Isaiah 27:13 in Telugu 13 ఆ రోజున పెద్ద బాకా ధ్వని వినిపిస్తుంది. అష్షూరు దేశంలో అంతరిస్తున్న వాళ్ళూ, ఐగుప్తులో బహిష్కరణకి గురైన వాళ్ళూ తిరిగి వస్తారు. యెరూషలేములో ఉన్న పవిత్ర పర్వతంపై ఉన్న యెహోవాను ఆరాధిస్తారు.
Other Translations King James Version (KJV) And it shall come to pass in that day, that the great trumpet shall be blown, and they shall come which were ready to perish in the land of Assyria, and the outcasts in the land of Egypt, and shall worship the LORD in the holy mount at Jerusalem.
American Standard Version (ASV) And it shall come to pass in that day, that a great trumpet shall be blown; and they shall come that were ready to perish in the land of Assyria, and they that were outcasts in the land of Egypt; and they shall worship Jehovah in the holy mountain at Jerusalem.
Bible in Basic English (BBE) And it will be in that day that a great horn will be sounded; and those who were wandering in the land of Assyria, and those who had been sent away into the land of Egypt, will come; and they will give worship to the Lord in the holy mountain at Jerusalem.
Darby English Bible (DBY) And it shall come to pass in that day, [that] the great trumpet shall be blown; and they shall come that were perishing in the land of Assyria, and the outcasts in the land of Egypt, and they shall worship Jehovah in the holy mountain at Jerusalem.
World English Bible (WEB) It shall happen in that day, that a great trumpet shall be blown; and they shall come who were ready to perish in the land of Assyria, and those who were outcasts in the land of Egypt; and they shall worship Yahweh in the holy mountain at Jerusalem.
Young's Literal Translation (YLT) And it hath come to pass, in that day, It is blown with a great trumpet, And come in have those perishing in the land of Asshur, And those cast out in the land of Egypt, And have bowed themselves to Jehovah, In the holy mount -- in Jerusalem!
Cross Reference Leviticus 25:9 in Telugu 9 ఏడో నెల పదవ రోజు మీ దేశమంతటా కొమ్ము బూర ఊదాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఆ బూర ఊదాలి.
Numbers 10:2 in Telugu 2 “రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.
2 Kings 17:6 in Telugu 6 హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.
1 Chronicles 15:24 in Telugu 24 షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.
Psalm 47:5 in Telugu 5 దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.
Psalm 81:3 in Telugu 3 అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి.
Psalm 89:15 in Telugu 15 నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.
Isaiah 2:3 in Telugu 3 అనేక మంది వచ్చి ఇలా అంటారు. “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు, ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా, యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.” ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.
Isaiah 2:11 in Telugu 11 మానవుని అహంకారదృష్టిని ఆయన తగ్గించేస్తాడు. మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.
Isaiah 11:12 in Telugu 12 జాతులను పోగు చెయ్యడానికి ఆయన ఒక ధ్వజం నిలబెట్టి, బహిష్కరణకు గురైన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాడు. చెదిరి పోయిన యూదా వాళ్ళను భూమి నలుదిక్కుల నుంచి సమకూరుస్తాడు.
Isaiah 11:16 in Telugu 16 ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది.
Isaiah 16:3 in Telugu 3 “ఆలోచన చెప్పు. న్యాయం అమలు చెయ్యి. చీకటి కమ్మినట్టు మధ్యాహ్నం పూట నీ నీడ మా మీద ఉండనివ్వు. పలాయనంలో ఉన్నవాళ్ళను దాచి పెట్టు. పారిపోయిన వాళ్ళను పట్టిచ్చి ద్రోహం చెయ్యకు.
Isaiah 18:3 in Telugu 3 ప్రపంచంలో నివసించే మీరు, భూమిపైన జీవించే మీరు పర్వతాల పైన సంకేతంగా జెండా ఎత్తినప్పుడు చూడండి! బాకా ఊదినప్పుడు వినండి!
Isaiah 19:21 in Telugu 21 ఐగుప్తు ప్రజలకు యెహోవా తనను తెలియపరచుకుంటాడు. ఆ రోజున ఐగుప్తు ప్రజలు యెహోవాను తెలుసుకుంటారు. వాళ్ళు ఆయనను బలులతో, కానుకలతో ఆరాధిస్తారు. యెహోవాకు మొక్కుకుని ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తారు.
