Isaiah 44:25 in Telugu 25 నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి. సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే.
Other Translations King James Version (KJV) That frustrateth the tokens of the liars, and maketh diviners mad; that turneth wise men backward, and maketh their knowledge foolish;
American Standard Version (ASV) that frustrateth the signs of the liars, and maketh diviners mad; that turneth wise men backward, and maketh their knowledge foolish;
Bible in Basic English (BBE) Who makes the signs of those who give word of the future come to nothing, so that those who have knowledge of secret arts go off their heads; turning the wise men back, and making their knowledge foolish:
Darby English Bible (DBY) -- he that frustrateth the tokens of the liars, and maketh diviners mad; that turneth wise men backward, and maketh their knowledge foolish;
World English Bible (WEB) who frustrates the signs of the liars, and makes diviners mad; who turns wise men backward, and makes their knowledge foolish;
Young's Literal Translation (YLT) Making void the tokens of devisers, And diviners it maketh mad, Turning the wise backward, And their knowledge it maketh foolish.
Cross Reference Exodus 9:11 in Telugu 11 ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి.
2 Samuel 15:31 in Telugu 31 అంతలో ఒకడు వచ్చి “అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలుకు కూడా పాత్ర ఉంది” అని దావీదుకు చెప్పాడు. అప్పుడు దావీదు “యెహోవా, అహీతోపెలు పథకాలను చెడగొట్టు” అని ప్రార్థన చేశాడు.
2 Samuel 16:23 in Telugu 23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా ఆలోచన చెప్పితే అది దేవుని దగ్గర విచారణ చేయగా వచ్చినట్టుగా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలాగే భావించేవారు.
2 Samuel 17:23 in Telugu 23 అహీతోపెలు తాను చెప్పిన పథకం అమలు కాకపోవడం చూసి, గాడిదకు గంతలు కట్టి ఎక్కి తన ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్లి, ఇంటి విషయాలు చక్కబెట్టి ఉరి వేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అతన్ని పాతిపెట్టారు.
1 Kings 22:11 in Telugu 11 కెనయనా కొడుకు సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే వీటితో నీవు సిరియా వారిని పొడిచి నిర్మూలిస్తావు” అన్నాడు.
1 Kings 22:22 in Telugu 22 అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు.
1 Kings 22:37 in Telugu 37 ఆ విధంగా రాజు చనిపోయాడు. వాళ్ళు అతన్ని సమరయకు తీసుకు వచ్చారు. అతణ్ణి సమరయలో పాతిపెట్టారు.
2 Chronicles 18:11 in Telugu 11 ప్రవక్తలంతా ఆ విధంగానే ప్రవచిస్తూ “యెహోవా రామోతు గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దాని మీదికి వెళ్ళి జయం పొందు” అన్నారు.
2 Chronicles 18:34 in Telugu 34 ఆ రోజున యుద్ధం తీవ్రంగా జరిగింది. అయినా ఇశ్రాయేలు రాజు సూర్యాస్తమయం వరకూ సిరియా సైన్యానికి ఎదురుగా తన రథంలో ఆనుకుని నిలబడ్డాడు. పొద్దుగుంకే వేళకి అతడు చనిపోయాడు.
Job 5:12 in Telugu 12 వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
Psalm 33:10 in Telugu 10 దేశాల మధ్య మైత్రిని యెహోవా నిష్ఫలం చేస్తాడు. జనాల ప్రణాళికలను ఆయన రద్దు చేస్తాడు.
Isaiah 19:11 in Telugu 11 సోయను అధిపతులు బొత్తిగా మూర్ఖులు. ఫరో దగ్గర ఉన్న సలహాదారుల్లో అందరికన్నా జ్ఞాని అయిన వాడు ఇచ్చిన సలహా మతిలేనిదిగా కన్పిస్తుంది. ఫరోతో “నేను జ్ఞాని కొడుకును. నేను పూర్వ కాలంలోని రాజుల సంతతి వాణ్ణి” అని నువ్వు ఎలా చెప్తావు?
Isaiah 29:14 in Telugu 14 కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను. అద్భుతం వెనుక అద్భుతాన్ని చేస్తాను. వారి జ్ఞానుల జ్ఞానం నశించిపోతుంది. వివేకుల వివేకం అదృశ్యమై పోతుంది.”
Isaiah 47:12 in Telugu 12 నీవు నిలబడి చిన్నతనం నుండి నువ్వు ఎంతో ప్రయాసతో నేర్చుకున్న నీ కర్ణపిశాచ తంత్రాలను, విస్తారమైన నీ శకునాలను ప్రయోగించు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరం అవుతాయేమో, వాటితో ఒకవేళ నువ్వు మనుషులను బెదరించగలవేమో.
Jeremiah 27:9 in Telugu 9 కాబట్టి ‘మీరు బబులోను రాజుకు సేవ చేయవద్దు’ అని మీ ప్రవక్తలూ సోదెగాళ్ళూ, కలల అర్థం చెప్పేవాళ్ళూ, శకునాలు చూసేవాళ్ళూ, మాంత్రికులూ చెబుతుంటే వినొద్దు.
Jeremiah 28:9 in Telugu 9 అయితే క్షేమం కలుగుతుందని ప్రకటించే ప్రవక్త మాట నెరవేరితే అతన్ని నిజంగా యెహోవాయే పంపాడని తెలుసుకోవచ్చు,” అని యిర్మీయా ప్రవక్త చెప్పాడు.
Jeremiah 49:7 in Telugu 7 ఏదోమును గూర్చి సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “తేమానులో జ్ఞానమనేదే లేదా? అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర ఒక మంచి సలహా లేకుండా పోయిందా? వాళ్ళ జ్ఞానమంతా వెళ్లిపోయిందా?
Jeremiah 50:36 in Telugu 36 తమను తాము మూర్ఖుల్లా కనపరచుకోడానికి వాళ్ళలో జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి విరోధంగా ఒక కత్తి వస్తూ ఉంది. సైనికులు భయకంపితులు అయ్యేలా ఒక కత్తి వాళ్ళకు విరోధంగా వస్తూ ఉంది.
Jeremiah 51:57 in Telugu 57 బబులోను అధిపతులూ, ఆమె జ్ఞానులూ, ఆమె అధికారులూ, ఆమె సైనికులూ మద్యం తాగి మత్తెక్కేలా చేస్తాను. వాళ్ళు శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. ఇక లేవరు.” ఇది రాజు చేస్తున్న ప్రకటన. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
Daniel 1:20 in Telugu 20 రాజు వీళ్ళతో సంభాషించి వీళ్ళ తెలివితేటలు పరీక్షించాడు. జ్ఞానం, వివేకం ప్రదర్శించే ప్రతి విషయంలో ఈ యువకులు తన రాజ్యమంతటిలో ఉన్న మాంత్రికుల కంటే, ఆత్మలను సంప్రదిస్తామని చెప్పుకునే వారి కంటే పది రెట్లు సమర్థులని రాజు గ్రహించాడు.
Daniel 2:10 in Telugu 10 అప్పుడు జోతిష్యులు ఇలా జవాబిచ్చారు. “రాజు అడిగిన విషయం చెప్పగలిగినవాడు భూమి మీద ఎవ్వడూ లేడు. ఇంతవరకూ ఏ చక్రవర్తి, ఏ రాజూ, ఏ పరిపాలకుడూ ఇలాంటి విషయం చెప్పమని ఏ జోతిష్యుడినీ, మాంత్రికుడినీ, శకునజ్ఞుడినీ కోరలేదు.
Daniel 4:7 in Telugu 7 శకునాలు చెప్పేవాళ్ళు, గారడీవిద్యలు చేసేవాళ్ళు, మాంత్రికులు, జ్యోతిష్యులు నా సమక్షానికి వచ్చినప్పుడు నాకు వచ్చిన కల గురించి వాళ్లకు చెప్పాను కానీ ఎవ్వరూ దానికి అర్థం చెప్పలేకపోయారు.
Daniel 5:6 in Telugu 6 ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.
1 Corinthians 1:20 in Telugu 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా?
1 Corinthians 3:19 in Telugu 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ,