Isaiah 31:2 in Telugu 2 అయినా ఆయన జ్ఞాని. ఆయన నాశనాన్ని పంపిస్తాడు. తన మాటలను ఆయన వెనక్కి తీసుకోడు. దుర్మార్గుల ఇంటి మీదికీ, పాపులకు సహాయం చేసే వాళ్ళ మీదికీ ఆయన లేస్తాడు.
Other Translations King James Version (KJV) Yet he also is wise, and will bring evil, and will not call back his words: but will arise against the house of the evildoers, and against the help of them that work iniquity.
American Standard Version (ASV) Yet he also is wise, and will bring evil, and will not call back his words, but will arise against the house of the evil-doers, and against the help of them that work iniquity.
Bible in Basic English (BBE) Though he is wise, and able to send evil, and his purpose will not be changed; but he will go against the house of the evil-doers, and against those to whom they are looking for help.
Darby English Bible (DBY) But he also is wise, and he bringeth evil, and recalleth not his words; and he will arise against the house of evildoers, and against the help of workers of iniquity.
World English Bible (WEB) Yet he also is wise, and will bring evil, and will not call back his words, but will arise against the house of the evil-doers, and against the help of those who work iniquity.
Young's Literal Translation (YLT) And He also `is' wise, and bringeth in evil, And His words He hath not turned aside, And He hath risen against a house of evil doers, And against the help of workers of iniquity.
Cross Reference Numbers 10:35 in Telugu 35 నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే “యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు” అనేవాడు.
Numbers 23:19 in Telugu 19 అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు. మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
Joshua 23:15 in Telugu 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు.
1 Samuel 2:3 in Telugu 3 యెహోవా దేవుని జ్ఞానం అనంతమైంది. మన కార్యాలను పరిశీలించేవాడు ఆయనే. కాబట్టి ఇకపై ఎవరూ గర్వంగా మాట్లాడవద్దు. అహంకారమైన మాటలు మీ నోటనుంచి రానియ్యవద్దు.
Job 5:13 in Telugu 13 దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
Psalm 12:5 in Telugu 5 పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.
Psalm 68:1 in Telugu 1 ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
Psalm 78:65 in Telugu 65 అప్పుడు నిద్ర నుండి మేల్కొన్న వ్యక్తిలాగా, ద్రాక్షరసం తాగి కేకపెట్టే యోధుడిలాగా ప్రభువు లేచాడు.
Isaiah 20:4 in Telugu 4 అలాగే అష్షూరు రాజు బందీలుగా ఉన్న ఐగుప్తు ప్రజలనూ, ప్రవాసులైన ఇతియోపియా ప్రజలనూ వాళ్ళలో పిల్లలనూ, పెద్దలనూ దిగంబరులుగా చేసి పాదరక్షలు లేకుండా తీసుకు వెళ్తాడు. ఐగుప్తు ప్రజలకు అవమానం కలిగేలా వాళ్ళ పిరుదులపై బట్టలు లేకుండా చేసి తీసుకుపోతాడు.
Isaiah 22:14 in Telugu 14 ఈ సంగతి సేనల ప్రభువైన యెహోవా నా చెవుల్లో తెలియజేశాడు. “మీరు చేసిన ఈ దోషానికి క్షమాపణ లేదు. మీరు చనిపోయేటప్పుడైనా సరే” ఇది సేనల ప్రభువైన యెహోవా మాట.
Isaiah 28:21 in Telugu 21 యెహోవా తన పనిని జరిగించడానికి, ఆశ్చర్యకరమైన తన పనిని చేయడానికి, విచిత్రమైన తన పనిని జరిగించడానికి పెరాజీము పర్వతం పైన లేచినట్టుగా లేస్తాడు. గిబియోను లోయలో ఆయన తనను తాను రెచ్చగొట్టుకున్నట్టుగా లేస్తాడు.
Isaiah 30:3 in Telugu 3 కాబట్టి ఫరో సంరక్షణ మీకు అవమానంగా ఉంటుంది. ఐగుప్తు నీడలో ఆశ్రయం మీకు సిగ్గుగా ఉంటుంది.
Isaiah 30:13 in Telugu 13 కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.
Isaiah 31:3 in Telugu 3 ఐగుప్తు వాడు మనిషే. దేవుడు కాదు. వాళ్ళ గుర్రాలు రక్త మాంసాలే, ఆత్మ కాదు. యెహోవా తన చేతిని చాపినప్పుడు సహాయం చేసిన వాడూ, సహాయం పొందినవాడూ, ఇద్దరూ పతనమవుతారు. ఇద్దరూ నాశనం అవుతారు.”
Isaiah 32:6 in Telugu 6 మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడతాడు. అతడి హృదయం దుర్మార్గం గూర్చీ, దైవరహితమైన పనులను గూర్చీ ఆలోచిస్తుంది. అతడు యెహోవాను గూర్చి తప్పుగా మాట్లాడతాడు. అతడు ఆకలితో ఉన్నవాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు. దాహంతో ఉన్నవాళ్ళకి నీళ్ళు లేకుండా చేస్తాడు.
Isaiah 45:7 in Telugu 7 వెలుగును సృజించే వాణ్ణీ చీకటిని కలిగించే వాణ్ణీ నేనే. శాంతినీ, విపత్తులనూ కలిగించే వాణ్ణి నేనే. యెహోవా అనే నేనే వీటన్నిటినీ కలిగిస్తాను.
Isaiah 63:4 in Telugu 4 పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.
Jeremiah 10:7 in Telugu 7 లోక జాతులకు రాజువైన నీకు భయపడని వాడెవడు? ఆయా రాజ్యాల ప్రజల్లోని జ్ఞానులందరిలో నీవంటి వాడెవడూ లేడు. కాబట్టి మనుషులు నీలో భయభక్తులు నిలపాలి.
Jeremiah 10:12 in Telugu 12 ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.
Jeremiah 36:32 in Telugu 32 కాబట్టి యిర్మీయా ఇంకొక పుస్తకం చుట్టను తీసుకుని లేఖికుడైన నేరియా కొడుకు బారూకు చేతికి ఇచ్చినప్పుడు, అతడు యిర్మీయా నోటితో చెప్పిన మాటలనుబట్టి యూదా రాజైన యెహోయాకీము తగలబెట్టిన పుస్తకం చుట్టలోని మాటలన్నీ మళ్ళీ రాశాడు. ఆ మాటలే కాకుండా, అలాంటివి ఇంకా ఎన్నో మాటలు వాటికి జోడించి రాశాడు.
Jeremiah 44:29 in Telugu 29 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. ‘నా మాట మీకు విరోధంగా మీ పైకి ఘోర విపత్తును తీసుకు వస్తుంది. దానికి ఇది మీకు ఒక సూచనగా ఉంటుంది.’
Ezekiel 29:6 in Telugu 6 అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు. ఐగుప్తు, ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది.
Amos 3:6 in Telugu 6 పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?
Zephaniah 3:8 in Telugu 8 కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే, “నా కోసం ఎదురు చూడండి. నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి, అన్యజనులను పోగు చేయడానికి, గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి, నేను నిశ్చయించుకున్నాను. నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది.
Zechariah 1:6 in Telugu 6 అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”
Matthew 24:35 in Telugu 35 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
Romans 16:27 in Telugu 27 ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి, యేసు క్రీస్తు ద్వారా నిరంతరం మహిమ కలుగు గాక. ఆమేన్.
1 Corinthians 1:21 in Telugu 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.
Jude 1:25 in Telugu 25 ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.