Jeremiah 19:4 in Telugu 4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
Other Translations King James Version (KJV) Because they have forsaken me, and have estranged this place, and have burned incense in it unto other gods, whom neither they nor their fathers have known, nor the kings of Judah, and have filled this place with the blood of innocents;
American Standard Version (ASV) Because they have forsaken me, and have estranged this place, and have burned incense in it unto other gods, that they knew not, they and their fathers and the kings of Judah; and have filled this place with the blood of innocents,
Bible in Basic English (BBE) Because they have given me up, and made this place a strange place, burning perfumes in it to other gods, of whom they and their fathers and the kings of Judah had no knowledge; and they have made this place full of the blood of those who have done no wrong;
Darby English Bible (DBY) because they have forsaken me, and have estranged this place [from me], and have burned incense in it unto other gods, whom neither they nor their fathers have known, nor the kings of Judah; and have filled this place with the blood of innocents;
World English Bible (WEB) Because they have forsaken me, and have estranged this place, and have burned incense in it to other gods, that they didn't know, they and their fathers and the kings of Judah; and have filled this place with the blood of innocents,
Young's Literal Translation (YLT) because that they have forsaken Me, and make known this place, and make perfume in it to other gods, that they knew not, they and their fathers, and the kings of Judah, and they have filled this place `with' innocent blood,
Cross Reference Deuteronomy 13:6 in Telugu 6 మీ తల్లి కొడుకు, మీ సోదరుడు, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య, ప్రాణస్నేహితుడు,
Deuteronomy 13:13 in Telugu 13 దుష్టులైన కొందరు మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను పూజిద్దాం రండని తమ పట్టణ ప్రజలను ప్రేరేపించారని వింటే, మీరు ఆ సంగతిని బాగా పరీక్షించి విచారించాలి.
Deuteronomy 28:20 in Telugu 20 మీరు నన్ను విడిచిపెట్టి, మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకూ, మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవా శాపాలను, కలవరాన్నీ, నిందనూ మీ మీదికి తెప్పిస్తాడు.
Deuteronomy 28:36 in Telugu 36 యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.
Deuteronomy 28:64 in Telugu 64 యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.
Deuteronomy 31:16 in Telugu 16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.
Deuteronomy 32:15 in Telugu 15 యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు.
2 Kings 21:4 in Telugu 4 ఇంకా “నా పేరు యెరూషలేములో శాశ్వతంగా ఉంచుతాను” అని యెహోవా చెప్పిన ఆ యెరూషలేములో అతడు యెహోవా మందిరంలో బలిపీఠాలు కట్టించాడు.
2 Kings 21:16 in Telugu 16 ఇంకా మనష్షే యెహోవా దృష్టిలో చెడునడత నడిచి, యూదావాళ్ళను పాపంలో దింపడమే కాకుండా యెరూషలేమును ఈ మూల నుంచి ఆ మూల వరకూ రక్తంతో నిండేలా నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు.
2 Kings 22:16 in Telugu 16 యెహోవా చెప్పేదేమంటే, యూదా రాజు చదివించిన గ్రంథంలో రాసి ఉన్న కీడంతా, ఏదీ విడిచి పెట్టకుండా నేను ఈ స్థలం మీదకీ, దాని పౌరుల మీదకీ రప్పిస్తాను.
2 Kings 23:11 in Telugu 11 ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు.
2 Kings 24:4 in Telugu 4 అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపిన కారణంగా, దాన్ని క్షమించడానికి యెహోవాకు మనస్సు లేకపోయింది.
2 Chronicles 33:4 in Telugu 4 “యెరూషలేములో నా పేరు ఎప్పటికీ ఉంటుంది” అని యెహోవా ఏ స్థలాన్ని ఉద్దేశించి పలికాడో అదే యెహోవా మందిరంలో అతడు అన్య దేవుళ్ళకు బలిపీఠాలను కట్టించాడు.
Isaiah 59:7 in Telugu 7 వారి కాళ్లు పాపం చేయడానికి పరుగెడుతున్నాయి. నిరపరాధుల రక్తాన్ని ఒలకపోయడానికి అవి త్వరపడుతున్నాయి. వారి ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. వారి దారులు దుర్మార్గం, నాశనం.
