Jeremiah 30:19 in Telugu 19 అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.
Other Translations King James Version (KJV) And out of them shall proceed thanksgiving and the voice of them that make merry: and I will multiply them, and they shall not be few; I will also glorify them, and they shall not be small.
American Standard Version (ASV) And out of them shall proceed thanksgiving and the voice of them that make merry: and I will multiply them, and they shall not be few; I will also glorify them, and they shall not be small.
Bible in Basic English (BBE) And from them will go out praise and the sound of laughing: and I will make them great in number, and they will not become less; and I will give them glory, and they will not be small.
Darby English Bible (DBY) And out of them shall proceed thanksgiving, and the voice of them that make merry: and I will multiply them, and they shall not be diminished; and I will honour them, and they shall not be small.
World English Bible (WEB) Out of them shall proceed thanksgiving and the voice of those who make merry: and I will multiply them, and they shall not be few; I will also glorify them, and they shall not be small.
Young's Literal Translation (YLT) And gone forth from them hath thanksgiving, And the voice of playful ones, And I have multiplied them and they are not few, And made them honourable, and they are not small.
Cross Reference Ezra 3:10 in Telugu 10 రాతి చెక్కడం పనివారు యెహోవా మందిరం పునాది వేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దావీదు నిర్ణయించిన క్రమం ప్రకారం యాజకులు తమ వస్త్రాలు ధరించుకుని బాకాలతో నిలబడ్డారు. ఆసాపు వంశం వారైన లేవీయులు చేతి తాళాలతో యెహోవాను స్తుతించారు.
Ezra 6:22 in Telugu 22 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరురాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు.
Nehemiah 8:12 in Telugu 12 ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు.
Nehemiah 8:17 in Telugu 17 చెర నుండి తిరిగి వచ్చినవాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవిత కాలం తరువాత నుండి ఇప్పటి వరకూ ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేయలేదు.
Nehemiah 12:43 in Telugu 43 వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేంలో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి.
Psalm 53:6 in Telugu 6 సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.
Psalm 126:1 in Telugu 1 యాత్రల కీర్తన సీయోను నగరవాసులను యెహోవా చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు మనం కల కంటున్నవాళ్ళ వలే ఉన్నాం.
Isaiah 12:1 in Telugu 1 ఆ రోజున మీరు ఇలా అంటారు, “యెహోవా, నువ్వు నా మీద కోపపడ్డావు, నీ కోపం చల్లారింది, నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నన్ను ఆదరించావు.
Isaiah 27:6 in Telugu 6 రాబోయే ఆ రోజున యాకోబు వేరు వ్యాపిస్తుంది. ఇశ్రాయేలు జాతి మొగ్గ వేసి పుష్పిస్తుంది. వాళ్ళు భూమినంతా ఫలభరితం చేస్తారు.
Isaiah 35:10 in Telugu 10 నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.
Isaiah 51:3 in Telugu 3 యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.
Isaiah 51:11 in Telugu 11 యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.
Isaiah 52:9 in Telugu 9 యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు.
Isaiah 60:9 in Telugu 9 నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి.
Isaiah 60:19 in Telugu 19 ఇక మీదట పగటివేళ సూర్య కాంతి నీకు వెలుగుగా ఉండదు. వెన్నెల నీ మీద ప్రకాశింపదు. యెహోవాయే నీకు ఎప్పటికీ నిలిచిపోయే కాంతి. నీ దేవుడు నీకు శోభ.
Isaiah 60:22 in Telugu 22 అల్పుడు వేయిమంది అవుతాడు. చిన్నవాడు బలమైన జనం అవుతాడు. నేను యెహోవాను. తగిన కాలంలో వీటిని త్వరగా జరిగిస్తాను.
Isaiah 62:2 in Telugu 2 రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు. యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు.
Jeremiah 31:4 in Telugu 4 ఇశ్రాయేలు కన్యా, నువ్వు నిర్మాణం అయ్యేలా నేను నిన్ను మళ్ళీ కడతాను. నువ్వు మళ్ళీ తంబురలు వాయిస్తావు. సంతోష నాట్యాలతో బయటకు వెళ్తావు.
Jeremiah 31:12 in Telugu 12 వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు.
Jeremiah 31:27 in Telugu 27 ఇది యెహోవా వాక్కు. “చూడు, ఇశ్రాయేలు గృహాల్లో, యూదా గృహాల్లో మనుషుల, మృగాల సంతానపు విత్తనాలు చల్లే రోజులు వస్తున్నాయి.
Jeremiah 33:9 in Telugu 9 నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’”
Jeremiah 33:22 in Telugu 22 ఆకాశ నక్షత్రాలు, సముద్రపు ఇసుక రేణువులు లెక్కపెట్టడం సాధ్యం కానట్టే, నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు సేవ చేసే లేవీయులను లెక్క పెట్టలేనంతగా నేను అధికం చేస్తాను.”
Ezekiel 36:10 in Telugu 10 మీ మీద ఎంతోమందిని, అంటే ఇశ్రాయేలీయులను విస్తరింప చేస్తాను. పట్టణాల్లో ప్రజలు నివసిస్తారు. శిథిలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది.
Ezekiel 36:37 in Telugu 37 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే “తమ కోసం ఇలా చేయమని ఇశ్రాయేలీయులు నన్ను అడిగేలా చేస్తాను. గొర్రెల మందల్లాగా నేను వారిని విస్తరింపజేస్తాను.
Ezekiel 37:26 in Telugu 26 నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను.
Zephaniah 3:14 in Telugu 14 సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి.
Zechariah 2:4 in Telugu 4 ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు.
Zechariah 8:4 in Telugu 4 సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేదేమంటే వృద్ధాప్యం వల్ల కర్ర పట్టుకుని, వృద్ధ స్త్రీపురుషులూ ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు.
Zechariah 8:19 in Telugu 19 “సేనల ప్రభువు యెహోవా ఆజ్ఞ ఇస్తున్నదేమిటంటే నాలుగవ నెల ఉపవాసం, ఐదవ నెల ఉపవాసం, ఏడవ నెల ఉపవాసం, పదవ నెల ఉపవాసం, యూదా యింటివారికి సంతోషం ఉత్సాహం పుట్టించే మనోహరమైన పండగలౌతాయి. కాబట్టి సత్యాన్ని, శాంతిసమాధానాలును ప్రేమించండి.”
Zechariah 9:13 in Telugu 13 యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.
Zechariah 10:8 in Telugu 8 నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు.
Zechariah 12:8 in Telugu 8 ఆ కాలంలో యెహోవా యెరూషలేము నివాసులను కాపాడతాడు. వారిలో బలహీనులు దావీదువంటి వారిలాగా, దావీదు వంశీయులు దేవుని వంటివారుగా, ప్రజల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు.
John 17:22 in Telugu 22 మనం ఏకమై ఉన్నట్టే, వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను.
1 Peter 1:7 in Telugu 7 నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా! దాని కంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి, యేసు క్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పునూ మహిమనూ ఘనతనూ తెస్తుంది.