Lamentations 1:6 in Telugu 6 సీయోను కుమారి అందమంతా పోయింది. దాని అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు. వాళ్ళు శక్తి లేనివాళ్ళుగా తరిమే వాళ్ళముందు నిలబడ లేక పారిపోయారు.
Other Translations King James Version (KJV) And from the daughter of Zion all her beauty is departed: her princes are become like harts that find no pasture, and they are gone without strength before the pursuer.
American Standard Version (ASV) And from the daughter of Zion all her majesty is departed: Her princes are become like harts that find no pasture, And they are gone without strength before the pursuer.
Bible in Basic English (BBE) And all her glory has gone from the daughter of Zion: her rulers have become like harts with no place for food, and they have gone in flight without strength before the attacker.
Darby English Bible (DBY) And from the daughter of Zion all her splendour is departed: her princes are become like harts that find no pasture; and they are gone without strength before the pursuer.
World English Bible (WEB) From the daughter of Zion all her majesty is departed: Her princes are become like harts that find no pasture, They are gone without strength before the pursuer.
Young's Literal Translation (YLT) And go out from the daughter of Zion doth all her honour, Her princes have been as harts -- They have not found pasture, And they go powerless before a pursuer.
Cross Reference Leviticus 26:36 in Telugu 36 మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశాల్లో ఉండగా వారి హృదయాల్లో అధైర్యం పుట్టిస్తాను. గాలికి కొట్టుకుపోతున్న ఆకు చప్పుడుకు వారు పారిపోతారు. ఖడ్గం నుండి తప్పించుకోడానికి పారిపోతున్నట్టు వారు ఆ చప్పుడు విని పారిపోతారు. తరుమేవాడు ఎవరూ లేకుండానే పడిపోతారు.
Deuteronomy 28:25 in Telugu 25 యెహోవా మీ శత్రువుల ఎదుట మిమ్మల్ని ఓడిస్తాడు. ఒక దారిలో మీరు వారికెదురుగా వెళ్ళి ఏడు దారుల్లో పారిపోతారు. ప్రపంచ దేశాలన్నిటిలో అటూ ఇటూ చెదరిపోతారు.
Deuteronomy 32:30 in Telugu 30 వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు?
Joshua 7:12 in Telugu 12 కాబట్టి ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వారు తమకు తామే నాశనానికి గురయ్యారు కాబట్టి తమ శత్రువులకు వెన్నుచూపించారు. శాపగ్రస్తమైన వాటిని మీ మధ్య ఉండకుండాా నిర్మూలం చేస్తే తప్ప నేను మీతో ఉండను.
2 Samuel 4:11 in Telugu 11 వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచిపెట్టకుండా ఉంటానా?
2 Kings 19:21 in Telugu 21 అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
Psalm 44:9 in Telugu 9 అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.
Psalm 48:2 in Telugu 2 అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.
Psalm 50:2 in Telugu 2 పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
Psalm 96:9 in Telugu 9 పవిత్రాలంకారాలతో యెహోవా ఎదుట సాగిలపడి మొక్కండి. ప్రపంచమంతా ఆయన ఎదుట వణకండి.
Psalm 132:12 in Telugu 12 నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.
Isaiah 1:21 in Telugu 21 నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! అది న్యాయంతో నిండి ఉండేది. నీతి దానిలో నివాసం ఉండేది. ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.
Isaiah 4:5 in Telugu 5 సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలాప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు.
Isaiah 12:6 in Telugu 6 గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”
Jeremiah 13:18 in Telugu 18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.”
Jeremiah 14:5 in Telugu 5 గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది.
Jeremiah 29:4 in Telugu 4 అందులో ఇలా ఉంది “ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు,
Jeremiah 47:3 in Telugu 3 వాళ్ళ బలమైన గుర్రాల డెక్కలు నేలను తన్నే చప్పుడు వినిపించినప్పుడు, వాళ్ళ రథాల వేగం హోరుకూ, ఉరుము లాంటి వాటి చక్రాల శబ్దానికీ భయపడిన తండ్రులు తమ బలహీనత కారణంగా తమ పిల్లలకు సహాయం చేయరు.
Jeremiah 48:41 in Telugu 41 కోటలు పడగొడుతున్నారు. బలమైన దుర్గాలు పట్టుకుంటున్నారు. ఆ రోజున మోయాబు వీరుల హృదయాలు ప్రసవించబోయే స్త్రీ హృదయంలా ఉంటాయి.
Jeremiah 51:30 in Telugu 30 బబులోనులో సైనికులు పోరాడటం ఆపేశారు. వాళ్ళు తమ కోటలోనే నిలిచారు. వాళ్ళ బలం విఫలమై పోయింది. వాళ్ళు స్త్రీలవలే బలహీనంగా ఉన్నారు.
Jeremiah 52:7 in Telugu 7 అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.
Jeremiah 52:11 in Telugu 11 సిద్కియా రెండు కళ్ళూ పీకించాడు. అతణ్ణి ఇత్తడి సంకెళ్ళతో బంధించి, బబులోనుకు తీసుకు వచ్చారు. అతడు చనిపోయేంత వరకూ బబులోను రాజు అతణ్ణి చెరసాలలోనే ఉంచాడు.
Jeremiah 52:13 in Telugu 13 అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.
Lamentations 2:1 in Telugu 1 ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.
Ezekiel 7:20 in Telugu 20 వాళ్ళు అహంకరించి రత్నభరితమైన ఆభరణాలు చేయించారు. అవి వాళ్ళ నీచమైన పనులను వర్ణించే విగ్రహ ఆకారాలుగా ఏర్పడ్డాయి. వాటితో వాళ్ళు అసహ్యకరమైన తమ పనులను సాగించారు. కాబట్టి ఆ ఆభరణాలు వాళ్లకి అసహ్యం పుట్టేలా నేను చేస్తాను.
Ezekiel 11:22 in Telugu 22 అప్పుడు కెరూబులు తమ రెక్కలు చాపాయి. చక్రాలు వాటి పక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా ఉంది.
Ezekiel 24:21 in Telugu 21 ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.
Ezekiel 24:25 in Telugu 25 “కాని, నరపుత్రుడా, వాళ్ళ ఆనందాన్నీ, వాళ్ళ అతిశయాన్నీ, వాళ్ళ కళ్ళకు ఇష్టమైనదాన్నీ, వాళ్ళ కొడుకులనూ, వాళ్ళ కూతుళ్ళనూ నేను బలవంతంగా పట్టుకున్నరోజు నీకు సమాచారం తెలియజేయడానికి, తప్పించుకుని వచ్చిన వాడొకడు నీదగ్గరికి వస్తాడు.
Zephaniah 3:14 in Telugu 14 సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి.