Leviticus 18:21 in Telugu 21 నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచ కూడదు. నేను యెహోవాను.
Other Translations King James Version (KJV) And thou shalt not let any of thy seed pass through the fire to Molech, neither shalt thou profane the name of thy God: I am the LORD.
American Standard Version (ASV) And thou shalt not give any of thy seed to make them pass through `the fire' to Molech; neither shalt thou profane the name of thy God: I am Jehovah.
Bible in Basic English (BBE) And you may not make any of your children go through the fire as an offering to Molech, and you may not put shame on the name of your God: I am the Lord.
Darby English Bible (DBY) And thou shalt not give of thy seed to let them pass through [the fire] to Molech, neither shalt thou profane the name of thy God: I am Jehovah.
Webster's Bible (WBT) And thou shalt not let any of thy seed pass through the fire to Molech, neither shalt thou profane the name of thy God: I am the LORD.
World English Bible (WEB) "'You shall not give any of your children to sacrifice to Molech; neither shall you profane the name of your God: I am Yahweh.
Young's Literal Translation (YLT) `And of thy seed thou dost not give to pass over to the Molech; nor dost thou pollute the name of thy God; I `am' Jehovah.
Cross Reference Leviticus 19:12 in Telugu 12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు. నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
Leviticus 20:2 in Telugu 2 ఇశ్రాయేలీయుల్లో గానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించే పరదేశుల్లోగాని ఎవరైనా తన పిల్లలను మోలెకు దేవుడికి ఇస్తే వాడికి తప్పకుండా మరణ శిక్ష విధించాలి. ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.
Leviticus 21:6 in Telugu 6 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండాలి. తమ దేవుని నామాన్ని అప్రదిష్ట పాలు చెయ్యకూడదు. ఎందుకంటే వారు తమ దేవునికి ‘నైవేద్యం’ అంటే యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించే వారు. కాబట్టి వారు పవిత్రంగా ఉండాలి.
Leviticus 22:2 in Telugu 2 “అహరోనుతో అతని కొడుకులతో ఇది చెప్పు. వారు ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించే వాటిని ప్రత్యేకమైనవిగా భావించాలి. వారు నా పరిశుద్ధ నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
Leviticus 22:32 in Telugu 32 నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయుల్లో నన్ను పరిశుద్ధునిగా చేసుకుంటాను. నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవాను.
Deuteronomy 12:31 in Telugu 31 వారు తమ దేవుళ్ళకు చేసిన విధంగా మీరు మీ దేవుడైన యెహోవా విషయంలో చేయవద్దు. ఎందుకంటే వారు తమ దేవుళ్ళకు చేసేదంతా యెహోవా ద్వేషిస్తాడు. అవి ఆయనకు హేయం. వారు తమ దేవుళ్ళ పేరట తమ కొడుకులనూ, కూతుళ్ళనూ అగ్నిగుండంలో కాల్చివేస్తారు.
Deuteronomy 18:10 in Telugu 10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,
1 Kings 11:7 in Telugu 7 సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు.
1 Kings 11:33 in Telugu 33 అయితే నా సేవకుడైన దావీదు కోసం, నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను.
2 Kings 16:3 in Telugu 3 అతడు, ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకుండా యెహోవా వెళ్లగొట్టిన జాతులు చేసిన హేయమైన పనులు చేస్తూ, తన కొడుకును దహన బలిగా అర్పించాడు.
2 Kings 21:6 in Telugu 6 అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.
2 Kings 23:10 in Telugu 10 ఎవరూ తన కొడుకునైనా, కూతుర్నైనా మొలెకుకు దహనబలి ఇవ్వకుండా బెన్ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ఆ ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు.
Psalm 106:37 in Telugu 37 వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.
Jeremiah 7:31 in Telugu 31 నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
Jeremiah 19:5 in Telugu 5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు.”
Ezekiel 20:31 in Telugu 31 ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ezekiel 23:37 in Telugu 37 వాళ్ళు వ్యభిచారం చేశారు. వాళ్ళ చేతులకు రక్తం అంటింది. వాళ్ళు విగ్రహాలతో వ్యభిచారం చేశారు. నాకు కన్న కొడుకులను వాళ్ళ విగ్రహాలు మింగేలా వాటికి దహన బలి అర్పించారు.
Ezekiel 36:20 in Telugu 20 వారు తాము వెళ్లిన ప్రదేశాల్లో ప్రతి చోటా వారి మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు నిజంగా యెహోవా ప్రజలేనా? ఆయన తన దేశంలో నుంచి ఆయన వాళ్ళను తోసేశాడు అని వారి గురించి చెప్పారు.
Amos 5:26 in Telugu 26 మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.
Malachi 1:12 in Telugu 12 మీరైతే యెహోవా బల్ల అపవిత్రమని, దాని మీద ఉంచిన ఆహారం నీచమైనదని అనుకుంటూ దానికి అవమానం కలిగిస్తున్నారు.
Acts 7:43 in Telugu 43 మీరు చేసుకున్న ప్రతిమలను అంటే మొలెకు గుడారాన్నీ, రెఫాను అనే శని దేవుడి నక్షత్రాన్నీ పూజించడం కోసం మోసుకుపోయారు. కాబట్టి బబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.’
Romans 1:23 in Telugu 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.
Romans 2:24 in Telugu 24 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా.