Jeremiah 51:51 in Telugu 51 మమ్మల్ని అవమానపరిచే మాటలు విన్నాం. దానికి సిగ్గు పడుతున్నాం. మాపై పడ్డ నింద మా ముఖాలను కప్పి వేసింది. ఎందుకంటే యెహోవా పేరును కలిగి ఉన్న పరిశుద్ధ స్థలాల్లోకి విదేశీయులు ప్రవేశించారు.
Other Translations King James Version (KJV) We are confounded, because we have heard reproach: shame hath covered our faces: for strangers are come into the sanctuaries of the LORD's house.
American Standard Version (ASV) We are confounded, because we have heard reproach; confusion hath covered our faces: for strangers are come into the sanctuaries of Jehovah's house.
Bible in Basic English (BBE) We are shamed because bitter words have come to our ears; our faces are covered with shame: for men from strange lands have come into the holy places of the Lord's house.
Darby English Bible (DBY) -- We are put to shame, for we have heard reproach; confusion hath covered our face: for strangers are come into the sanctuaries of Jehovah's house.
World English Bible (WEB) We are confounded, because we have heard reproach; confusion has covered our faces: for strangers are come into the sanctuaries of Yahweh's house.
Young's Literal Translation (YLT) We have been ashamed, for we heard reproach, Covered hath shame our faces, For come in have strangers, against the sanctuaries of the house of Jehovah.
Cross Reference Psalm 44:13 in Telugu 13 మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.
Psalm 69:7 in Telugu 7 నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది.
Psalm 71:13 in Telugu 13 నా ప్రాణం తీయాలని చూసే విరోధులు సిగ్గుపడి నశిస్తారు గాక. నాకు కీడుచేయాలని చూసేవాళ్ళు నిందలపాలై అవమానం పొందుతారు గాక.
Psalm 74:3 in Telugu 3 నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.
Psalm 74:18 in Telugu 18 యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.
Psalm 79:1 in Telugu 1 ఆసాపు కీర్తన దేవా, విదేశీయులు నీ వారసత్వ భూమిలోకి వచ్చేశారు, వాళ్ళు నీ పవిత్రాలయాన్ని అపవిత్రపరచారు. యెరూషలేమును రాళ్ళ కుప్పగా మార్చివేశారు.
Psalm 79:4 in Telugu 4 మా పొరుగు వారికి మేము ఎగతాళి అయ్యాం. మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని వెక్కిరించి అపహసిస్తారు.
Psalm 79:12 in Telugu 12 ప్రభూ, మా పొరుగు దేశాలు నిన్ను నిందించినందుకు ప్రతిగా వారిని ఏడంతల నిందకు గురి చెయ్యి.
Psalm 109:29 in Telugu 29 నా విరోధులు అవమానం ధరించుకుంటారు గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక.
Psalm 123:3 in Telugu 3 యెహోవా, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు. మేము తీవ్ర తిరస్కారానికి గురయ్యాము.
Psalm 137:1 in Telugu 1 మనం బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడుస్తూ సీయోనును జ్ఞాపకం చేసుకున్నాం.
Jeremiah 3:22 in Telugu 22 ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను. “మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
Jeremiah 14:3 in Telugu 3 వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు.
Jeremiah 31:19 in Telugu 19 నేను నీ వైపు తిరిగిన తరువాత పశ్చాత్తాపం చెందాను. నేను కాడి మోసే శిక్షణ పొందిన తరువాత విచారంతో తొడ చరుచుకున్నాను. నా చిన్నతనంలో కలిగిన నిందను భరించి నేను అవమానం పొంది సిగ్గుపడ్డాను.’
Jeremiah 52:13 in Telugu 13 అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.
Lamentations 1:10 in Telugu 10 దాని శ్రేష్ఠమైన వస్తువులన్నీ శత్రువుల చేతికి చిక్కాయి. దాని సమాజ ప్రాంగణంలో ప్రవేశించకూడదని ఎవరి గురించి ఆజ్ఞాపించావో ఆ ప్రజలు దాని పవిత్ర ప్రాంగణంలో ప్రవేశించడం అది చూస్తూ ఉంది.