Isaiah 65:11 in Telugu 11 అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు.
Jeremiah 2:13 in Telugu 13 నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.
Jeremiah 2:17 in Telugu 17 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?
Jeremiah 2:19 in Telugu 19 నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు.
Jeremiah 2:30 in Telugu 30 నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.
Jeremiah 2:34 in Telugu 34 నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది. వారేమీ నిన్ను దోచుకోడానికి వచ్చినవారు కాదు.
Jeremiah 5:6 in Telugu 6 అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది. అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది. ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు.
Jeremiah 7:9 in Telugu 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
Jeremiah 7:31 in Telugu 31 నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
Jeremiah 11:13 in Telugu 13 యూదా, నీ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవుళ్ళు నీకు ఉన్నారు కదా? యెరూషలేము ప్రజలారా, బయలు దేవతకు ధూపం వేయడానికి మీరు వీధి వీధినా అసహ్యమైన బలిపీఠాలు దానికి నిర్మించారు.
Jeremiah 15:6 in Telugu 6 నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.
Jeremiah 16:11 in Telugu 11 అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
Jeremiah 17:13 in Telugu 13 యెహోవాయే ఇశ్రాయేలుకు ఆశాభావం. నిన్ను విడిచిపెట్టే వాళ్ళంతా సిగ్గుపాలవుతారు. దేశంలో నీనుంచి దూరమైన వాళ్ళతో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే జీవజలాల ఊటను వదిలేశారు.
Jeremiah 18:15 in Telugu 15 నా ప్రజలైతే నన్ను మర్చిపోయారు. పనికిమాలిన విగ్రహాలకు వాళ్ళు ధూపం వేశారు. వాళ్ళ తమ మార్గాల్లో తడబాటు చెందారు. పురాతన దారులను విడిచిపెట్టి డొంక దారుల్లో నడవాలనుకుంటున్నారు.
Jeremiah 22:17 in Telugu 17 అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.
Jeremiah 26:15 in Telugu 15 అయితే ఈ మాటలన్నీ చెప్పడానికి నిజంగా యెహోవా మీ దగ్గరికి నన్ను పంపాడు. కాబట్టి, మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీ మీదికీ ఈ పట్టణం మీదికీ దాని నివాసుల మీదికీ తెచ్చుకున్న వాళ్ళవుతారు. దీనిని మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.”
Jeremiah 26:23 in Telugu 23 వాళ్ళు ఐగుప్తు నుంచి ఊరియాను యెహోయాకీం రాజు దగ్గరికి తెచ్చారు. రాజు కత్తితో అతణ్ణి చంపి సాధారణ ప్రజల సమాధుల్లో అతని శవాన్ని పాతిపెట్టాడు.
Jeremiah 32:29 in Telugu 29 ఈ పట్టణం మీద యుద్ధం చేసే కల్దీయులు వచ్చి, ఈ పట్టణానికి నిప్పంటించి, ఏ మిద్దెల మీదైతే ప్రజలు బయలుకు ధూపార్పణ చేసి అన్యదేవుళ్ళకు పానార్పణలు అర్పించి నన్ను రెచ్చగొట్టారో ఆ మిద్దెలన్నిటినీ కాల్చేస్తారు.
Lamentations 4:13 in Telugu 13 దానిలో నీతిమంతుల రక్తం చిందడానికి కారణం అయిన దాని యాజకుల పాపం వల్ల, దాని ప్రవక్తల పాపం వల్ల శత్రువు ప్రవేశించాడు.
Daniel 9:5 in Telugu 5 మేము పాపం, అతిక్రమం చేశాము. నీ ఆజ్ఞల నుండి, విధుల నుండి తప్పి పోయి, తిరుగుబాటు చేశాము.
Matthew 23:34 in Telugu 34 కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.
Luke 11:50 in Telugu 50 కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబెలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారిపై విచారణ జరుగుతుందని మీకు కచ్చితంగా చెబుతున్నాను.