Isaiah 48:1 in Telugu 1 యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.
Other Translations King James Version (KJV) Hear ye this, O house of Jacob, which are called by the name of Israel, and are come forth out of the waters of Judah, which swear by the name of the LORD, and make mention of the God of Israel, but not in truth, nor in righteousness.
American Standard Version (ASV) Hear ye this, O house of Jacob, who are called by the name of Israel, and are come forth out of the waters of Judah; who swear by the name of Jehovah, and make mention of the God of Israel, but not in truth, nor in righteousness.
Bible in Basic English (BBE) Give ear to this, O family of Jacob, you who are named by the name of Israel, and have come out of the body of Judah; who take oaths by the name of the Lord, and make use of the name of the God of Israel, but not truly and not in good faith.
Darby English Bible (DBY) Hear ye this, house of Jacob, who are called by the name of Israel, and are come forth out of the waters of Judah, who swear by the name of Jehovah, and make mention of the God of Israel, not in truth, nor in righteousness.
World English Bible (WEB) Hear you this, house of Jacob, who are called by the name of Israel, and are come forth out of the waters of Judah; who swear by the name of Yahweh, and make mention of the God of Israel, but not in truth, nor in righteousness
Young's Literal Translation (YLT) Hear ye this, O house of Jacob, Who are called by the name of Israel, And from the waters of Judah came out, Who are swearing by the name of Jehovah, And of the God of Israel make mention, Not in truth nor in righteousness.
Cross Reference Genesis 32:28 in Telugu 28 అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.
Genesis 35:10 in Telugu 10 అప్పుడు దేవుడు అతనితో “నీ పేరు యాకోబు. కానీ ఇప్పటినుండి అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు” అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.
Exodus 23:13 in Telugu 13 నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి వెంట రానియ్యకూడదు.
Leviticus 19:12 in Telugu 12 నా నామం పేరిట అబద్ధంగా ఒట్టు పెట్టుకోకూడదు. నీ దేవుని పేరును అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
Numbers 24:7 in Telugu 7 అతడు నీరు తోడుకునే చేదల నుండి నీళ్ళు కారుతాయి. అతడు నాటిన విత్తనానికి సమృద్ధిగా నీళ్ళు అందుతాయి. వారి రాజు అగగు కంటే గొప్పవాడౌతాడు. వారి రాజ్యం ఘనత పొందుతుంది.
Deuteronomy 5:28 in Telugu 28 మీరు నాతో చెప్పిన మాటలు యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలు నీతో చెప్పిన మాటలు నేను విన్నాను. వారు చెప్పినదంతా మంచిదే.
Deuteronomy 6:13 in Telugu 13 మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.
Deuteronomy 10:20 in Telugu 20 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి.
Deuteronomy 33:28 in Telugu 28 ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు ఊట సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
2 Kings 17:34 in Telugu 34 ఈ రోజు వరకూ తమ పూర్వాచారాల ప్రకారం వారు చేస్తున్నారు. ఇశ్రాయేలు అని పేరు పెట్టిన యాకోబు సంతానం, యెహోవా పట్ల భయభక్తులు చూపలేదు. ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు గాని, విధులు గాని, ధర్మశాస్త్రం గాని, ఆజ్ఞల్లో దేనినీ గానీ అనుసరించలేదు.
Psalm 50:16 in Telugu 16 కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
Psalm 63:11 in Telugu 11 అయితే రాజునైన నేను దేవునిలో సంతోషిస్తాను. ఆయన నామంలో ప్రమాణం చేసేవారంతా ఆయన విషయం గర్వపడతారు. అబద్ధాలు చెప్పే వారి నోరు మూతబడుతుంది.
Psalm 66:3 in Telugu 3 నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ మహా శక్తినిబట్టి నీ శత్రువులు నీకు లోబడతారు.
Psalm 68:26 in Telugu 26 సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
Proverbs 5:16 in Telugu 16 నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?
Isaiah 1:10 in Telugu 10 సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి.
Isaiah 26:13 in Telugu 13 మా దేవుడివైన యెహోవా, నువ్వు కాకుండా ఇతర ప్రభువులు మాపై రాజ్యం చేశారు గానీ మేం నీ నామాన్ని మాత్రమే కీర్తిస్తాం.
Isaiah 44:5 in Telugu 5 ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు. మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.”
Isaiah 45:23 in Telugu 23 నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందనీ, ప్రతి నాలుకా ‘యెహోవా తోడు’ అని అంటుందనీ నేను ప్రమాణం చేశాను. నా న్యాయ వాక్కు బయలుదేరింది. అది వ్యర్ధం కాదు.
Isaiah 58:2 in Telugu 2 అయినా వాళ్ళు తమ దేవుని ఆజ్ఞలను వదలని ప్రజలుగా నీతిని అనుసరించే దేశంగా ప్రతిరోజూ నన్ను వెతుకుతూ ఉంటారు. నా విధానాలను తెలుసుకోవడంలో ఆనందిస్తారు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని నన్ను అడుగుతారు. దేవుడు తమకు దగ్గరవ్వాలని ఆశిస్తారు.
Isaiah 62:8 in Telugu 8 తన కుడి చెయ్యి తోడనీ తన బలమైన హస్తం తోడనీ యెహోవా ఇలా ప్రమాణం చేశాడు, “నేను నీ ధాన్యాన్ని నీ శత్రువులకు ఆహారంగా ఇక ఎన్నడూ ఇవ్వను. నువ్వు కష్టపడి తీసిన ద్రాక్షారసాన్ని విదేశీయులు తాగరు.
Isaiah 65:16 in Telugu 16 ప్రపంచానికి దీవెన ప్రకటించేవాణ్ణి, సత్యమై ఉన్న నేనే దీవిస్తాను. భూమి మీద ప్రమాణం చేసేవాడు సత్యమై ఉన్న దేవుడినైన నా తోడని ప్రమాణం చేస్తాడు. ఎందుకంటే మునుపు ఉన్న కష్టాలను మర్చిపోతాడు. అవి నా కంటికి కనబడకుండా పోతాయి.
Jeremiah 4:2 in Telugu 2 యథార్థంగా, నీతి నిజాయితీతో “యెహోవా జీవం తోడు” అని ప్రమాణం చేస్తే, జాతులకు ఆయనలో ఆశీర్వాదం దొరుకుతుంది. వారు ఆయనలోనే అతిశయిస్తారు.
Jeremiah 5:2 in Telugu 2 యెహోవా మీద ఒట్టు అని పలికినప్పటికీ వారు చేసే ప్రమాణం మోసమే.”
Jeremiah 7:9 in Telugu 9 మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు,
Zephaniah 1:5 in Telugu 5 మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.
Malachi 3:5 in Telugu 5 తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేనివారిని బాధపెట్టినవారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.
Matthew 23:13 in Telugu 13 “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.
John 1:47 in Telugu 47 నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు.
John 4:24 in Telugu 24 దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”
Romans 2:17 in Telugu 17 నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా?
Romans 2:28 in Telugu 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు.
Romans 9:6 in Telugu 6 అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
Romans 9:8 in Telugu 8 అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు.
1 Timothy 4:2 in Telugu 2 ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది.
2 Timothy 3:2 in Telugu 2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,
Revelation 2:9 in Telugu 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు.
Revelation 3:9 in Telugu 9 సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను.