Jeremiah 21:2 in Telugu 2 “బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను విడిచి వెళ్లిపోయేలా యెహోవా తన అద్భుత క్రియలన్నిటిని మన పట్ల జరిగిస్తాడేమో దయచేసి మా కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి” అని చెప్పడానికి యిర్మీయా దగ్గరికి వారిని పంపించాడు. అప్పుడు యెహోవా దగ్గరనుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
Other Translations King James Version (KJV) Enquire, I pray thee, of the LORD for us; for Nebuchadrezzar king of Babylon maketh war against us; if so be that the LORD will deal with us according to all his wondrous works, that he may go up from us.
American Standard Version (ASV) Inquire, I pray thee, of Jehovah for us; for Nebuchadrezzar king of Babylon maketh war against us: peradventure Jehovah will deal with us according to all his wondrous works, that he may go up from us.
Bible in Basic English (BBE) Will you get directions from the Lord for us; for Nebuchadrezzar, king of Babylon, is making war against us; it may be that the Lord will do something for us like all the wonders he has done, and make him go away from us.
Darby English Bible (DBY) Inquire, I pray thee, of Jehovah for us; for Nebuchadrezzar the king of Babylon maketh war against us; if so be that Jehovah will deal with us according to all his marvellous works, that he may go up from us.
World English Bible (WEB) Please inquire of Yahweh for us; for Nebuchadrezzar king of Babylon makes war against us: peradventure Yahweh will deal with us according to all his wondrous works, that he may go up from us.
Young's Literal Translation (YLT) `Inquire, we pray thee, for us at Jehovah, for Nebuchadrezzar king of Babylon hath fought against us; perhaps Jehovah doth deal with us according to all His wonders, and doth cause him to go up from off us.'
Cross Reference Exodus 14:1 in Telugu 1 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,
Joshua 10:1 in Telugu 1 యెహోషువ యెరికోనూ, దాని రాజునూ నిర్మూలం చేసినట్టు హాయినీ దాని రాజునూ నిర్మూలం చేసిన సంగతీ గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలిసిపోయిన సంగతీ యెరూషలేం రాజైన అదోనీసెదెకు విన్నప్పుడు అతడూ అతని ప్రజలూ చాలా భయపడ్డారు.
Judges 4:1 in Telugu 1 ఏహూదు చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు మళ్ళీ యెహోవా దృష్టికి దోషులయ్యారు గనక
Judges 20:27 in Telugu 27 ఆ రోజుల్లో యెహోవా నిబంధన మందసం అక్కడే ఉంది.
1 Samuel 7:10 in Telugu 10 సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు.
1 Samuel 10:22 in Telugu 22 అప్పుడు వారు “ఇక్కడికి రావలసి మనిషి ఇంకెవరైనా ఉన్నారా” అని యెహోవా దగ్గర వాకబు చేసినప్పుడు యెహోవా “అతడు సామానుల్లో దాక్కున్నాడు” అని చెప్పాడు.
1 Samuel 14:6 in Telugu 6 యోనాతాను “ఈ సున్నతి లేనివారి శిబిరంపైకి వెళ్దాం పద. ఒకవేళ యెహోవా మన కార్యాన్ని సఫలం చేస్తాడేమో. అనేకమంది చేతనైనా, కొద్దిమంది చేతనైనా రక్షించడం యెహోవాకు అసాధ్యమా?” అని తన ఆయుధాలు మోసేవాడితో అన్నాడు.
1 Samuel 17:45 in Telugu 45 దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను.
1 Samuel 28:6 in Telugu 6 యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు.
1 Samuel 28:15 in Telugu 15 “నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు” అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు “నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను” అన్నాడు.
1 Kings 14:2 in Telugu 2 యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు. “నీవు లేచి యరొబాము భార్యవని ఎవరికీ తెలియకుండా మారువేషం వేసుకుని షిలోహు వెళ్ళు. ఈ ప్రజల మీద నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహీయా అక్కడున్నాడు.
1 Kings 22:3 in Telugu 3 ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి “రామోత్గిలాదు మనదని మీకు తెలుసు. అయితే మనం దాన్ని సిరియా రాజు చేతిలోనుంచి తీసుకోడానికి ప్రయత్నమేమీ చేయడం లేదు” అన్నాడు.
2 Kings 1:3 in Telugu 3 కానీ యెహోవా దూత తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా అన్నాడు. “నీవు లేచి సమరయ రాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు. ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనే వాడు లేడనుకున్నారా?
