Hebrews 8:9 in Telugu 9 ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది. ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు. నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.”
Other Translations King James Version (KJV) Not according to the covenant that I made with their fathers in the day when I took them by the hand to lead them out of the land of Egypt; because they continued not in my covenant, and I regarded them not, saith the Lord.
American Standard Version (ASV) Not according to the covenant that I made with their fathers In the day that I took them by the hand to lead them forth out of the land of Egypt; For they continued not in my covenant, And I regarded them not, saith the Lord.
Bible in Basic English (BBE) Not like the agreement which I made with their fathers when I took them by the hand, to be their guide out of the land of Egypt; for they did not keep the agreement with me, and I gave them up, says the Lord.
Darby English Bible (DBY) not according to the covenant which I made to their fathers in [the] day of my taking their hand to lead them out of the land of Egypt; because *they* did not continue in my covenant, and *I* did not regard them, saith [the] Lord.
World English Bible (WEB) Not according to the covenant that I made with their fathers, In the day that I took them by the hand to lead them out of the land of Egypt; For they didn't continue in my covenant, And I disregarded them," says the Lord.
Young's Literal Translation (YLT) not according to the covenant that I made with their fathers, in the day of My taking `them' by their hand, to bring them out of the land of Egypt -- because they did not remain in My covenant, and I did not regard them, saith the Lord, --
Cross Reference Genesis 19:16 in Telugu 16 అయితే అతడు ఆలస్యం చేసాడు. యెహోవా అతని పట్ల కనికరం చూపడం వల్ల ఆ మనుషులు అతని చేతినీ, అతని భార్య చేతినీ అతని ఇద్దరు కూతుళ్ళ చేతులనూ పట్టుకున్నారు. వాళ్ళని బయటకు తీసుకువచ్చారు. అలానే పట్టణం బయటకు తీసుకువచ్చారు.
Exodus 19:4 in Telugu 4 ‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.
Exodus 24:3 in Telugu 3 మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం” అని ముక్త కంఠంతో జవాబిచ్చారు.
Exodus 32:8 in Telugu 8 వాళ్ళు పాటించాలని నేను నియమించిన ఉపదేశాల నుండి అప్పుడే తప్పిపోయారు. వాళ్ళ కోసం పోత పోసిన దూడ విగ్రహం తయారు చేసుకుని దానికి సాగిలపడి బలులు అర్పించి ‘ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే’ అని చెప్పుకుంటున్నారు.”
Exodus 34:10 in Telugu 10 అందుకు ఆయన “ఇదిగో, నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకూ భూమిపై ఎక్కడైనా, ఏ ప్రజల్లోనైనా ఇంత వరకూ చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి.
Exodus 34:27 in Telugu 27 యెహోవా మోషేతో ఇంకా చెప్పాడు “ఇప్పుడు పలికిన మాటలు రాసి ఉంచు. ఎందుకంటే ఈ మాటలను బట్టి నేను నీతో, ఇశ్రాయేలు ప్రజలతో ఒప్పందం చేసుకుంటున్నాను.”
Deuteronomy 5:2 in Telugu 2 మన దేవుడు యెహోవా హోరేబులో మనతో ఒప్పందం చేశాడు.
Deuteronomy 29:1 in Telugu 1 యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కాకుండా ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన మాటలు ఇవే.
Deuteronomy 29:12 in Telugu 12 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా
Deuteronomy 29:25 in Telugu 25 అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. ‘వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు.
Deuteronomy 31:16 in Telugu 16 యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “చూడు. నువ్వు చనిపోయి నీ పితరుల దగ్గరికి చేరుకోబోతున్నావు. ఈ ప్రజలు బయలుదేరి ఏ దేశ ప్రజల మధ్య ఉండబోతున్నారో ఆ ప్రజల మధ్య, ఆ అన్య దేవుళ్ళను అనుసరించి వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసిన నిబంధన మీరతారు.
Joshua 23:15 in Telugu 15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చేసిన వాగ్దానాలన్నీ మీకు నెరవేరినట్టుగా మీ దేవుడైన యెహోవా మీ కిచ్చిన ఈ మంచి ప్రదేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింపచేసే వరకూ యెహోవా మీ మీదికి కీడులన్నీ రప్పిస్తాడు.
Judges 10:13 in Telugu 13 అయితే మీరు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను పూజించారు గనుక నేను ఇక మిమ్మల్ని రక్షించను.
2 Kings 17:15 in Telugu 15 వారు ఆయన కట్టడలనూ, తమ పితరులతో ఆయన చేసిన నిబంధననూ, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్నీ విడిచి పెట్టి వ్యర్థమైన వాటిని చేశారు. “వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు” అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు.
Job 8:20 in Telugu 20 ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.
Psalm 77:20 in Telugu 20 మోషే అహరోనుల ద్వారా నీ ప్రజలను మందలాగా నడిపించావు.
Psalm 78:10 in Telugu 10 వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.
Psalm 78:52 in Telugu 52 ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు.
Psalm 78:57 in Telugu 57 తమ పూర్వికుల్లాగా వారు అపనమ్మకస్తులై ద్రోహం చేశారు. పనికిరాని విల్లులాగా నిష్ప్రయోజకులయ్యారు.
Psalm 105:43 in Telugu 43 తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.
Psalm 136:11 in Telugu 11 ఈజిప్టు ప్రజల మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు రప్పించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Song of Solomon 8:5 in Telugu 5 ఆరవ భాగం - ముగింపు (యెరూషలేము స్త్రీలు మాట్లాడుతున్నారు) తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను. అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది.
Isaiah 24:5 in Telugu 5 లోక నివాసులు ధర్మ శాసనాలు అతిక్రమించారు. నియమాన్ని మార్చి నిత్య నిబంధనను మీరారు. దాని నివాసుల చేత లోకం అపవిత్రమైపోయింది.
Isaiah 40:11 in Telugu 11 ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.
Isaiah 41:13 in Telugu 13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.
Isaiah 51:18 in Telugu 18 ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు.
Isaiah 63:9 in Telugu 9 వారి బాధలన్నిటిలో ఆయన బాధ అనుభవించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, కనికరంతో వారిని రక్షించాడు. పురాతన దినాలన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ మోస్తూ వచ్చాడు.
Isaiah 63:11 in Telugu 11 ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి?
Jeremiah 11:7 in Telugu 7 ఐగుప్తులో నుండి మీ పూర్వికులను రప్పించిన రోజు మొదలుకుని నేటివరకూ వారితో ‘నా మాట వినండి’ అని నేను గట్టిగా, ఖండితంగా చెబుతూ వచ్చాను.
Jeremiah 22:8 in Telugu 8 అనేక దేశాలవాళ్ళు ఈ పట్టణపు దారిలో నడుస్తారు. “ఈ గొప్ప పట్టణాన్ని యెహోవా ఎందుకు ఇలా చేశాడు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు.
Jeremiah 31:32 in Telugu 32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు.
Lamentations 4:16 in Telugu 16 యెహోవా తన సన్నిధిలోనుంచి వాళ్ళను చెదరగొట్టాడు. ఇంక ఆయన వాళ్ళను పట్టించుకోడు. ఇంక యాజకులపట్ల ఎవరూ గౌరవం చూపించరు. పెద్దల పట్ల ఎవరూ దయ చూపించరు.
Ezekiel 16:8 in Telugu 8 మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూశాను. చూడు! ప్రేమ కలిగించే ప్రాయం నీకు వచ్చింది గనక నా వస్త్రంతో నీ నగ్నత్వాన్ని కప్పాను. ఆ తరవాత నేను నీతో ఒప్పందం చేశాను.” ఇది ప్రభువైన యెహోవా చేసిన ప్రకటన. “అప్పుడు నువ్వు నా దానివయ్యావు.
Ezekiel 16:59 in Telugu 59 యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు. “చేసిన ప్రమాణాన్ని చులకనగా ఎంచి, ఒప్పందం భంగ పరిచే ఎవరికైనా ఏమి చేస్తానో అదే నీకు చేస్తాను.
Ezekiel 20:37 in Telugu 37 “నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన ఒడంబడికలోకి మిమ్మల్ని తీసుకొస్తాను.
Amos 5:22 in Telugu 22 నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
Malachi 2:13 in Telugu 13 మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.
Mark 8:23 in Telugu 23 యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు.
Acts 9:8 in Telugu 8 సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు.
Acts 13:11 in Telugu 11 ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు.
Galatians 3:15 in Telugu 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.
Galatians 4:24 in Telugu 24 ఈ విషయాలను అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు.
Hebrews 9:18 in Telugu 18 కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు.