Jeremiah 51:11 in Telugu 11 బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన.
Other Translations King James Version (KJV) Make bright the arrows; gather the shields: the LORD hath raised up the spirit of the kings of the Medes: for his device is against Babylon, to destroy it; because it is the vengeance of the LORD, the vengeance of his temple.
American Standard Version (ASV) Make sharp the arrows; hold firm the shields: Jehovah hath stirred up the spirit of the kings of the Medes; because his purpose is against Babylon, to destroy it: for it is the vengeance of Jehovah, the vengeance of his temple.
Bible in Basic English (BBE) Make bright the arrows; take up the body-covers: the Lord has been moving the spirit of the king of the Medes; because his design against Babylon is its destruction: for it is the punishment from the Lord, the payment for his Temple.
Darby English Bible (DBY) Sharpen the arrows; take the shields. Jehovah hath stirred up the spirit of the kings of the Medes; for his purpose is against Babylon, to destroy it; for this is the vengeance of Jehovah, the vengeance of his temple.
World English Bible (WEB) Make sharp the arrows; hold firm the shields: Yahweh has stirred up the spirit of the kings of the Medes; because his purpose is against Babylon, to destroy it: for it is the vengeance of Yahweh, the vengeance of his temple.
Young's Literal Translation (YLT) Cleanse ye the arrows, fill the shields, Stirred up hath Jehovah the spirit of the kings of Madia, For against Babylon His device `is' to destroy it, For the vengeance of Jehovah it `is', The vengeance of His temple.
Cross Reference 1 Kings 11:14 in Telugu 14 యెహోవా ఎదోమువాడు హదదు అనే ఒకణ్ణి సొలొమోనుకు విరోధిగా లేపాడు. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
1 Kings 11:23 in Telugu 23 దేవుడు సొలోమోను మీదికి ఎల్యాదా కొడుకు రెజోను అనే ఇంకొక విరోధిని లేపాడు. ఇతడు సోబా రాజు హదదెజరు అనే తన యజమాని దగ్గరనుండి పారిపోయినవాడు.
1 Chronicles 5:26 in Telugu 26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజు పూలు (అంటే అష్షూరు రాజు తిగ్లత్పిలేసెరు) ను రెచ్చగొట్టాడు. ఆ రాజు రూబేను గోత్రం, గాదు గోత్రం, మనష్షే అర్థగోత్రం వాళ్ళనందర్నీబందీలుగా హాలహుకీ, హాబోరుకీ, హారాకుకీ, గోజాను నదీ ప్రాంతాలకీ పట్టుకుని పోయాడు. ఈ రోజుకీ వీళ్ళు అక్కడ కనిపిస్తున్నారు.
2 Chronicles 36:22 in Telugu 22 పారసీకదేశపు రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరం యిర్మీయా ద్వారా పలికిన తన మాట నెరవేర్చడానికి యెహోవా పారసీకదేశపు రాజు కోరెషు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా చాటించి రాత పూర్వకంగా ఇలా ప్రకటన చేయించాడు.
Ezra 1:1 in Telugu 1 యెహోవా తాను యిర్మీయా ద్వారా పలికిన మాటలు నెరవేర్చడానికి పర్షియా రాజు కోరెషు పాలన మొదటి సంవత్సరంలో రాజు మనస్సును ప్రేరేపించాడు. అతడు తన రాజ్యమంతటా రాతపూర్వకంగా చాటింపు వేయించి ఇలా ప్రకటించాడు.
Psalm 74:3 in Telugu 3 నీ పరిశుద్ధ స్థలాన్ని శత్రువులు ఎలా పూర్తిగా పాడు చేశారో వచ్చి ఆ శిథిలాలను చూడు.
Psalm 83:3 in Telugu 3 నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు.
Isaiah 10:26 in Telugu 26 ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించినట్టు సేనల ప్రభువైన యెహోవా తన కొరడాను అతని మీద ఝుళిపిస్తాడు. ఆయన ఐగుప్తులో చేసినట్టు తన కర్ర సముద్రం మీద ఎత్తి దాన్ని పైకెత్తుతాడు.
Isaiah 13:17 in Telugu 17 చూడు, వాళ్ళ మీద దాడి చెయ్యడానికి నేను మాదీయులను రేపడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు వెండిని పట్టించుకోరు. బంగారం కూడా వాళ్ళకు ఆనందం కలిగించదు.
Isaiah 21:2 in Telugu 2 దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది. మోసగాడు మోసాలు చేస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. ఏలాము దేశమా, వెళ్ళి దాడి చెయ్యి, మాదియా దేశమా ముట్టడి వెయ్యి. నేను ఆమె మూలుగులను ఆపివేస్తాను.
Isaiah 21:5 in Telugu 5 వాళ్ళు భోజనం బల్ల సిద్ధం చేస్తారు. తివాచీలు పరుస్తారు. అన్నం తిని, తాగుతారు. అధిపతులారా, లేవండి. డాళ్ళకి నూనె రాయండి.
Isaiah 41:25 in Telugu 25 ఉత్తరదిక్కు నుండి నేనొకణ్ణి పురిగొల్పుతున్నాను. అతడు నా పేరున ప్రార్థిస్తాడు. అతడు సూర్యోదయ దిక్కునుండి వచ్చి ఒకడు బురద తొక్కే విధంగా, కుమ్మరి మన్ను తొక్కే విధంగా రాజులను అణగదొక్కుతాడు.
Isaiah 45:1 in Telugu 1 యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి ఈ విధంగా చెబుతున్నాడు. “అతని పక్షంగా రాజ్యాలను జయించడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లు విప్పుతాను. ద్వారాలు అతని ఎదుట తెరచి ఉండేలా తలుపులు తీస్తాను.
Isaiah 45:5 in Telugu 5 నేను యెహోవాను, మరి ఏ దేవుడూ లేడు. నేను తప్ప ఏ దేవుడూ లేడు.
Isaiah 46:11 in Telugu 11 తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నా సంకల్పాన్ని జరిగించే వ్యక్తిని పిలుస్తున్నాను. నేను చెప్పిన దాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించినదాన్ని సఫలం చేస్తాను.
Jeremiah 46:4 in Telugu 4 గుర్రాలను సిద్ధం చేయండి. రౌతులారా, శిరస్త్రాణం పెట్టుకుని వాటిని అధిరోహించండి. బల్లేలకు పదును పెట్టండి. ఆయుధాలు ధరించండి.
Jeremiah 46:9 in Telugu 9 గుర్రాలూ, పైకి లేవండి. రథాలూ రోషం తెచ్చుకోండి. సైనికుల్లారా బయలుదేరండి. డాలు వాడటంలో నిపుణులైన కూషు వాళ్ళూ, పూతు వాళ్ళూ, విల్లు వంచి బాణాలు సంధించడంలో నిపుణులైన లూదీ వాళ్ళూ బయలుదేరాలి.
Jeremiah 50:9 in Telugu 9 ఎందుకంటే చూడండి, నేను బబులోనుకు విరోధంగా ఉత్తర దిక్కునుండి కొన్ని గొప్ప దేశాల సముదాయాన్ని రేపుతున్నాను. వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. బబులోనును వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ బాణాలు నైపుణ్యం కల్గిన వీర యోధుల్లా ఉన్నాయి. అవి వ్యర్ధంగా తిరిగి రావు.
Jeremiah 50:14 in Telugu 14 బబులోనుకు చుట్టూ బారులు తీరండి. విల్లును వంచగలిగిన ప్రతి ఒక్కడూ ఆమెపై బాణం వెయ్యాలి. ఆమె యెహోవాకు విరోధంగా పాపం చేసింది. కాబట్టి మీ బాణాలు దాచుకోవద్దు.
Jeremiah 50:25 in Telugu 25 కల్దీయుల దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు చేయాల్సిన పని ఉంది. ఆయన తన క్రోధాన్ని చూపడానికి తన ఆయుధాగారాన్ని తెరచి ఆయుధాలను బయటకు తీస్తున్నాడు.
