Jeremiah 51:5 in Telugu 5 తమ దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా చేసిన అపరాధాలతో నిండిపోయినప్పటికీ, సేనల ప్రభువూ, తమ దేవుడూ అయిన యెహోవా యూదా ప్రజలనూ, ఇశ్రాయేలు ప్రజలనూ విడిచిపెట్టలేదు.
Other Translations King James Version (KJV) For Israel hath not been forsaken, nor Judah of his God, of the LORD of hosts; though their land was filled with sin against the Holy One of Israel.
American Standard Version (ASV) For Israel is not forsaken, nor Judah, of his God, of Jehovah of hosts; though their land is full of guilt against the Holy One of Israel.
Bible in Basic English (BBE) For Israel has not been given up, or Judah, by his God, by the Lord of armies; for their land is full of sin against the Holy One of Israel.
Darby English Bible (DBY) For Israel is not forsaken, nor Judah of his God, of Jehovah of hosts; for their land is full of guilt against the Holy One of Israel.
World English Bible (WEB) For Israel is not forsaken, nor Judah, of his God, of Yahweh of Hosts; though their land is full of guilt against the Holy One of Israel.
Young's Literal Translation (YLT) For, not forsaken is Israel and Judah, By its God -- by Jehovah of Hosts, For their land hath been full of guilt, Against the Holy One of Israel.
Cross Reference 1 Samuel 12:22 in Telugu 22 యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు.
1 Kings 6:13 in Telugu 13 ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.”
2 Kings 21:16 in Telugu 16 ఇంకా మనష్షే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి, యూదావాళ్ళను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకూ రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు.
Ezra 9:9 in Telugu 9 నిజంగా మేము దాసులమైనప్పటికీ మా దేవుడివైన నువ్వు మమ్మల్ని ఆ దాస్యంలోనే ఉండనియ్యలేదు. పర్షియా దేశపు రాజుల ముందు మా పట్ల దయ చూపించావు. మేము సేదదీరేలా మా దేవుని ఆలయం నిలబెట్టావు. యూదా దేశంలోని యెరూషలేము పట్టణంలో పాడైపోయిన స్థలాలను తిరిగి బాగుచేయడానికి, మాకు ఒక ఆశ్రయం కల్పించడానికి నీ కృప అనుగ్రహించావు.
Psalm 94:14 in Telugu 14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
Isaiah 44:21 in Telugu 21 యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.
Isaiah 49:14 in Telugu 14 అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది.
Isaiah 54:3 in Telugu 3 ఎందుకంటే నువ్వు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు.
Isaiah 62:12 in Telugu 12 “పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.
Jeremiah 16:18 in Telugu 18 వాళ్ళు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తు నింపారు. నా దేశాన్ని అపవిత్రపరచారు. కాబట్టి నేను మొదట వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారం చేస్తాను.”
Jeremiah 19:4 in Telugu 4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
Jeremiah 23:15 in Telugu 15 కాబట్టి సేనల ప్రభువు యెహోవా ఈ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతా వ్యాపించింది. కాబట్టి వాళ్లకు తినడానికి చేదుకూరలూ తాగడానికి విషజలం నేను వారికిస్తాను.
Jeremiah 31:37 in Telugu 37 యెహోవా ఇలా అంటున్నాడు. “పైనున్న ఆకాశ వైశాల్యం కొలవడం, కిందున్న భూమి పునాదులు కనుగొనడం సాధ్యం ఐతే తప్ప, ఇశ్రాయేలు సంతానం చేసిన వాటన్నిటిని బట్టి నేను వాళ్ళందరినీ తోసివేయడం జరగదు.” ఇది యెహోవా వాక్కు.
Jeremiah 33:24 in Telugu 24 “‘తాను ఏర్పరచుకున్న రెండు వంశాలను యెహోవా తిరస్కరించాడు, నా ప్రజలు ఇకమీదట తమ దృష్టిలో ఒక జనాంగంగా ఉండరు,’ అని, ఈ రకంగా నా ప్రజలను తృణీకరిస్తూ ఈ ప్రజలు చెప్పుకునే మాట గురించి నువ్వు ఆలోచించలేదా?
