Isaiah 14:32 in Telugu 32 ఆ దేశ వార్తాహరుడికి ఇవ్వాల్సిన జవాబేది? యెహోవా సీయోనును స్థాపించాడు. ఆయన ప్రజల్లో బాధకు గురైన వాళ్లకు దానిలో ఆశ్రయం దొరుకుతుంది.”
Other Translations King James Version (KJV) What shall one then answer the messengers of the nation? That the LORD hath founded Zion, and the poor of his people shall trust in it.
American Standard Version (ASV) What then shall one answer the messengers of the nation? That Jehovah hath founded Zion, and in her shall the afflicted of his people take refuge.
Bible in Basic English (BBE) What answer, then, will my people give to the representatives of the nation? That the Lord is the builder of Zion, and she will be a safe place for the poor of his people.
Darby English Bible (DBY) And what shall be answered to the messengers of the nation? That Jehovah hath founded Zion, and the afflicted of his people find refuge in it.
World English Bible (WEB) What then shall one answer the messengers of the nation? That Yahweh has founded Zion, and in her shall the afflicted of his people take refuge.
Young's Literal Translation (YLT) And what doth one answer the messengers of a nation? `That Jehovah hath founded Zion, And in it do the poor of His people trust!'
Cross Reference 2 Samuel 8:10 in Telugu 10 హదదెజెరు, తోయిల మధ్య విరోధం ఉంది. వాళ్ళ మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దావీదు హదదెజెరుతో యుద్ధం చేసి అతణ్ణి ఓడించాడు. ఆ వార్త తెలుసుకున్న తోయి తన కొడుకు యోరాము ద్వారా బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి, క్షేమ సమాచారాలు అడిగి దావీదుతో కలసి సంతోషించి సమయం గడపడానికి దావీదు దగ్గరికి పంపించాడు.
2 Kings 20:12 in Telugu 12 ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు.
Psalm 87:1 in Telugu 1 కోరహు వారసుల కీర్తన. ఒక పాట. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
Psalm 87:5 in Telugu 5 సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
Psalm 102:16 in Telugu 16 యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.
Psalm 102:28 in Telugu 28 నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.
Psalm 132:13 in Telugu 13 తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.
Proverbs 18:10 in Telugu 10 యెహోవా నామం బలమైన దుర్గం. నీతిపరుడు అందులో తలదాచుకుని సురక్షితంగా ఉంటాడు.
Isaiah 4:6 in Telugu 6 ఆ మహిమ పగలు ఎండకు నీడగానూ, గాలివానకు ఆశ్రయంగానూ, పైకప్పుగానూ ఉంటుంది.
Isaiah 11:4 in Telugu 4 కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు. తాను విన్న దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీరుస్తాడు. భూనివాసుల్లో దీనులైన వాళ్లకు నిజాయితీగా విమర్శ చేస్తాడు. తన నోటి దండంతో లోకాన్ని కొడతాడు. తన పెదవుల ఊపిరితో దుర్మార్గులను హతం చేస్తాడు.
Isaiah 12:6 in Telugu 6 గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”
Isaiah 25:4 in Telugu 4 ఎందుకంటే దరిద్రులకు నీవు భద్రతగాను, అవసరతలో ఉన్నవారికి సంరక్షకునిగానూ ఉన్నావు. గాలివానలో ఆశ్రయంగాను వేసవిలో నీడగానూ ఉన్నావు. నిర్దయుల ఊపిరి సెగలాగా గోడకి తగులుతున్న తుఫానులాగా ఉంటే నీవు కవచంగా ఉన్నావు.
Isaiah 28:16 in Telugu 16 దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.
Isaiah 37:9 in Telugu 9 కూషు రాజు తిర్హాకా తనపై యుద్ధం చేయడానికి వచ్చాడని అష్షూరురాజు సన్హెరీబు విన్నాడు. అప్పుడు అతడు తన దూతలతో హిజ్కియాకు ఒక సందేశం పంపాడు.
Isaiah 37:32 in Telugu 32 మిగిలినవారు యెరూషలేములో నుండి, తప్పించుకొన్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరతారు. సైన్యాల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.
Isaiah 39:1 in Telugu 1 ఆ సమయంలో బబులోను రాజు, బలదాను కొడుకు అయిన మెరోదక్ బలదాను హిజ్కియా జబ్బు చేసి బాగుపడ్డాడని విని తన రాయబారులతో ఒక కానుకతోబాటు శుభాకాంక్షల సందేశాన్ని అతనికి పంపించాడు.
Isaiah 44:28 in Telugu 28 కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”
Isaiah 54:11 in Telugu 11 బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను.
Zephaniah 3:12 in Telugu 12 దుఃఖితులైన దీనులను యెహోవా నామాన్ని ఆశ్రయించే జనశేషంగా నీమధ్య ఉండనిస్తాను.
Zechariah 11:7 in Telugu 7 కాబట్టి నేను రెండు కర్రలు తీసుకున్నాను. ఒక దాని పేరు “అనుగ్రహం.” రెండవ దాని పేరు “ఐక్యం.” వధకు సిద్ధంగా ఉన్న వాటిలో బలహీనమైన వాటికి కాపరినయ్యాను.
Zechariah 11:11 in Telugu 11 దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
Matthew 16:18 in Telugu 18 ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు.
Matthew 24:15 in Telugu 15 “కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),
Hebrews 12:22 in Telugu 22 ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.
James 2:5 in Telugu 5 నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?