Jeremiah 1:16 in Telugu 16 అప్పుడు యెరూషలేము ప్రజలు నన్ను విడిచి అన్యదేవుళ్ళకు ధూపం వేసి, తమ స్వంత చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చేసిన చెడుతనాన్ని బట్టి నేను వారిపై నా తీర్పులు ప్రకటిస్తాను.”
Other Translations King James Version (KJV) And I will utter my judgments against them touching all their wickedness, who have forsaken me, and have burned incense unto other gods, and worshipped the works of their own hands.
American Standard Version (ASV) And I will utter my judgments against them touching all their wickedness, in that they have forsaken me, and have burned incense unto other gods, and worshipped the works of their own hands.
Bible in Basic English (BBE) And I will give my decision against them on account of all their evil-doing; because they have given me up, burning perfumes to other gods and worshipping the works of their hands.
Darby English Bible (DBY) and I will pronounce my judgments against them for all their wickedness, in that they have forsaken me, and have burned incense unto other gods, and worshipped the works of their own hands.
World English Bible (WEB) I will utter my judgments against them touching all their wickedness, in that they have forsaken me, and have burned incense to other gods, and worshiped the works of their own hands.
Young's Literal Translation (YLT) And I have spoken My judgments with them concerning all their evil, in that they have forsaken Me, and make perfume to other gods, and bow themselves to the works of their own hands.
Cross Reference Deuteronomy 28:20 in Telugu 20 మీరు నన్ను విడిచిపెట్టి, మీ దుర్మార్గపు పనులతో మీరు నాశనమైపోయి త్వరగా నశించే వరకూ, మీరు చేద్దామనుకున్న పనులన్నిటిలో యెహోవా శాపాలను, కలవరాన్నీ, నిందనూ మీ మీదికి తెప్పిస్తాడు.
Deuteronomy 31:16 in Telugu 16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.
Joshua 24:20 in Telugu 20 మీరు యెహోవాను విసర్జించి అన్యదేవుళ్ళను సేవిస్తే ఆయన తన మనస్సు తిప్పుకుని మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన మీకు మేలు చేసిన తరువాత మిమ్మల్ని నాశనం చేస్తాడు.”
2 Kings 22:17 in Telugu 17 ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.
2 Chronicles 7:19 in Telugu 19 అయితే మీరు దారి తొలగి, నేను మీకు నియమించిన కట్టడలనూ ఆజ్ఞలనూ విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే,
2 Chronicles 15:2 in Telugu 2 “ఆసా, యూదా ప్రజలారా, బెన్యామీను ప్రజలారా, మీరంతా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైతే ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతాడు.
2 Chronicles 34:25 in Telugu 25 వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’ అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి,
Isaiah 2:8 in Telugu 8 వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది. వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు.
Isaiah 37:19 in Telugu 19 ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు.
Isaiah 44:15 in Telugu 15 అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు. మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు.
Isaiah 65:3 in Telugu 3 తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు. వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు.
Jeremiah 2:13 in Telugu 13 నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.
Jeremiah 2:17 in Telugu 17 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?
Jeremiah 4:12 in Telugu 12 నా మాట చొప్పున అంతకంటే మరింత బలమైన గాలి వీస్తుంది. ఇప్పుడు వారి మీదికి రాబోయే తీర్పులు ప్రకటిస్తాను.”
Jeremiah 4:28 in Telugu 28 దాని విషయం భూమి దుఃఖిస్తుంది. ఆకాశం చీకటి కమ్ముతుంది. నేను నిర్ణయించాను, వెనక్కి తగ్గను. పశ్చాత్తాప పడను, దాన్ని రద్దు చేయను.
Jeremiah 5:9 in Telugu 9 అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.
Jeremiah 5:29 in Telugu 29 అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు.
Jeremiah 7:9 in Telugu 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
Jeremiah 10:8 in Telugu 8 వారంతా బుద్ధి హీనులు, అవివేకులు. చెక్కిన బొమ్మలను పూజించడం వలన వారికి కలిగే జ్ఞానం సున్నా.
Jeremiah 10:15 in Telugu 15 అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.
Jeremiah 11:12 in Telugu 12 యూదా పట్టణాలు, యెరూషలేము ప్రజలు తాము ఎవరికైతే ధూపం వేస్తూ పూజిస్తున్నారో ఆ దేవుళ్ళకు విన్నవించుకుంటారుగానీ వారి ఆపదలో అవి వారిని ఏమాత్రం కాపాడలేవు.
Jeremiah 11:17 in Telugu 17 ఇశ్రాయేలు, యూదా ప్రజలు బయలు దేవతకు ధూపం వేసి నాకు కోపం పుట్టించారు. కాబట్టి మీకై మీరు చేసిన చెడు క్రియలను బట్టి మిమ్మల్ని నాటిన సేనల ప్రభువైన యెహోవా మీపైకి మహా విపత్తును పంపిస్తాడు.”
Jeremiah 15:6 in Telugu 6 నువ్వు నన్ను వదిలేసావు. నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు. కాబట్టి నా చేత్తో నిన్ను కొడతాను. నిన్ను నాశనం చేస్తాను. నీ మీద జాలిపడి విసిగిపోయాను.
Jeremiah 16:11 in Telugu 11 అప్పుడు నువ్వు వారితో ఇలా చెప్పు. “యెహోవా ఈ మాట చెబుతున్నాడు. మీ పూర్వీకులు నన్ను విడిచి వేరే దేవుళ్ళను అనుసరించి పూజించి వాటికి మొక్కారు. వాళ్ళు నన్ను వదిలేసి నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదు.
Jeremiah 17:13 in Telugu 13 యెహోవాయే ఇశ్రాయేలుకు ఆశాభావం. నిన్ను విడిచిపెట్టే వాళ్ళంతా సిగ్గుపాలవుతారు. దేశంలో నీనుంచి దూరమైన వాళ్ళతో సంబంధం తెగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు యెహోవా అనే జీవజలాల ఊటను వదిలేశారు.
Jeremiah 19:4 in Telugu 4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
Jeremiah 44:17 in Telugu 17 మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం.
Jeremiah 51:17 in Telugu 17 జ్ఞానం లేని ప్రతి ఒక్కడూ జంతువులా మారతాడు. లోహంతో పోత పోసి విగ్రహాలు చేసేవాడికి ఆ విగ్రహాల మూలంగానే అవమానం కలుగుతుంది. ఎందుకంటే వాడు పోత పోసి చేసేది మోసపు విగ్రహాలే. వాటిలో ప్రాణం ఉండదు.
Ezekiel 8:9 in Telugu 9 ఆయన తిరిగి నాతో “నువ్వు లోపలికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారో చూడు” అన్నాడు.
Ezekiel 24:14 in Telugu 14 యెహోవానైన నేను ప్రకటించాను. అది జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనుకాడను, కనికరించను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలనుబట్టి నీకు శిక్ష ఉంటుంది. ఇదే యెహోవా వాక్కు.”
Hosea 8:6 in Telugu 6 ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? కంసాలి దాన్ని తయారు చేశాడు. అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది.
Hosea 11:2 in Telugu 2 వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు. విగ్రహాలకు ధూపం వేశారు.
Joel 2:11 in Telugu 11 యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, ఆయన యోధులు చాలా ఎక్కువమంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. దాన్ని ఎవరు వైపుకోగలరు?
Matthew 23:35 in Telugu 35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది.
Acts 7:41 in Telugu 41 ఆ రోజుల్లో వారొక దూడను చేసుకుని ఆ విగ్రహానికి బలి అర్పించి, తమ చేతులతో చేసిన పనిలో ఆనందించారు.