Lamentations 2:15 in Telugu 15 దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ, “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.
Lamentations 2:20 in Telugu 20 యెహోవా, చూడు. నువ్వు ఎవరి పట్ల ఈ విధంగా చేశావో గమనించు. తమ గర్భఫలాన్ని, తాము ఎత్తుకుని ఆడించిన పసి పిల్లలను స్త్రీలు తినడం తగునా? యాజకుడూ ప్రవక్తా ప్రభువు పవిత్ర ప్రాంగణంలో హతం కాదగునా?
Lamentations 5:1 in Telugu 1 యెహోవా, మాకు కలిగిన యాతన గుర్తు చేసుకో. మా మీదికి వచ్చిన అవమానం ఎలా ఉందో చూడు.
Ezekiel 7:18 in Telugu 18 వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది. ప్రతి ఒక్కరి ముఖం పైనా అవమానం ఉంటుంది. బోడితనం వాళ్ళ తలల మీద కనిపిస్తుంది.
Ezekiel 7:21 in Telugu 21 వాటిని ఇతర దేశస్తుల చేతికి అప్పగిస్తాను. దుర్మార్గుల చేతికి దోపిడీ సొమ్ముగా ఇస్తాను. వాళ్ళు వాటిని అపవిత్రం చేస్తారు.
Ezekiel 9:7 in Telugu 7 ఆయన ఇంకా ఇలా అన్నాడు. “మందిరాన్ని అపవిత్రం చేయండి. దాని ఆవరణాలను శవాలతో నింపండి. మొదలు పెట్టండి.” వాళ్ళు వెళ్ళి పట్టణంపై దాడి చేసి చంపడం ప్రారంభించారు.
Ezekiel 24:21 in Telugu 21 ఇశ్రాయేలీయులకు నువ్వు ఈ విధంగా చెప్పు, చూడు! ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ బలంలో మీకున్న అతిశయం, మీ నేత్రాశలు, మీ మనస్సులో మీకున్న వాంఛలు నా పవిత్ర ప్రాంగణాన్ని అపవిత్రం చేస్తున్నాయి! కాబట్టి, మీరు వెనుక విడిచిన మీ కొడుకులూ, కూతుళ్ళూ కత్తిచేత కూలిపోతారు.
Ezekiel 36:30 in Telugu 30 చెట్లు విస్తారంగా కాయలు కాసేలా, పొలాలు బాగా పంట పండేలా చేస్తాను. అప్పటినుంచి కరువు గురించిన నింద ఇతర రాజ్యాల్లో మీకు రాదు.
Daniel 8:11 in Telugu 11 ఆ సైన్యాధిపతికి విరోధంగా గొప్పదైపోయి, అనుదిన బలి అర్పణలను ఆపి వేసి ఆయన ఆలయాన్ని పాడు చేసింది.
Daniel 9:26 in Telugu 26 ఈ 62 వారాలు జరిగిన తరువాత అభిషిక్తుడు పూర్తిగా నిర్మూలం అయి పోతాడు. వస్తున్న రాజు ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. వాడి అంతం హఠాత్తుగా వస్తుంది. యుద్ధ కాలం సమాప్తమయ్యే వరకూ నాశనం జరుగుతుందని నిర్ణయం అయింది.
Daniel 11:31 in Telugu 31 అతని శూరులు లేచి, పరిశుద్ధస్థలాన్ని, కోటను మైల పడేలా చేసి, అనుదిన దహన బలి తీసివేసి, నాశనం కలగజేసే హేయమైన వస్తువును నిలబెడతారు.
Micah 7:10 in Telugu 10 నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.
Revelation 11:1 in Telugu 1 కొలబద్దలా ఉపయోగించడానికి ఒక చేతి కర్రను నాకిచ్చారు. అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు. “నువ్వు లే. దేవుని ఆలయం, బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్క పెట్టు.