Isaiah 46:13 in Telugu 13 నా నీతిని మీకు దగ్గరగా తెచ్చాను. అది దూరంగా లేదు. నా రక్షణ ఆలస్యం కాదు. సీయోనుకు నా రక్షణ అందిస్తాను. ఇశ్రాయేలుకు నా మహిమను అనుగ్రహిస్తాను.
Other Translations King James Version (KJV) I bring near my righteousness; it shall not be far off, and my salvation shall not tarry: and I will place salvation in Zion for Israel my glory.
American Standard Version (ASV) I bring near my righteousness, it shall not be far off, and my salvation shall not tarry; and I will place salvation in Zion for Israel my glory.
Bible in Basic English (BBE) My righteousness is near, it is not far off; salvation will come quickly; and I will make Zion free, and give Israel my glory.
Darby English Bible (DBY) I bring near my righteousness; it shall not be far off, and my salvation shall not delay; and I will give salvation in Zion, [and] unto Israel my glory.
World English Bible (WEB) I bring near my righteousness, it shall not be far off, and my salvation shall not wait; and I will place salvation in Zion for Israel my glory.
Young's Literal Translation (YLT) I have brought near My righteousness, It is not far off, And My salvation -- it doth not tarry, And I have given in Zion salvation, To Israel My glory!
Cross Reference Psalm 14:7 in Telugu 7 సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది.
Psalm 46:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. అలమోత్ రాగం పై పాడాలి. ఒక గీతం. దేవుడు మన ఆశ్రయం. మన బలం. సమస్యల్లో మన తక్షణ సహాయం.
Psalm 46:5 in Telugu 5 దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు.
Isaiah 12:2 in Telugu 2 చూడు, దేవుడే నా రక్షణ. భయం లేకుండా నేను ఆయన్ని నమ్ముతాను. యెహోవా, అవును, యెహోవాయే నాకు బలం. ఆయనే నా కీర్తన. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.”
Isaiah 28:16 in Telugu 16 దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.
Isaiah 43:7 in Telugu 7 నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.
Isaiah 44:23 in Telugu 23 యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”
Isaiah 51:5 in Telugu 5 నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.
Isaiah 60:21 in Telugu 21 నీ ప్రజలంతా నీతిమంతులుగా ఉంటారు. దేశం ఎప్పటికీ వారి స్వాధీనంలో ఉంటుంది. వారు నా ఘనత కోసం నేను నాటిన కొమ్మ. నేను చేసిన పని.
Isaiah 61:3 in Telugu 3 సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు. నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.
Isaiah 61:11 in Telugu 11 భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.
Isaiah 62:11 in Telugu 11 వినండి. ప్రపంచమంతటికీ యెహోవా తెలియచేశాడు. “సీయోను ఆడపడుచుతో ఇలా చెప్పండి. ఇదిగో, నీ రక్షకుడు వస్తున్నాడు! ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు.”
Jeremiah 33:9 in Telugu 9 నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’”
Joel 3:17 in Telugu 17 మీ యెహోవా దేవుణ్ణి నేనే, నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు.
Habakkuk 2:3 in Telugu 3 ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు. అది ఆలస్యమైనా తప్పక నెరవేరుతుంది. దాని కోసం కనిపెట్టు. అది ఆలస్యం చేయక వస్తుంది.
Haggai 1:8 in Telugu 8 పర్వతాలెక్కి కలప తీసుకు వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించండి. అప్పుడు నేను ఆనందిస్తాను. నాకు ఘనత వస్తుంది” అని యెహోవా అంటున్నాడు.
John 17:10 in Telugu 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది.
Romans 1:17 in Telugu 17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.
Romans 3:21 in Telugu 21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి.
Romans 10:3 in Telugu 3 అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు.
Ephesians 1:6 in Telugu 6 తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
2 Thessalonians 1:12 in Telugu 12 తద్వారా మన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రసాదించే కృప మూలంగా మీలో మన ప్రభువైన యేసు నామం మహిమ పొందుతుంది. మీరు ఆయనలో మహిమ పొందుతారు.
Hebrews 10:37 in Telugu 37 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు.
1 Peter 2:6 in Telugu 6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”