Isaiah 19:23 in Telugu 23 ఆ రోజున ఐగుప్తు దేశం నుండి అష్షూరు దేశానికి ఒక రాజ మార్గం ఉంటుంది. అష్షూరు ప్రజలు ఐగుప్తుకీ, ఐగుప్తు ప్రజలు అష్షూరుకీ వస్తూ పోతూ ఉంటారు. ఐగుప్తు ప్రజలు అష్షూరు ప్రజలతో కలసి యెహోవాను ఆరాధిస్తారు.
Isaiah 25:6 in Telugu 6 ఈ పర్వతంపై సేనల ప్రభువు యెహోవా ప్రజలందరి కోసం కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేస్తాడు. మూలుగు ఉన్న కొవ్విన వాటితో విందు చేస్తాడు. మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేస్తాడు.
Isaiah 56:8 in Telugu 8 ఇశ్రాయేలీయుల్లో వెలివేయబడిన వారిని సమకూర్చే ప్రభువైన యెహోవా వాక్కు ఇదే, “నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారు కాక ఇతరులను కూడా వారి దగ్గరికి చేరుస్తాను.”
Isaiah 66:18 in Telugu 18 వాళ్ళ పనులూ వాళ్ళ ఆలోచనలూ నాకు తెలుసు. అన్ని తెగలనూ వివిధ భాషలు మాట్లాడే వారినీ ఒక చోట చేర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా ఘనత చూస్తారు.
Jeremiah 43:7 in Telugu 7 వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు.
Jeremiah 44:28 in Telugu 28 కత్తిని తప్పించుకున్న కొద్దిమంది ఐగుప్తు నుండి యూదా దేశానికి తిరిగి వస్తారు. కాబట్టి యూదాలో మిగిలిన వాళ్లకు ఎవరి మాట నిజమైనదో, నాదో, వారిదో అప్పడు తెలుసుకుంటారు.
Hosea 8:13 in Telugu 13 నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే, వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాటి బలులను నేను, అంటే యెహోవాను అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది.
Hosea 9:3 in Telugu 3 వారు యెహోవా దేశంలో కొనసాగరు. ఎఫ్రాయిమీయులు ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతారు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తింటారు.
Hosea 11:11 in Telugu 11 వారు వణకుతూ పక్షులు ఎగిరి వచ్చినట్టు ఐగుప్తు దేశంలో నుండి వస్తారు. గువ్వల్లాగా అష్షూరు దేశంలోనుండి ఎగిరి వస్తారు. నేను వారిని వారి నివాసాల్లో కాపురముంచుతాను.” ఇదే యెహోవా వాక్కు.
Zechariah 9:13 in Telugu 13 యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.
Zechariah 10:8 in Telugu 8 నేను వారిని విమోచించాను కనుక ఈల వేసి పిలిచి వాళ్ళను సమకూరుస్తాను. ఇంతకు ముందు విస్తరించినట్టు వాళ్ళు అభివృద్ది చెందుతారు.
Zechariah 14:16 in Telugu 16 యెరూషలేము మీదికి వచ్చిన ఇతర దేశాల ప్రజల్లో నాశనం కాకుండా మిగిలిన వారందరూ సేనల ప్రభువు యెహోవా అనే రాజుకు మొక్కుబడులు చెల్లించడానికీ, పర్ణశాల పండగ ఆచరించడానికీ ఏటేటా యెరూషలేముకు వస్తారు.
Malachi 1:11 in Telugu 11 తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.
Matthew 24:31 in Telugu 31 ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.
Luke 4:18 in Telugu 18 “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు వస్తుందని ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ,
John 4:21 in Telugu 21 “అమ్మా, తండ్రిని ఈ కొండ మీదో, యెరూషలేములోనో ఆరాధించని కాలం వస్తుంది. నా మాట నమ్ము.
Romans 10:18 in Telugu 18 అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరం భూలోకమంతటిలోకీ, వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.”
1 Thessalonians 4:16 in Telugu 16 ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.
Hebrews 12:22 in Telugu 22 ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
Revelation 8:2 in Telugu 2 అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు.
Revelation 8:6 in Telugu 6 అప్పుడు ఏడు బాకాలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.
Revelation 9:14 in Telugu 14 ఆ స్వరం “మహా నది యూఫ్రటీసు దగ్గర బంధించిన నలుగురు దూతలను విడిచి పెట్టు” అని బాకా పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పడం విన్నాను.
Revelation 10:7 in Telugu 7 ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.”
Revelation 11:15 in Telugu 15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”