్ణి మహిమపరచి అతనితో, “సోదరా, యూదుల్లో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు గదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి గలవారు.
Romans 15:19 in Telugu 19 కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
Revelation 11:15 in Telugu 15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”