Jeremiah 22:15 in Telugu 15 నువ్వు దేవదారు పలకల ఇంటిని కట్టించుకుని రాజువవుతావా? నీ తండ్రి కూడా తింటూ తాగుతూ నీతిన్యాయాలను అనుసరించలేదా? అప్పుడు అతడు బాగానే ఉన్నాడు.
Other Translations King James Version (KJV) Shalt thou reign, because thou closest thyself in cedar? did not thy father eat and drink, and do judgment and justice, and then it was well with him?
American Standard Version (ASV) Shalt thou reign, because thou strivest to excel in cedar? Did not thy father eat and drink, and do justice and righteousness? then it was well with him.
Bible in Basic English (BBE) Are you to be a king because you make more use of cedar than your father? did not your father take food and drink and do right, judging in righteousness, and then it was well for him?
Darby English Bible (DBY) Shalt thou reign, because thou viest with the cedar? Did not thy father eat and drink, and do judgment and justice? Then it was well with him.
World English Bible (WEB) Shall you reign, because you strive to excel in cedar? Didn't your father eat and drink, and do justice and righteousness? then it was well with him.
Young's Literal Translation (YLT) Dost thou reign, because thou art fretting thyself in cedar? Thy father -- did he not eat and drink? Yea, he did judgment and righteousness, Then `it is' well with him.
Cross Reference Deuteronomy 4:40 in Telugu 40 అంతే గాక మీకు, మీ తరువాత మీ సంతానానికి సుఖశాంతులు కలగడానికి మీ యెహోవా దేవుడు ఎప్పటికీ మీకిస్తున్న దేశంలో మీకు దీర్ఘాయువు కలిగేలా నేను మీకాజ్ఞాపిస్తున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను మీరు పాటించాలి.
2 Samuel 8:15 in Telugu 15 దావీదు ఇశ్రాయేలు దేశమంతటి మీద రాజుగా ఇశ్రాయేలు ప్రజలందరి పట్లా నీతి న్యాయాలు జరిగించాడు.
1 Kings 4:20 in Telugu 20 అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.
1 Kings 10:9 in Telugu 9 నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.”
2 Kings 22:2 in Telugu 2 అతడు యెహోవా దృష్టిలో యథార్ధంగా నడుస్తూ, కుడి ఎడమలకు తిరగకుండా తన పితరుడు దావీదు చూపించిన దారిలో నడిచాడు.
2 Kings 23:25 in Telugu 25 అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలే పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటివాడు ఒక్కడూ లేడు.
1 Chronicles 3:15 in Telugu 15 యోషీయా కొడుకులెవరంటే పెద్దవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీము, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూము.
2 Chronicles 34:2 in Telugu 2 అతడు యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించాడు. తన పూర్వీకుడైన దావీదు మార్గాల్లో నడుస్తూ కుడికిగానీ ఎడమకుగానీ తొలగలేదు.
2 Chronicles 35:7 in Telugu 7 యోషీయా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లలనూ మేకపిల్లలనూ 3,000 కోడెదూడలనూ అక్కడఉన్న ప్రజలందరికీ పస్కాబలికోసం ఇచ్చాడు.
2 Chronicles 35:12 in Telugu 12 మోషే గ్రంథంలో రాసినట్టు ప్రజల వంశాల ప్రకారం పంచిపెట్టడానికీ యెహోవాకు అర్పణగా ఇవ్వడానికీ దహనబలి మాంసాన్ని యాజకులు పక్కన ఉంచారు. వారు ఎడ్లను కూడా అలాగే చేశారు.
Psalm 128:1 in Telugu 1 యాత్రల కీర్తన. యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు.
Proverbs 20:28 in Telugu 28 కృప, సత్యం రాజుకు రక్ష. కృప మూలంగా అతడు తన సింహాసనాన్ని పదిలం చేసుకుంటాడు.
Proverbs 21:3 in Telugu 3 బలులు అర్పించడం కంటే నీతిన్యాయాలను అనుసరించి నడచు కోవడం యెహోవాకు ప్రీతికరం.
Proverbs 25:5 in Telugu 5 రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది.
Proverbs 29:4 in Telugu 4 న్యాయం మూలంగా రాజు దేశానికి క్షేమం కలగజేస్తాడు. లంచాలు పుచ్చుకొనేవాడు దేశాన్ని పాడుచేస్తాడు.
Proverbs 31:9 in Telugu 9 నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.
Ecclesiastes 2:24 in Telugu 24 అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను.
Ecclesiastes 9:7 in Telugu 7 నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి. సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
Ecclesiastes 10:17 in Telugu 17 అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం.
Isaiah 3:10 in Telugu 10 నీకు మేలు కలుగుతుందని నీతిమంతుడితో చెప్పు. వాళ్ళు తమ క్రియల ఫలం అనుభవిస్తారు.
Isaiah 9:7 in Telugu 7 ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
Isaiah 33:16 in Telugu 16 అలాంటి వాడు ఉన్నత స్థలాల్లో నివసిస్తాడు. అతనికి పర్వత శిఖరాలపైని శిలలు ఆశ్రయంగా ఉంటాయి. ఆహారమూ, నీళ్ళూ క్రమంగా అతనికి లభ్యమౌతాయి.
Jeremiah 21:12 in Telugu 12 దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.” ఇది యెహోవా వాక్కు.
Jeremiah 22:3 in Telugu 3 యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘మీరు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులనూ తండ్రిలేని వారినీ విధవరాళ్ళనూ బాధించవద్దు. వాళ్ళ మీద హింసాకాండ చేయవద్దు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపవద్దు.
Jeremiah 22:18 in Telugu 18 కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ” అని అతని గురించి ఏడవరు. “అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా” అని అతని కోసం ఏడవరు.
Jeremiah 23:5 in Telugu 5 యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
Jeremiah 42:6 in Telugu 6 అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.”
Luke 11:41 in Telugu 41 మీకు ఉన్నవాటిని పేదలకు ధర్మం చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి.
Acts 2:46 in Telugu 46 ప్రతిరోజూ ఏక మనసుతో దేవాలయంలో సమావేశమౌతూ ఇళ్ళలో రొట్టె విరుస్తూ,
1 Corinthians 10:31 in Telugu 31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.