2 Kings 3:11 in Telugu 11 కానీ యెహోషాపాతు “మన కోసం యెహోవాను సంప్రదించడానికి ఇక్కడ ఒక్క యెహోవా ప్రవక్త కూడా లేడా?” అని అడిగాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు దగ్గర సైనికోద్యోగి ఒకడు “షాపాతు కొడుకు ఎలీషా ఇక్కడ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు ఎలీయా చేతులపై నీళ్ళు పోసే వాడు” అని చెప్పాడు.
2 Kings 22:13 in Telugu 13 “మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.
2 Kings 25:1 in Telugu 1 సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు.
2 Chronicles 14:9 in Telugu 9 ఇతియోపీయా వాడు జెరహు 10,00,000 మంది సైన్యంతో, 300 రథాలతో వారిపై దండెత్తి మారేషా వరకూ వచ్చినపుడు ఆసా అతణ్ణి ఎదుర్కొన్నాడు.
2 Chronicles 20:1 in Telugu 1 ఇది జరిగిన తరువాత, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొంతమంది దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చారు.
2 Chronicles 32:21 in Telugu 21 యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులనూ అధికారులనూ చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతణ్ణి అక్కడ కత్తితో చంపేశారు.
Psalm 44:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం. దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం.
Psalm 46:8 in Telugu 8 రండి, యెహోవా చేసిన పనులు, భూమిని ఆయన నాశనం చేసిన విధానం చూడండి.
Psalm 48:4 in Telugu 4 చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.
Psalm 105:5 in Telugu 5 ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
Psalm 136:1 in Telugu 1 యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Isaiah 59:1 in Telugu 1 యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. ఆయన చెవులు వినలేనంత నీరసం కాలేదు. మీ అపరాధాలు మీకూ మీ దేవునికీ అడ్డంగా వచ్చాయి.
Jeremiah 32:17 in Telugu 17 “అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
Jeremiah 32:24 in Telugu 24 చూడు! పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ముట్టడి దిబ్బలు పైపైకి లేస్తున్నాయి. ఖడ్గం, కరువు, తెగులు రావడం వల్ల దాని మీద యుద్ధం చేసే కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగించడం జరిగింది. నువ్వు ఏం చెప్పావో అది జరుగుతూ ఉంది. జరుగుతున్నది నువ్వు చూస్తున్నావు.
Jeremiah 37:3 in Telugu 3 రాజైన సిద్కియా షెలెమ్యా కొడుకు యెహుకలునూ, యాజకుడైన మయశేయా కొడుకు జెఫన్యానూ, ప్రవక్త అయిన యిర్మీయా దగ్గరికి పంపి “మా పక్షంగా మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి,” అని అన్నారు.
Jeremiah 37:7 in Telugu 7 “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నన్ను అడిగి తెలుసుకోమని నిన్ను నా దగ్గరికి పంపిన యూదా రాజుతో నువ్వు ఈ విధంగా చెప్పాలి, ‘చూడు, మీకు సాయం చెయ్యడానికి బయలుదేరి వస్తున్న ఫరో సైన్యం తమ స్వదేశమైన ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోయింది.
Jeremiah 38:14 in Telugu 14 తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోకి ప్రవక్త అయిన యిర్మీయాను పిలిపించి, అతనితో “నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నా నుంచి ఏదీ దాచకుండా చెప్పు,” అన్నాడు.
Jeremiah 39:1 in Telugu 1 యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.
Jeremiah 42:4 in Telugu 4 కాబట్టి ప్రవక్త అయిన యిర్మీయా వాళ్లకిలా చెప్పాడు. “మీరు చెప్పింది విన్నాను. చూడండి, మీరు అభ్యర్ధించినట్టే నేను మీ దేవుడైన యెహోవాను ప్రార్ధిస్తాను. యెహోవా ఏం జవాబిచ్చాడో అది ఏదీ దాచకుండా మీకు చెప్తాను.”
Jeremiah 52:3 in Telugu 3 యెహోవా తీవ్రమైన కోపంతో వాళ్ళని తన ఎదుట నుండి వెళ్లగొట్టే వరకూ ఈ దుర్మార్గాలు యెరూషలేములోనూ యూదాలోనూ జరిగాయి. తర్వాత సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.
Ezekiel 14:3 in Telugu 3 “నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
Ezekiel 20:1 in Telugu 1 ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.