Isaiah 26:19 in Telugu 19 మరణమైన నీ వారు బతుకుతారు. మా వారి మృత దేహాలు తిరిగి సజీవంగా లేస్తాయి. మట్టిలో పడి ఉన్న వారు మేల్కొని ఆనందంగా పాడండి! ఉదయంలో కురిసే మంచులా నీ కాంతి ప్రకాశమానమై కురిసినప్పుడు భూమి తాను ఎరగా పట్టుకున్న తనలోని విగత జీవులను సజీవంగా అప్పగిస్తుంది.
Other Translations King James Version (KJV) Thy dead men shall live, together with my dead body shall they arise. Awake and sing, ye that dwell in dust: for thy dew is as the dew of herbs, and the earth shall cast out the dead.
American Standard Version (ASV) Thy dead shall live; my dead bodies shall arise. Awake and sing, ye that dwell in the dust; for thy dew is `as' the dew of herbs, and the earth shall cast forth the dead.
Bible in Basic English (BBE) Your dead will come back; their dead bodies will come to life again. Those in the dust, awaking from their sleep, will send out a song; for your dew is a dew of light, and the earth will give birth to the shades.
Darby English Bible (DBY) Thy dead shall live, my dead bodies shall arise. Awake and sing in triumph, ye that dwell in dust; for thy dew is the dew of the morning, and the earth shall cast forth the dead.
World English Bible (WEB) Your dead shall live; my dead bodies shall arise. Awake and sing, you who dwell in the dust; for your dew is [as] the dew of herbs, and the earth shall cast forth the dead.
Young's Literal Translation (YLT) `Thy dead live -- My dead body they rise. Awake and sing, ye dwellers in the dust, For the dew of herbs `is' thy dew, And the land of Rephaim thou causest to fall.
Cross Reference Genesis 2:5 in Telugu 5 భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు.
Deuteronomy 32:2 in Telugu 2 నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి.
Deuteronomy 33:13 in Telugu 13 యోసేపు గురించి మోషే ఇలా పలికాడు. యెహోవా అతని భూమిని దీవిస్తాడు ఆకాశం నుంచి వచ్చే శ్రేష్ఠమైన మంచుతో, కింద ఉన్న జలాగాధంతో,
Deuteronomy 33:28 in Telugu 28 ఇశ్రాయేలు ప్రజలు భద్రంగా నివసిస్తారు. యాకోబు ఊట సురక్షితం. ధాన్యం, కొత్త ద్రాక్షారసాలున్న దేశంలో అతనిపై ఆకాశం నిజంగా మంచు కురుస్తుంది.
Job 29:19 in Telugu 19 నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది.
Psalm 22:15 in Telugu 15 నా బలం చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు.
Psalm 71:20 in Telugu 20 ఎన్నో కఠిన బాధలు మాకు కలిగేలా చేసిన దేవా, నువ్వు మమ్మల్ని మళ్ళీ జీవించేలా చేస్తావు. అగాధ లోయల్లో నుండి మళ్ళీ మమ్మల్ని లేవనెత్తుతావు.
Psalm 110:3 in Telugu 3 నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది.
Isaiah 25:8 in Telugu 8 మరెన్నడు ఉండకుండా మరణాన్ని ఆయన మింగి వేస్తాడు. ప్రభువైన యెహోవా ప్రతివాడి ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేస్తాడు. భూమి మీద నుండి తన ప్రజల నిందను తీసివేస్తాడు. ఇలా జరుగుతుందని యెహోవా సెలవిచ్చాడు.
Isaiah 51:17 in Telugu 17 యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.
Isaiah 52:1 in Telugu 1 సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు.
Isaiah 60:1 in Telugu 1 లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది.
Ezekiel 37:1 in Telugu 1 యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు.
Daniel 12:2 in Telugu 2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.
Hosea 6:2 in Telugu 2 రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.
Hosea 13:14 in Telugu 14 అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా? మృత్యువు నుండి వారిని రక్షిస్తానా? ఓ మరణమా, నీవు తెచ్చే బాధలు ఎక్కడ? వాటిని ఇటు తీసుకురా. పాతాళమా, నీ నాశనం ఏది? దాన్ని ఇటు తీసుకురా. నాకు కనికరం పుట్టదు.
Hosea 14:5 in Telugu 5 చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను. తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు. లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.
Zechariah 8:12 in Telugu 12 సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు కాపు కాస్తాయి. భూమి పంటలనిస్తుంది. ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఈ ప్రజల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను ఆస్తిగా ఇస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.
Matthew 27:52 in Telugu 52 సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి.
Matthew 27:58 in Telugu 58 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.
John 5:28 in Telugu 28 “దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
John 11:25 in Telugu 25 అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు,
Acts 24:15 in Telugu 15 నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతశాఖ అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను.
1 Corinthians 15:20 in Telugu 20 కానీ ఇప్పుడు క్రీస్తు తిరిగి లేవడం ద్వారా చనిపోయిన వారిలో నుండి లేచిన వారిలో ప్రథమఫలం అయ్యాడు.
1 Corinthians 15:22 in Telugu 22 ఆదాములో అందరూ ఏ విధంగా చనిపోతున్నారో, అదే విధంగా క్రీస్తులో అందరూ బ్రతికించబడతారు.
Ephesians 5:14 in Telugu 14 బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
Philippians 3:10 in Telugu 10 ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, అయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా అయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను.
Philippians 3:21 in Telugu 21 సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.
1 Thessalonians 4:14 in Telugu 14 యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
Revelation 11:8 in Telugu 8 వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.
Revelation 20:5 in Telugu 5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం.
Revelation 20:12 in Telugu 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.