Jeremiah 23:6 in Telugu 6 ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.”
Other Translations King James Version (KJV) In his days Judah shall be saved, and Israel shall dwell safely: and this is his name whereby he shall be called, THE LORD OUR RIGHTEOUSNESS.
American Standard Version (ASV) In his days Judah shall be saved, and Israel shall dwell safely; and this is his name whereby he shall be called: Jehovah our righteousness.
Bible in Basic English (BBE) In his days Judah will have salvation and Israel will be living without fear: and this is the name by which he will be named, The Lord is our righteousness.
Darby English Bible (DBY) In his days Judah shall be saved, and Israel shall dwell in safety; and this is his name whereby he shall be called, Jehovah our Righteousness.
World English Bible (WEB) In his days Judah shall be saved, and Israel shall dwell safely; and this is his name by which he shall be called: Yahweh our righteousness.
Young's Literal Translation (YLT) In his days is Judah saved, and Israel dwelleth confidently, And this his name that Jehovah proclaimeth him, `Our Righteousness.'
Cross Reference Deuteronomy 33:28 in Telugu 28 ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు ఊట సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
1 Kings 4:25 in Telugu 25 సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు.
Psalm 130:7 in Telugu 7 యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు.
Isaiah 2:4 in Telugu 4 ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు. అనేక జాతులకు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు తమ కత్తులను నాగటి నక్కులుగానూ, తమ ఈటెలను మోట కత్తులుగానూ సాగగొడతారు. జనం మీదకి జనం కత్తి ఎత్తరు. ఇంక ఎన్నడూ యుద్ధ సన్నాహాలు చెయ్యరు.
Isaiah 7:14 in Telugu 14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.
Isaiah 9:6 in Telugu 6 ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.
Isaiah 12:1 in Telugu 1 ఆ రోజున మీరు ఇలా అంటారు, “యెహోవా, నువ్వు నా మీద కోపపడ్డావు, నీ కోపం చల్లారింది, నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నన్ను ఆదరించావు.
Isaiah 33:22 in Telugu 22 ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.
Isaiah 35:9 in Telugu 9 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిలో కాలు మోపవు. అవి అక్కడ కనబడవు. విమోచన పొందినవారు మాత్రమే అక్కడ నడుస్తారు. యెహోవా విమోచించినవారు పాటలు పాడుతూ తిరిగి సీయోనుకు వస్తారు.
Isaiah 45:17 in Telugu 17 యెహోవా ఇశ్రాయేలుకు నిత్యమైన రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఇక ఎన్నటికీ సిగ్గుపడరు, అవమానం పాలు కారు.
Isaiah 45:24 in Telugu 24 ‘యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి’ అని ప్రజలు నా గురించి చెబుతారు.” మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.
Isaiah 54:17 in Telugu 17 నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.
Jeremiah 30:10 in Telugu 10 కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
Jeremiah 32:37 in Telugu 37 చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను.
Jeremiah 33:16 in Telugu 16 ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”
Ezekiel 34:25 in Telugu 25 అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో క్షేమంగా పడుకునేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను. దేశంలో క్రూర జంతువులు లేకుండా చేస్తాను.
Ezekiel 37:24 in Telugu 24 నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు.
Daniel 9:24 in Telugu 24 తిరుగుబాటును అణచి వేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని వెల్లడి చేయడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి.
Hosea 1:7 in Telugu 7 అయితే యూదావారిపై జాలి చూపుతాను. వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.”
Hosea 2:18 in Telugu 18 “ఆ దినాన నేను నా ప్రజల పక్షంగా జంతువులతో, పక్షులతో, నేలపై పాకే జీవులతో నిబంధన చేస్తాను. దేశంలో విల్లును, కత్తిని, యుద్ధాన్ని లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా పడుకునేలా చేస్తాను.
Obadiah 1:17 in Telugu 17 అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.
Obadiah 1:21 in Telugu 21 ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది.
Zephaniah 3:13 in Telugu 13 ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు. అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.”
Zechariah 2:4 in Telugu 4 ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు.
Zechariah 3:10 in Telugu 10 ఆ రోజుల్లో మీరు ద్రాక్షచెట్ల క్రింద, అంజూరపు చెట్ల క్రింద కూర్చోవడానికి ఒకరినొకరు పిలుచుకుంటారు.” ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
Zechariah 10:6 in Telugu 6 నేను యూదా ప్రజలను బలపరుస్తాను. యోసేపు సంతానానికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇస్తాను. నేను వారిపట్ల కనికరం చూపుతాను. నేను వారి ప్రార్థన ఆలకిస్తాను కనుక నేను వాళ్ళను నిరాకరించిన విషయం మరచిపోతారు. నేను వారి దేవుడనైన యెహోవాను,
Zechariah 14:9 in Telugu 9 ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
Matthew 1:21 in Telugu 21 ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.
Luke 19:9 in Telugu 9 అందుకు యేసు, “ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాము కుమారుడే.
Romans 3:22 in Telugu 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి.
Romans 11:26 in Telugu 26 “విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు.
1 Corinthians 1:30 in Telugu 30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు.
2 Corinthians 5:21 in Telugu 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
Philippians 3:9 in Telugu 9 ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.