Jeremiah 7:6 in Telugu 6 పరదేశుల్నీ తండ్రి లేని వారినీ వితంతువులనూ బాధించకూడదు. ఈ స్థలంలో నిర్దోషి రక్తం చిందించకూడదు. మీకు హాని చేసే అన్య దేవతలను పూజించకూడదు.
Other Translations King James Version (KJV) If ye oppress not the stranger, the fatherless, and the widow, and shed not innocent blood in this place, neither walk after other gods to your hurt:
American Standard Version (ASV) if ye oppress not the sojourner, the fatherless, and the widow, and shed not innocent blood in this place, neither walk after other gods to your own hurt:
Bible in Basic English (BBE) If you are not cruel to the man from a strange country, and to the child without a father, and to the widow, and do not put the upright to death in this place, or go after other gods, causing damage to yourselves:
Darby English Bible (DBY) [if] ye oppress not the stranger, the fatherless, and the widow, and shed no innocent blood in this place, neither walk after other gods to your hurt;
World English Bible (WEB) if you don't oppress the foreigner, the fatherless, and the widow, and don't shed innocent blood in this place, neither walk after other gods to your own hurt:
Young's Literal Translation (YLT) Sojourner, fatherless, and widow, ye oppress not, And innocent blood do not shed in this place, And after other gods do not walk, for evil to yourselves,
Cross Reference Exodus 22:21 in Telugu 21 పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
Deuteronomy 6:14 in Telugu 14 మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.
Deuteronomy 8:19 in Telugu 19 మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను.
Deuteronomy 11:28 in Telugu 28 మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.
Deuteronomy 24:17 in Telugu 17 పరదేశులకు గానీ తండ్రిలేని వారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు.
Deuteronomy 27:19 in Telugu 19 “పరదేశికి గానీ, తండ్రి లేనివాడికిగానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
2 Kings 21:6 in Telugu 6 అతడు తన కొడుకును దహన బలిగా అర్పించి జ్యోతిష్యం, శకునాలు అలవాటు చేసి, చనిపోయిన ఆత్మలతో మాట్లాడే వాళ్ళతో, సోదె చెప్పే వాళ్ళతో సాంగత్యం చేశాడు. ఈ విధంగా అతడు యెహోవా దృష్టిలో ఎంతో చెడుతనం జరిగిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.
2 Kings 24:4 in Telugu 4 అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.
Job 31:13 in Telugu 13 నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యెమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే,
Psalm 82:3 in Telugu 3 పేదలకు, అనాథలకు న్యాయం చేయండి, అణగారినవాళ్ళ, అనాథల హక్కులను పరిరక్షించండి.
Psalm 106:38 in Telugu 38 నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.
Isaiah 59:7 in Telugu 7 వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి. వారి ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. వారి దారులు దుర్మార్గం, నాశనం.
Jeremiah 2:30 in Telugu 30 నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.
Jeremiah 2:34 in Telugu 34 నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది. వారేమీ నిన్ను దోచుకోడానికి వచ్చినవారు కాదు.
Jeremiah 7:5 in Telugu 5 మీ మార్గాలు, క్రియలు మీరు యథార్థంగా సరిచేసుకుని ప్రతివాడూ తన పొరుగువాడి పట్ల న్యాయం జరిగించాలి.
Jeremiah 13:10 in Telugu 10 ఈ ప్రజలు అన్య దేవుళ్ళను పూజిస్తూ, వాటికే నమస్కారం చేస్తున్నారు. వాటినే అనుసరిస్తూ, నా మాటలు వినకుండా తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుస్తున్నారు. వారు ఎందుకూ పనికిరాని ఈ నడికట్టులాగా అవుతారు.
Jeremiah 19:4 in Telugu 4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
Jeremiah 22:3 in Telugu 3 యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘మీరు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులనూ తండ్రిలేని వారినీ విధవరాళ్ళనూ బాధించవద్దు. వాళ్ళ మీద హింసాకాండ చేయవద్దు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపవద్దు.
Jeremiah 22:15 in Telugu 15 నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.
Jeremiah 26:15 in Telugu 15 అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.”
Jeremiah 26:23 in Telugu 23 వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు.
Lamentations 4:13 in Telugu 13 దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
Ezekiel 18:6 in Telugu 6 పర్వతాలమీద భోజనాలు చెయ్యకుండా, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహాలవైపు చూడకుండా, తన పొరుగువాడి భార్యను చెరపకుండా, ఋతుస్రావంలో ఉన్న స్త్రీతో లైంగికంగా కలవకుండా, అప్పు తీసుకున్నవాడికి అతని తాకట్టు వస్తువు తిరిగి ఇచ్చేస్తూ, బలవంతంగా ఎవరికీ నష్టం చెయ్యక, ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇచ్చి, బట్టలు లేని వాడికి బట్టలిచ్చి,
Ezekiel 22:3 in Telugu 3 నువ్వు ఇలా చెప్పాలి, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇది దాని కాలం దగ్గర పడేలా, రక్తం ఒలికించే పట్టణం. ఇది తనను తాను అపవిత్రం చేసుకునేలా విగ్రహాలు పెట్టుకునే పట్టణం!
Zechariah 7:9 in Telugu 9 “సేనల ప్రభువైన యెహోవా ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. సత్యాన్ననుసరించి తీర్పు తీర్చండి. ఒకరిపట్ల ఒకరు కరుణా వాత్సల్యం కనపరచుకోండి.
Malachi 3:5 in Telugu 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేనివారిని బాధపెట్టినవారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
Matthew 23:35 in Telugu 35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది.
Matthew 27:4 in Telugu 4 “నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు.
Matthew 27:25 in Telugu 25 అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు.
James 1:27 in Telugu 27 తండ్రి లేని వారికి, వితంతువులకు వారి కష్టంలో సాయం చేయడం, తనను తాను లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడమే తండ్రి అయిన దేవుని దృష్టిలో స్వచ్ఛమైన, కళంకం లేని భక్తి.