Isaiah 45:24 in Telugu 24 ‘యెహోవాలోనే రక్షణ, బలం ఉన్నాయి’ అని ప్రజలు నా గురించి చెబుతారు.” మనుషులంతా ఆయన దగ్గరకే వస్తారు. ఆయనను వ్యతిరేకించిన వారంతా సిగ్గుపడతారు.
Other Translations King James Version (KJV) Surely, shall one say, in the LORD have I righteousness and strength: even to him shall men come; and all that are incensed against him shall be ashamed.
American Standard Version (ASV) Only in Jehovah, it is said of me, is righteousness and strength; even to him shall men come; and all they that were incensed against him shall be put to shame.
Bible in Basic English (BBE) Only in the Lord will Jacob overcome and be strong: together all those who were angry with him will be put to shame and come to destruction.
Darby English Bible (DBY) Only in Jehovah, shall one say, have I righteousness and strength. To him shall [men] come; and all that are incensed against him shall be ashamed.
World English Bible (WEB) Only in Yahweh, it is said of me, is righteousness and strength; even to him shall men come; and all those who were incensed against him shall be disappointed.
Young's Literal Translation (YLT) Only in Jehovah, said hath one, Have I righteousness and strength, Unto Him he cometh in, And ashamed are all those displeased with Him.
Cross Reference Genesis 49:10 in Telugu 10 షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
Psalm 2:1 in Telugu 1 జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్ధమైన కుట్ర చేస్తున్నాయి?
Psalm 21:8 in Telugu 8 నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది.
Psalm 72:9 in Telugu 9 ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.
Psalm 110:2 in Telugu 2 యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి.
Isaiah 26:4 in Telugu 4 నిత్యమూ యెహోవాపై నమ్మకముంచండి. ఎందుకంటే యెహోవా తానే శాశ్వతమైన ఆధారశిల!
Isaiah 41:11 in Telugu 11 నీ మీద కోపపడే వారంతా సిగ్గుపడి, అవమానం పాలవుతారు. నిన్ను ఎదిరించే వారు కనబడకుండా నశించిపోతారు
Isaiah 44:8 in Telugu 8 మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను.
Isaiah 45:25 in Telugu 25 ఇశ్రాయేలు సంతానం వారంతా యెహోవా వలన నీతిమంతులుగా తీర్పు పొంది అతిశయిస్తారు.
Isaiah 54:17 in Telugu 17 నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.
Isaiah 55:5 in Telugu 5 నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు.
Isaiah 60:9 in Telugu 9 నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి.
Isaiah 61:10 in Telugu 10 పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు. యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణిబట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.
Jeremiah 23:5 in Telugu 5 యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
Jeremiah 33:16 in Telugu 16 ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”
Zechariah 10:6 in Telugu 6 నేను యూదా ప్రజలను బలపరుస్తాను. యోసేపు సంతానానికి రక్షణ కలుగజేసి వారికి నివాసస్థలం ఇస్తాను. నేను వారిపట్ల కనికరం చూపుతాను. నేను వారి ప్రార్థన ఆలకిస్తాను కనుక నేను వాళ్ళను నిరాకరించిన విషయం మరచిపోతారు. నేను వారి దేవుడనైన యెహోవాను,
Zechariah 10:12 in Telugu 12 నేను వాళ్ళను యెహోవా నామం పేరిట బలపరుస్తాను. ఆయన పేరు స్మరించుకుంటూ వారు కొనసాగుతారు. ఇది యెహోవా వాక్కు.
Matthew 11:27 in Telugu 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
Luke 13:17 in Telugu 17 ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
Luke 19:27 in Telugu 27 మరోమాట, ‘నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వారిని వధించండి’ అన్నాడు.”
John 7:37 in Telugu 37 ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి.
John 12:32 in Telugu 32 నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.”
1 Corinthians 1:30 in Telugu 30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు.
2 Corinthians 5:21 in Telugu 21 ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.
2 Corinthians 12:9 in Telugu 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.
Ephesians 3:16 in Telugu 16 ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన
Ephesians 6:10 in Telugu 10 చివరిగా, ప్రభువు మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.
Philippians 4:13 in Telugu 13 నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
Colossians 1:11 in Telugu 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని ప్రతివిధమైన సామర్థ్యం ఇచ్చి బలపరచాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. అదే మీకు సహనాన్నీ, పట్టుదలతో కొనసాగే శక్తినీ కలిగిస్తుంది.
2 Timothy 4:17 in Telugu 17 అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
2 Peter 1:1 in Telugu 1 యేసు క్రీస్తుకు బానిస, అపొస్తలుడు అయిన సీమోను పేతురు, మన దేవుడూ, రక్షకుడూ అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాకు సమానంగా అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవారికి రాస్తున్న సంగతులు.
Revelation 11:18 in Telugu 18 జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది” అన్నారు.
Revelation 22:17 in Telugu 17 “రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.”