Jeremiah 46:28 in Telugu 28 నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”
Jeremiah 50:4 in Telugu 4 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూ ఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు.
Jeremiah 50:20 in Telugu 20 యెహోవా ఇలా చెప్తున్నాడు. “ఆ రోజుల్లో, ఆ సమయంలో ఇశ్రాయేలులో అతిక్రమాల కోసం వెదుకుతారు, కానీ ఎంత వెదికినా అవి కనపడవు. యూదా ప్రజల పాపాల కోసం వాకబు చేస్తాను కానీ అవి దొరకవు. మిగిలి ఉన్న వాళ్ళను నేను క్షమిస్తాను.
Ezekiel 8:17 in Telugu 17 అప్పుడాయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నువ్వు ఇదంతా చూస్తున్నావా? యూదా జాతి ప్రజలు ఇక్కడ చేస్తున్న అసహ్యమైన పనులు స్వల్పమైనవా? వాళ్ళు దేశాన్ని బలాత్కారంతో నింపివేశారు. ముక్కులకు తీగలు తగిలించుకుంటూ నా కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నారు.
Ezekiel 9:9 in Telugu 9 ఆయన నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల, యూదా ప్రజల అతిక్రమాలు చాలా అధికమయ్యాయి. వాళ్ళు యెహోవా మనలను విడిచి పెట్టాడనీ, యెహోవా మనలను చూడటం లేదనీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దేశం రక్త పాతంతోనూ పట్టణం భ్రష్టత్వంతోనూ నిండి పోయాయి.
Ezekiel 22:24 in Telugu 24 “నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు!
Hosea 1:10 in Telugu 10 అయినప్పటికీ ఇశ్రాయేలీయుల జనసంఖ్య సముద్రతీరంలో ఇసుకంత విస్తారం అవుతుంది. దాన్ని కొలవలేము, లెక్కబెట్టలేము. ఎక్కడ ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పానో, అక్కడే ‘మీరు సజీవుడైన దేవుని ప్రజలు’ అని వారికి చెబుతారు.
Hosea 4:1 in Telugu 1 ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యం, కనికరం, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం దేశంలో లేకపోవడం చూసి, యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుతున్నాడు.
Amos 9:8 in Telugu 8 యెహోవా ప్రభువు కళ్ళు ఈ పాపిష్ఠి రాజ్యాన్ని చూస్తున్నాయి. దాన్ని భూమి మీద ఉండకుండాా నాశనం చేస్తాను. అయితే యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.” యెహోవా వెల్లడించేది ఇదే.
Micah 7:18 in Telugu 18 నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి. నీ స్వజనంలో మిగిలినవారి దోషాన్ని పరిహరించే వాడివి. నువ్వు నీ నిబంధన నమ్మకత్వాన్ని మాకు ఇష్టంగా చూపించే వాడివి. నువ్వు నీ కోపాన్ని ఎప్పటికీ అలానే ఉంచేవాడివి కాదు.
Micah 7:20 in Telugu 20 నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు. పూర్వకాలంలో మా పూర్వీకులు అబ్రాహాముకు ప్రమాణం చేసిన నిబంధన నమ్మకత్వాన్ని చూపిస్తావు.
Zephaniah 3:1 in Telugu 1 తిరుగుబాటు పట్టణానికి బాధ. హింసాత్మక నగరం భ్రష్టమైపోయింది.
Zechariah 2:12 in Telugu 12 ప్రతిష్ఠితమైన దేశంలో యెహోవా యూదాను తన సొత్తుగా సొంతం చేసుకుంటాడు. ఆయన యెరూషలేమును మళ్ళీ కోరుకుంటున్నాడు.
Zechariah 12:6 in Telugu 6 ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.
Zechariah 12:8 in Telugu 8 ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు.
Romans 11:1 in Telugu 1 అలాగైతే నేనడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిచి పెట్టేశాడా? కానే కాదు. నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టాను.