Isaiah 30:10 in Telugu 10 దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి.
Other Translations King James Version (KJV) Which say to the seers, See not; and to the prophets, Prophesy not unto us right things, speak unto us smooth things, prophesy deceits:
American Standard Version (ASV) that say to the seers, See not; and to the prophets, Prophesy not unto us right things, speak unto us smooth things, prophesy deceits,
Bible in Basic English (BBE) Who say to the seers, See not; and to the prophets, Do not give us word of what is true, but say false things to give us pleasure:
Darby English Bible (DBY) who say to the seers, See not; and to the prophets, Prophesy not unto us right things; speak unto us smooth things, prophesy deceits;
World English Bible (WEB) who tell the seers, "Don't see;" and to the prophets, "Don't prophesy to us right things, speak to us smooth things, prophesy deceits,
Young's Literal Translation (YLT) Who have said to seers, `Ye do not see,' And to prophets, `Ye do not prophesy to us Straightforward things, Speak to us smooth things, prophesy deceits,
Cross Reference 1 Kings 21:20 in Telugu 20 అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు.
1 Kings 22:8 in Telugu 8 అందుకు ఇశ్రాయేలు రాజు “ఇమ్లా కొడుకు మీకాయా అనే ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా దగ్గర సలహా తీసుకోవచ్చు గాని అతడు ఎప్పుడూ నాకు మంచి జరుగుతుందని ప్రవచించకుండా కేవలం చెడు జరుగుతుందననే ప్రవచిస్తాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం” అని యెహోషాపాతుతో అన్నాడు. అయితే యెహోషాపాతు “రాజైన మీరు అలా అనొద్దు” అన్నాడు.
1 Kings 22:27 in Telugu 27 వాళ్ళతో ఇలా చెప్పండి రాజు ఇలా అంటున్నాడు. ఇతన్ని చెరసాలలో ఉంచి మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకూ అతనికి కేవలం కొద్దిగా రొట్టె, కొంచెం మంచినీళ్లు ఇవ్వండి.”
2 Chronicles 16:10 in Telugu 10 ఆ దీర్ఘదర్శి చేసిన ఈ ప్రకటనకి ఆసా అతని మీద కోపగించి ఆగ్రహంతో అతణ్ణి ఖైదులో వేశాడు. అదే సమయంలో ఆసా ప్రజల్లో కొంతమందిని బాధపరిచాడు కూడా.
2 Chronicles 18:7 in Telugu 7 అందుకు ఇశ్రాయేలు రాజు “యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఇమ్లా కొడుకు మీకాయా అనేవాడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నా గురించి మంచి ప్రవచించడు. ఎప్పుడూ కీడునే ప్రవచిస్తున్నాడు కాబట్టి అతడంటే నాకు కోపం” అన్నాడు. యెహోషాపాతు రాజు “రాజైన మీరు అలా అనవద్దు” అన్నాడు.
2 Chronicles 24:19 in Telugu 19 అయినా తన వైపు వారిని మళ్లించడానికి యెహోవా వారి దగ్గరికి ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తలు వారికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికారు గానీ ప్రజలు వారి మాట వినలేదు.
2 Chronicles 25:16 in Telugu 16 అతడు అమజ్యాతో మాటలాడుతుంటే, రాజు అతనితో “మేము నిన్ను రాజుకు సలహాదారునిగా చేశామా? ఆగు. ప్రాణాల మీదికి ఎందుకు తెచ్చుకుంటావు?” అన్నాడు. ఆ ప్రవక్త ఆగి “దేవుడు నిన్ను నాశనం చేయడానికి నిర్ణయించాడు. ఎందుకంటే నీవు నా సలహా పాటించ లేదు” అన్నాడు.
Jeremiah 5:31 in Telugu 31 ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు చెబుతారు. యాజకులు తమ స్వంత అధికారాన్ని చెలాయిస్తారు. అలా జరగడం నా ప్రజలకు కూడా ఇష్టమే. అయితే దాని అంతంలో జరగబోయే దానికి వారేం చేస్తారు?
