Jeremiah 6:13 in Telugu 13 “వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
Other Translations King James Version (KJV) For from the least of them even unto the greatest of them every one is given to covetousness; and from the prophet even unto the priest every one dealeth falsely.
American Standard Version (ASV) For from the least of them even unto the greatest of them every one is given to covetousness; and from the prophet even unto the priest every one dealeth falsely.
Bible in Basic English (BBE) For from the least of them even to the greatest, everyone is given up to getting money; from the prophet even to the priest, everyone is working deceit.
Darby English Bible (DBY) For from the least of them even unto the greatest of them, every one is given to covetousness; and from the prophet even unto the priest, every one dealeth falsely.
World English Bible (WEB) For from the least of them even to the greatest of them everyone is given to covetousness; and from the prophet even to the priest everyone deals falsely.
Young's Literal Translation (YLT) For from their least unto their greatest, Every one is gaining dishonest gain, And from prophet even unto priest, Every one is dealing falsely,
Cross Reference Isaiah 28:7 in Telugu 7 అయితే వీళ్ళు కూడా ద్రాక్షారసం తాగి తూలుతారు. మద్యపానం చేసి తడబడతారు. యాజకుడైనా, ప్రవక్త అయినా మద్యం తాగి తూలుతారు. ద్రాక్షారసం వాళ్ళని వశం చేసుకుంటుంది. మద్యపానం చేసి తడబడుతూ ఉంటారు. దర్శనం కలిగినప్పుడు తూలుతూ ఉంటారు. తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు తడబడతారు.
Isaiah 56:9 in Telugu 9 మైదానాల్లోని జంతువులన్నీ! అడవిలోని క్రూర జంతువులన్నీ! రండి! తినండి!
Isaiah 57:17 in Telugu 17 అక్రమంగా సంపాదించిన అతని పాపాన్ని బట్టి నేను కోపపడి అతన్ని శిక్షించాను. నా ముఖాన్ని కోపంతో చాటు చేశాను. అయితే అతడు తనకిష్టమైన దారిలోకి తిరిగి వెళ్ళిపోయాడు.
Jeremiah 2:8 in Telugu 8 “యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు.
Jeremiah 2:26 in Telugu 26 దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.
Jeremiah 5:31 in Telugu 31 ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు. అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?
Jeremiah 8:10 in Telugu 10 కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను. చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.
Jeremiah 14:18 in Telugu 18 పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించేవాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”
Jeremiah 22:17 in Telugu 17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.
Jeremiah 23:11 in Telugu 11 ప్రవక్తలూ యాజకులూ పాడైపోయారు. నా ఆలయంలో కూడా వాళ్ళ దుర్మార్గం నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
Jeremiah 23:14 in Telugu 14 యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.
Jeremiah 26:7 in Telugu 7 యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు.
Jeremiah 32:32 in Telugu 32 ఈ పట్టణాన్ని కట్టిన రోజు నుంచి, ఇది నా ఉగ్రతను, నా కోపాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ రోజు వరకూ అది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను నా ఎదుట నుంచి దాన్ని తొలగిస్తాను.
Lamentations 4:13 in Telugu 13 దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
Ezekiel 22:12 in Telugu 12 వీళ్ళు లంచాలు తీసుకుని రక్తం ఒలికిస్తారు. అధిక లాభం పట్ల ఆసక్తి చూపించి, పొరుగువాణ్ణి అణిచి వేసారు. నువ్వు నన్ను మర్చిపోయావు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ezekiel 22:25 in Telugu 25 అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.
Ezekiel 33:31 in Telugu 31 నా ప్రజలు ఎప్పుడూ వచ్చేలాగే నీ దగ్గరికి వస్తారు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటారు గాని వాటిని పాటించరు. సరైన మాటలు వాళ్ళు చెబుతారు గానీ వాళ్ళ మనసులు అక్రమ లాభం కోసం ఆరాటపడుతున్నాయి.
Micah 2:1 in Telugu 1 మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.
Micah 3:2 in Telugu 2 మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు. నా ప్రజల చర్మం ఒలిచేసి వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.
Micah 3:5 in Telugu 5 నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు. భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు.
Micah 3:11 in Telugu 11 ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
Zephaniah 3:3 in Telugu 3 దాని మధ్య దాని అధిపతులు గర్జన చేసే సింహాలు. దాని న్యాయాధిపతులు రాత్రివేళ తిరుగులాడుతూ తెల్లవారేదాకా ఎరలో ఏమీ మిగలకుండా పీక్కు తినే తోడేళ్లు.
Luke 16:14 in Telugu 14 డబ్బును ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు.
1 Timothy 3:3 in Telugu 3 అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి.
2 Peter 2:3 in Telugu 3 ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.
2 Peter 2:14 in Telugu 14 వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.