Jeremiah 50:28 in Telugu 28 వినండి. బబులోనులో నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ శబ్దం వినిపిస్తుంది. సీయోను విషయంలోనూ, తన మందిరం విషయంలోనూ మన దేవుడైన యెహోవా చేస్తున్న ప్రతీకారాన్ని ప్రకటించండి.
Jeremiah 50:45 in Telugu 45 బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినండి. కల్దీయుల దేశాన్ని గూర్చి ఆయన ఉద్దేశించినది వినండి. నిశ్చయంగా మందలోని అల్పులైనవారిని వారు లాగుతారు. నిశ్చయంగా వారిని బట్టి వారు నివసించిన ప్రదేశం నిర్ఘాంతపోతుంది.
Jeremiah 51:12 in Telugu 12 బబులోను ప్రాకారాలపై జెండా ఎగరవేయండి. గస్తీ వాళ్ళను నియమించండి. యెహోవా తాను చేయదలిచింది చేయబోతూ ఉన్నాడు. అందుకని కావలి వాళ్ళను పెట్టండి. పట్టణం నుండి తప్పించుకుని పారిపోయే వాళ్ళను పట్టుకోడానికి సైనికులను దాచి ఉంచండి.
Jeremiah 51:24 in Telugu 24 బబులోనూ, కల్దీయ దేశనివాసులూ సీయోనుకి చేసిన దుర్మార్గానికంతటికీ మీరు చూస్తుండగానే వాళ్లకి ప్రతీకారం చేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.
Jeremiah 51:27 in Telugu 27 దేశంలో జెండాలెత్తండి. జనాల్లో బాకా ఊదండి. ఆమెపై దాడి చేయడానికి జనాలకు బాధ్యత అప్పగించండి. దాని పై దాడి చేయడానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలకు దాన్ని గూర్చి తెలియజేయండి. దానిపై దాడి చేయడం కోసం ఒక సైన్యాధిపతిని నియమించండి. మిడతల దండులా గుర్రాలను తరలించండి.
Jeremiah 51:35 in Telugu 35 సీయోను నివాసులు ఇలా అంటారు. “నాకూ నా కుటుంబానికీ వ్యతిరేకంగా జరిగిన హింస నా ఉసురు తగిలి బబులోనుకు జరుగుతుంది గాక!” యెరూషలేము ఇలా అంటుంది. “నా రక్తం ఒలికించిన పాపం కల్దీయులకు తగులుతుంది గాక!”
Habakkuk 2:17 in Telugu 17 లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది. నీవు పశువులను చేసిన నాశనం నీ మీదే పడుతుంది. దేశాలకు, పట్టణాలకు, వాటి నివాసులకు, నీవు చేసిన హింసాకాండను బట్టి, ఇది సంభవిస్తుంది.
Zechariah 12:2 in Telugu 2 ఆయన చెబుతున్నది ఏమిటంటే “నేను యెరూషలేమును చుట్టూ ఉన్న సమస్త ప్రజలందరికీ మత్తు కలిగించే పాత్రగా చేయబోతున్నాను. శత్రువులు యెరూషలేమును, యూదా దేశాన్ని కూడా ముట్టడిస్తారు.
Zechariah 14:2 in Telugu 2 ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.
Zechariah 14:12 in Telugu 12 యెహోవా యెరూషలేముపై దండెత్తి యుద్ధం చేసిన ప్రజలపై తెగుళ్లు రప్పించి వాళ్ళను హింసిస్తాడు. ఆ ప్రజలు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్లిపోతాయి. వారి కళ్ళు వాటి కుహరాల్లోనే కుళ్లిపోతాయి. వారి నాలుకలు వారి నోళ్లలోనే కుళ్లిపోతాయి.
Revelation 17:16 in Telugu 16 నువ్వు చూసిన పది కొమ్ములు- వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంటల్లో ఆమెను కాల్చివేస్తారు.