Hosea 3:5 in Telugu 5 తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు.
Other Translations King James Version (KJV) Afterward shall the children of Israel return, and seek the LORD their God, and David their king; and shall fear the LORD and his goodness in the latter days.
American Standard Version (ASV) afterward shall the children of Israel return, and seek Jehovah their God, and David their king, and shall come with fear unto Jehovah and to his goodness in the latter days.
Bible in Basic English (BBE) And after that, the children of Israel will come back and go in search of the Lord their God and David their king; and they will come in fear to the Lord and to his mercies in the days to come.
Darby English Bible (DBY) Afterwards shall the children of Israel return, and seek Jehovah their God, and David their king; and shall turn with fear toward Jehovah and toward his goodness, at the end of the days.
World English Bible (WEB) Afterward the children of Israel shall return, and seek Yahweh their God, and David their king, and shall come with trembling to Yahweh and to his blessings in the last days.
Young's Literal Translation (YLT) Afterwards turned back have the sons of Israel, and sought Jehovah their God, and David their king, and have hastened unto Jehovah, and unto His goodness, in the latter end of the days.
Cross Reference Numbers 24:14 in Telugu 14 కాబట్టి, చూడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. కాని, ముందు రోజుల్లో ఈ ప్రజలు నీ ప్రజలకు ఏం చేస్తారో, ఆ హెచ్చరిక నీకు నేనివ్వాలి” అన్నాడు.
Deuteronomy 4:30 in Telugu 30 ఈ సంగతులన్నీ జరిగి మీకు బాధ కలిగినప్పుడు చివరి రోజుల్లో మీరు మీ యెహోవా దేవుని వైపు చూసి ఆయన మాటకు లోబడినప్పుడు
1 Kings 12:16 in Telugu 16 కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.
Psalm 130:3 in Telugu 3 యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు.
Isaiah 2:2 in Telugu 2 చివరి రోజుల్లో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు.
Isaiah 27:12 in Telugu 12 ఆ రోజున యెహోవా ప్రవహిస్తున్న యూఫ్రటీసు నది నుండి ఐగుప్తు వాగు వరకూ వాళ్ళను ధాన్యాన్ని నూర్చినట్టు నూరుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలైన మిమ్మల్ని ఒక్కొక్కరిగా సమకూరుస్తాడు.
Isaiah 55:3 in Telugu 3 శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను.
Jeremiah 3:22 in Telugu 22 ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను. “మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరకే మేం వస్తున్నాం” అనే ఈ మాటలన్నీ అబద్ధాలు.
Jeremiah 23:5 in Telugu 5 యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.
Jeremiah 30:9 in Telugu 9 కాని, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధించి, నేను వాళ్ళ మీద రాజుగా చేసే తమ రాజైన దావీదును సేవిస్తారు.
Jeremiah 30:24 in Telugu 24 తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.”
Jeremiah 31:6 in Telugu 6 ఎఫ్రాయిము పర్వతాల మీద కాపలావాళ్ళు ‘మన దేవుడైన యెహోవా దగ్గరికి, సీయోనుకు ఎక్కి వెళ్దాం రండి’ అని ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది.”
Jeremiah 33:9 in Telugu 9 నేను వాళ్ళ కోసం చెయ్యబోతున్న మంచి సంగతులు విన్న భూజనులందరి ఎదుట, వాళ్ళు నా ఆనందానికి, స్తోత్ర గీతానికి, ఘనతకు కారణంగా ఉంటారు. నేను వారికి ఇచ్చే మంచి విషయాలు, శాంతి కారణంగా వాళ్ళు భయపడతారు.’”
Jeremiah 33:17 in Telugu 17 ఎందుకంటే, యెహోవా ఇలా అంటున్నాడు “ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోడానికి దావీదు సంతతివాడు ఒకడు లేకుండా పోడు,
Jeremiah 50:4 in Telugu 4 ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “ఆ రోజుల్లో ఆ సమయంలో యూదా ప్రజలూ, ఇశ్రాయేలు ప్రజలూ ఏడుస్తూ తమ దేవుడైన యెహోవాను వెదకడానికి కలిసి వస్తారు.
Ezekiel 16:63 in Telugu 63 నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.” ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.
Ezekiel 34:23 in Telugu 23 వాటిని మేపడానికి నేను నా సేవకుడు దావీదును వాటి మీద కాపరిగా నియమిస్తాను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుతాడు.
Ezekiel 37:22 in Telugu 22 వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను.
Ezekiel 38:8 in Telugu 8 చాల రోజుల తరువాత నీకు పిలుపు వస్తుంది. వివిధ జనాల్లో చెదరిపోయి, కొన్ని సంవత్సరాల తరవాత ఖడ్గం నుండి తప్పించుకుని, ఎప్పుడూ పాడై ఉండే ఇశ్రాయేలీయుల పర్వతాల మీద నివసించడానికి మళ్ళీ సమకూడిన ప్రజల దగ్గరికి, అంటే వివిధ జనాల్లోనుండి తిరిగి వచ్చి నిర్భయంగా నివసించే వారి దగ్గరికి నీవు వెళ్తావు.
Ezekiel 38:16 in Telugu 16 మేఘం భూమిని కమ్మినట్లు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద పడతారు. చివరి రోజుల్లో అది జరుగుతుంది. గోగూ, అన్యజనాలు నన్ను తెలుసుకొనేలా నేను నా దేశం మీదికి నిన్ను రప్పించి నిన్నుబట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటాను.”
Daniel 2:28 in Telugu 28 అయితే గుప్తంగా ఉన్న విషయాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మీరు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మనస్సులోకి వచ్చిన దర్శనం ఏమిటో మీకు తెలియజేస్తాను.
Daniel 10:14 in Telugu 14 ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.
Hosea 5:6 in Telugu 6 వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని, ఆయన వారికి కనబడడు. ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు.
Hosea 5:15 in Telugu 15 వారు తమ దోషాన్ని ఒప్పుకుని నన్ను వెదికే వరకూ నేను నా చోటికి తిరిగి వెళ్ళను. తమ దురవస్థలో వారు నన్ను మనస్ఫూర్తిగా వెదికే సమయం దాకా నేను వదిలిపెట్టను.
Amos 9:11 in Telugu 11 పడిపోయిన దావీదు గుడారాన్ని ఆ రోజు నేను లేవనెత్తి దాని గోడలను బాగుచేస్తాను. శిథిలాలను లేపుతాను. ముందు ఉన్నట్టు దాన్ని తిరిగి నిర్మిస్తాను.
Micah 4:1 in Telugu 1 చివరిరోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.
Acts 15:16 in Telugu 16 ‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను. మనుషుల్లో మిగిలినవారూ, నా నామం ఎవరైతే ధరించారో ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా
Romans 2:4 in Telugu 4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?
Romans 11:25 in Telugu 25 సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి.