Ezekiel 5:8 in Telugu 8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి, నేనే మీకు విరోధంగా చర్యలు తీసుకుంటాను. ఇతర జాతులు చూస్తూ ఉండగా మీ మధ్య నా తీర్పు అమలు పరుస్తాను.
Other Translations King James Version (KJV) Therefore thus saith the Lord GOD; Behold, I, even I, am against thee, and will execute judgments in the midst of thee in the sight of the nations.
American Standard Version (ASV) therefore thus saith the Lord Jehovah: Behold, I, even I, am against thee; and I will execute judgments in the midst of thee in the sight of the nations.
Bible in Basic English (BBE) For this cause the Lord has said: See, I, even I, am against you; and I will be judging among you before the eyes of the nations.
Darby English Bible (DBY) therefore thus saith the Lord Jehovah: Behold, I, even I, am against thee, and will execute judgments in the midst of thee in the sight of the nations;
World English Bible (WEB) therefore thus says the Lord Yahweh: Behold, I, even I, am against you; and I will execute judgments in the midst of you in the sight of the nations.
Young's Literal Translation (YLT) Therefore, thus said the Lord Jehovah: Lo, I `am' against thee, even I, And I have done in thy midst judgments, Before the eyes of the nations.
Cross Reference Leviticus 26:17 in Telugu 17 మీ నుండి ముఖం తిప్పేసుకుంటాను. మీ శత్రువులు మిమ్మల్ని లోబరచుకుంటారు. మిమ్మల్ని ద్వేషించేవారు మిమ్మల్ని పరిపాలిస్తారు. ఎవరూ తరమకపోయినా మీరు పారిపోతారు.
Deuteronomy 29:20 in Telugu 20 యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచివేస్తాడు.
Deuteronomy 29:23 in Telugu 23 యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి,
1 Kings 9:8 in Telugu 8 ఈ మందిరం మీదుగా వెళ్ళేవారంతా చూసి, ఆశ్చర్యపడి, ‘అరెరే, యెహోవా ఈ దేశానికి, ఈ మందిరానికి ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు.
Jeremiah 21:5 in Telugu 5 నేనే నా బలమైన చెయ్యి చాపి తీవ్రమైన కోపంతో, రౌద్రంతో, ఆగ్రహంతో మీమీద యుద్ధం చేస్తాను.
Jeremiah 21:13 in Telugu 13 “లోయలో నివసించేదానా, మైదానంలోని బండవంటిదానా, ‘మా మీదికి ఎవరు వస్తారు? మా ఇళ్ళల్లో ఎవరు అడుగుపెడతారు?’ అని నువ్వు అనుకుంటున్నావు.
Jeremiah 22:8 in Telugu 8 అనేక దేశాలవాళ్ళు ఈ పట్టణపు దారిలో నడుస్తారు. “ఈ గొప్ప పట్టణాన్ని యెహోవా ఎందుకు ఇలా చేశాడు?” అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటారు.
Jeremiah 24:9 in Telugu 9 వాళ్ళను చెదరగొట్టిన ప్రపంచ రాజ్యాలన్నిటిలో నేను వాళ్ళను తోలివేసే స్థలాలన్నిటిలో వాళ్ళను భయకారణంగా విపత్తుగా నిందాస్పదంగా సామెతగా అపహాస్యంగా శాపంగా ఉంచుతాను.
Jeremiah 50:7 in Telugu 7 వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారంతా వాళ్ళను మింగివేస్తూ వచ్చారు. వాళ్ళ శత్రువులు ‘మేం అపరాధులం కాము. ఎందుకంటే వీళ్ళు తమ నిజమైన నివాసం, తమ పూర్వీకులకు ఆధారం అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.’ అన్నారు.
Lamentations 2:5 in Telugu 5 ప్రభువు శత్రువులా అయ్యాడు. ఆయన ఇశ్రాయేలును మింగివేశాడు. దాని రాజమందిరాలన్నీ మింగివేశాడు. దానికి పట్టున్న ప్రాంతాలన్నీ నాశనం చేశాడు. యూదా కుమారిలో దుఃఖం, సంతాపం అధికం చేశాడు.
Lamentations 2:15 in Telugu 15 దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ, “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.
Lamentations 3:3 in Telugu 3 నిజంగా ఆయన నా మీద తిరగబడ్డాడు. రోజంతా నన్ను శిక్షిస్తున్నాడు.
Ezekiel 11:9 in Telugu 9 “నేను మిమ్మల్ని పట్టణంలో నుండి తీసివేస్తాను. మీకు శిక్ష విధిస్తాను. మిమ్మల్ని విదేశీయుల చేతులకు అప్పగిస్తాను.
Ezekiel 15:7 in Telugu 7 నేను వారికి విరోధంగా ఉంటాను. వాళ్ళు అగ్ని నుండి తప్పించుకున్నా తిరిగి అగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. నేను వాళ్లకి విరోధంగా ఉంటాను. అప్పుడు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.
Ezekiel 21:3 in Telugu 3 యెహోవా చెప్పేదేమంటే, నేను నీకు విరోధిని. నీతిమంతుడుగాని, దుష్టుడుగాని నీలో ఎవరూ ఉండకుండాా అందరినీ నీనుంచి తెంచివేయడానికి నా కత్తి దూసి ఉన్నాను.
Ezekiel 25:2 in Telugu 2 “నరపుత్రుడా, అమ్మోనీయుల వైపు ముఖం తిప్పి వాళ్ళను గూర్చి వాళ్లకు విరుద్ధంగా ప్రవచించు.
Ezekiel 26:2 in Telugu 2 “నరపుత్రుడా, తూరు యెరూషలేము గురించి ‘ఆహా’ అంటూ ‘ప్రజల ప్రాకారాలు పడిపోయాయి, ఆమె నావైపు తిరిగింది. ఆమె పాడైపోయినందువలన మేము వర్దిల్లుతాం’ అని చెప్పాడు.”
Ezekiel 28:22 in Telugu 22 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, సీదోనూ, నేను నీకు విరోధిని. నీ మధ్య నాకు ఘనత వస్తుంది. నేను నీ మధ్య తీర్పు తీరుస్తూ ఉన్నపుడు నేను యెహోవానని నీ ప్రజలు తెలుసుకుంటారు. నన్ను నేను పవిత్రునిగా మీ మధ్య కనుపరచుకుంటాను.
Ezekiel 29:6 in Telugu 6 అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు. ఐగుప్తు, ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది.
Ezekiel 35:3 in Telugu 3 “యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, శేయీరు పర్వతమా! నేను నీకు వ్యతిరేకిని. నా చెయ్యి నీ మీద చాపి నిన్ను పాడుగా నిర్జనంగా చేస్తాను.
Ezekiel 35:10 in Telugu 10 యెహోవా అక్కడ ఉన్నా, ఆ రెండు రాజ్యాలూ ఆ రెండు ప్రాంతాలూ మనవే. మనం వాటిని స్వాధీనం చేసుకుందాం రండి. అని నీవు అన్నావు.
Ezekiel 39:1 in Telugu 1 నరపుత్రుడా, గోగును గూర్చి ఇలా ప్రవచించు. “ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాలకు అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినయ్యాను.
Zechariah 14:2 in Telugu 2 ఎందుకంటే యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను ఇతర దేశాల ప్రజలను సమకూర్చబోతున్నాను. అప్పుడు పట్టణం శత్రువు చేజిక్కుతుంది. ఇళ్ళు దోచుకుంటారు. స్త్రీలకు మానభంగాలు జరుగుతాయి. నగరంలో సగానికి పైగా బందీలుగా వెళ్ళిపోతారు. మిగిలినవారు నాశనం కాకుండా నగరంలోనే మిగిలిపోతారు.
Matthew 22:7 in Telugu 7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.