Isaiah 47:1 in Telugu 1 బబులోను కన్యా, కిందికి దిగి మట్టిలో కూర్చో. కల్దీయుల కుమారీ, సింహాసనం లేకుండా నేల మీద కూర్చో. నువ్వు సుతిమెత్తని దానివనీ సుకుమారివనీ ప్రజలు ఇక ముందు చెప్పరు.
Other Translations King James Version (KJV) Come down, and sit in the dust, O virgin daughter of Babylon, sit on the ground: there is no throne, O daughter of the Chaldeans: for thou shalt no more be called tender and delicate.
American Standard Version (ASV) Come down, and sit in the dust, O virgin daughter of Babylon; sit on the ground without a throne, O daughter of the Chaldeans: for thou shalt no more be called tender and delicate.
Bible in Basic English (BBE) Come and take your seat in the dust, O virgin daughter of Babylon; come down from your seat of power, and take your place on the earth, O daughter of the Chaldaeans: for you will never again seem soft and delicate.
Darby English Bible (DBY) Come down and sit in the dust, virgin-daughter of Babylon! Sit on the ground, -- [there is] no throne, O daughter of the Chaldeans; for thou shalt no more be called tender and delicate.
World English Bible (WEB) Come down, and sit in the dust, virgin daughter of Babylon; sit on the ground without a throne, daughter of the Chaldeans: for you shall no more be called tender and delicate.
Young's Literal Translation (YLT) Come down, and sit on the dust, O virgin daughter of Babylon, Sit on the earth, there is no throne, O daughter of the Chaldeans, For no more do they cry to thee, `O tender and delicate one.'
Cross Reference Deuteronomy 28:56 in Telugu 56 మీలో మృదువైన, అతి సుకుమారం కలిగిన స్త్రీ, సుకుమారంగా నేల మీద తన అరికాలు మోపలేని స్త్రీ కూడా తన కాళ్లమధ్యనుండి బయటకు వచ్చే పసికందును రహస్యంగా తింటుంది. వాటిలో కొంచెమైనా తనకిష్టమైన సొంత భర్తకూ తన కొడుకూ కూతురుకూ పెట్టదు.
Job 2:8 in Telugu 8 అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు.
Job 2:13 in Telugu 13 అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.
Psalm 18:27 in Telugu 27 బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు!
Psalm 89:44 in Telugu 44 అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
Psalm 137:8 in Telugu 8 నాశనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న బబులోను కుమారీ, నువ్వు మా పట్ల జరిగించిన దుష్ట క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబోయేవాడు ధన్యుడు.
Isaiah 3:26 in Telugu 26 యెరూషలేము గుమ్మాలు శోకించి దుఃఖిస్తాయి. ఆమె ఒంటరిదై నేల మీద కూర్చుంటుంది.
Isaiah 14:13 in Telugu 13 నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను,
Isaiah 23:12 in Telugu 12 ఆయన ఇలా అన్నాడు “పీడన కింద ఉన్న సీదోను కన్యా, నీకిక సంతోషం ఉండదు. నువ్వు కిత్తీముకి తరలి వెళ్ళు. కానీ అక్కడ కూడా నీకు విశ్రాంతి కలగదు.”
Isaiah 26:5 in Telugu 5 అలాగే ఆయన ఉన్నత స్థల నివాసులను, గర్వించే వాళ్ళనూ కిందకు లాగి పడవేస్తాడు. ఎత్తయిన ప్రాకారాలు గల పట్టణాన్ని కూలదోస్తాడు. ఆయన దాన్ని నేలమట్టం చేస్తాడు. దుమ్ముతో ధూళితో కలిపివేస్తాడు.
Isaiah 32:9 in Telugu 9 సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే స్త్రీలారా, లేచి నా మాటలు వినండి. నిశ్చింతగా ఉన్న ఆడపడుచులు, నా మాటలు వినండి.
Isaiah 37:22 in Telugu 22 అతని గూర్చి యెహోవా సెలవిచ్చే మాట ఇదే, “కన్య అయిన సీయోను ఆడపడుచు నిన్ను తిరస్కరించి, అపహసిస్తున్నది, యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
Isaiah 47:7 in Telugu 7 నీవు “నేను ఎల్లకాలం మహారాణిగా ఉంటాను” అనుకుని ఈ విషయాల గురించి ఆలోచించలేదు, వాటి పరిణామం ఎలా ఉంటుందో అని పరిశీలించలేదు.
Isaiah 52:2 in Telugu 2 ధూళి దులుపుకో. యెరూషలేమా, లేచి చక్కగా కూర్చో. బందీ అయిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసుకో.
Jeremiah 13:18 in Telugu 18 రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.”
Jeremiah 46:11 in Telugu 11 కన్య అయిన ఐగుప్తు కుమారీ, గిలాదుకి వెళ్లి ఔషధం తెచ్చుకో. నీ పైన ఎక్కువ ఔషధాలు ఉపయోగించడం వ్యర్ధం. నీకు స్వస్థత కలుగదు.
Jeremiah 48:18 in Telugu 18 దేబోనులో గౌరవపీఠంపై కూర్చున్నదానా, కిందకు దిగి రా. ఎండిన నేలపై కూర్చో. ఎందుకంటే మోయాబును నాశనం చేయబోయే వాడు నీపై దాడి చేస్తున్నాడు. అతడు నీ కోటలను నాశనం చేస్తాడు.
Jeremiah 50:42 in Telugu 42 వాళ్ళు వింటినీ, బల్లేలనూ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు క్రూరులు. వాళ్ళలో కనికరం లేదు. వాళ్ళ స్వరం సముద్రపు ఘోషలా ఉంది. బబులోను కుమారీ, వాళ్ళు యుద్ధ వీరుల్లా బారులు తీరి తమ గుర్రాలపై వస్తున్నారు.
Jeremiah 51:33 in Telugu 33 సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది. ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది.
Lamentations 2:10 in Telugu 10 సీయోను కుమారి పెద్దలు మౌనంగా నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. వాళ్ళ తలల మీద దుమ్ము పోసుకున్నారు. వాళ్ళు గోనెపట్ట కట్టుకున్నారు. యెరూషలేము కన్యలు తల నేలకు దించుకుని ఉన్నారు.
Lamentations 2:21 in Telugu 21 యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.
Lamentations 4:5 in Telugu 5 ఒకప్పుడు రుచికరమైన భోజనం తిన్నవాళ్ళు ఇప్పుడు దిక్కు లేకుండా వీధుల్లో ఆకలితో ఉన్నారు. ఒకప్పుడు ఊదారంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు చెత్తకుప్పలను ఆశ్రయించారు.
Ezekiel 26:16 in Telugu 16 సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.
Ezekiel 28:17 in Telugu 17 నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడుచేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.
Obadiah 1:3 in Telugu 3 నీ హృదయ గర్వం నిన్ను మోసం చేసింది. కొండ సందుల్లో ఎత్తయిన ఇంట్లో నివసించే నువ్వు “నన్నెవడు కింద పడేస్తాడు?” అని నీ మనస్సులో అనుకుంటున్నావు.
Jonah 3:6 in Telugu 6 ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.
Haggai 2:22 in Telugu 22 రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.
Zechariah 2:7 in Telugu 7 సీయోను ప్రజలారా, బబులోను దేశంలో నివసిస్తున్న మీరు అక్కడ నుండి తప్పించుకుని రండి. ఇదే యెహోవా వాక్కు.
Revelation 18:7 in Telugu 7 ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి. ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను” అనుకుంది.