Jeremiah 6:13 in Telugu 13 “వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే.
Jeremiah 8:10 in Telugu 10 కాబట్టి వారి భార్యలను అన్యులకు అప్పగిస్తాను. వారి పొలాలు ఇతరుల స్వాధీనం చేస్తాను. చిన్నలు, పెద్దలు, అందరూ విపరీతమైన దురాశాపరులు. ప్రవక్తలు, యాజకులు, అంతా నయవంచకులు.
Jeremiah 11:21 in Telugu 21 “నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,
Jeremiah 23:17 in Telugu 17 “మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు” అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. “మీ మీదికి ఏ కీడూ రాదు” అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు.
Jeremiah 23:26 in Telugu 26 ఎంతకాలం ఇలా జరగాలి? ప్రవక్తలు తమ మనస్సులో నుంచి అబద్ధాలు ప్రవచిస్తున్నారు. తమ హృదయాల్లోని మోసంతో ప్రవచిస్తున్నారు.
Jeremiah 26:11 in Telugu 11 యాజకులతో, ప్రవక్తలతో, అధిపతులతో, ప్రజలందరితో వాళ్ళు ఇలా అన్నారు. “మీరు చెవులారా విన్నట్టుగా ఈ వ్యక్తి ఈ పట్టణానికి వ్యతిరేకంగా ప్రకటిస్తున్నాడు, కాబట్టి ఇతడు చావడం సమంజసమే.”
Jeremiah 26:20 in Telugu 20 కిర్యత్యారీము వాసి షెమయా కొడుకు ఊరియా అనే ఒకడు యెహోవా పేరున ప్రవచిస్తూ ఉండేవాడు. అతడు యిర్మీయా చెప్పిన మాటల్లాగే ఈ పట్టణానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా ప్రవచించాడు.
Jeremiah 29:27 in Telugu 27 ‘కాబట్టి ఇప్పుడు, నీకు ప్రత్యర్ధిగా, తనను తాను ప్రవక్తగా చేసుకున్న అనాతోతీయుడైన యిర్మీయాను నువ్వెందుకు చీవాట్లు పెట్టలేదు?
Jeremiah 38:4 in Telugu 4 ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి” అన్నారు.
Ezekiel 13:7 in Telugu 7 నేను అసలేమీ మాట్లాడకుండానే ‘యెహోవా చెప్పేది ఇదీ, అదీ’ అంటూ చెప్పే మీరు అబద్ధపు దర్శనాలు చూడలేదా? అబద్ధపు జోస్యాలు చెప్పలేదా?
Ezekiel 13:18 in Telugu 18 ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ప్రజలను ఉచ్చులోకి లాగేందుకు తమ చేతుల నిండా తాయెత్తులు కట్టుకుని తమ తలలపై రకరకాల ముసుగులు వేసుకునే స్త్రీలకు బాధ. నా ప్రజల ప్రాణాలను ఉచ్చులోకి లాగుతూ మీ ప్రాణాలను కాపాడుకోగలరా?
Amos 2:12 in Telugu 12 “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.
Amos 7:13 in Telugu 13 బేతేలులో ఇంక ఎంత మాత్రం ప్రవచించవద్దు. రాజు నివసించే స్థలం, రాజభవనం ఇక్కడ ఉన్నాయి.”
Micah 2:6 in Telugu 6 “ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు. అవమానం రాకూడదు” అని వారంటారు.
Micah 2:11 in Telugu 11 పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి, “ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే, వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు.
John 7:7 in Telugu 7 లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది.
John 8:45 in Telugu 45 నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు.
Acts 4:17 in Telugu 17 అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.
Acts 5:28 in Telugu 28 ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
Romans 16:18 in Telugu 18 అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.
Galatians 4:16 in Telugu 16 నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
1 Thessalonians 2:15 in Telugu 15 వారు ప్రభువైన యేసునూ ప్రవక్తలనూ చంపారు. మమ్మల్ని తరిమివేశారు. వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మనుషులందరికీ విరోధులు.
Revelation 11:7 in Telugu 7 వారు తమ సాక్షాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది.